Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
భార్యా భర్తల మధ్య గొడవలు సహజం.. వాటిని అధికమించే ప్రయత్నం చేస్తూనే వుండాలి..!
వైవాహిక జీవితంలో సుఖ దు:ఖాలు రెండూ వుంటాయ్. రెండింటినీ చేధించుకుంటూ ముందుకు వెళ్లాలి. అప్పుడు మాత్రమే వారి వైవాహిక జీవితం సంతోషంగా వుంటుంది. తప్పులు జరిగిన ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్లాలి. పెళ్లంటేనే ఆనందం, దుఖం, సంతోషం, ప్రేమ, గొడవలు, ఇలా అన్నీ వుంటాయన్న సృహను ముందే కలిగి వుండాలి. ఎన్ని గొడవలు అయినప్పటికీ చాలా మంది తమ రిలేషన్‌షిప్‌పై అనుమానం పడుతుంటారు. తాము సరైన బంధంలో లేరేమోనని అభిప్రాయానికి వస్తుంటారు. బంధంలో అలాగే కొనసాగడం ఇప్పుడు చాలా మంది జంటలకు ఒక పెద్ద చాలెంజ్‌గా మారింది. ఓపిక, ప్రేమ, అర్ధం చేసుకునే మనస్తత్వం వుంటే ఈ సంఘర్షనను కూడా దాటుకొని వైవాహిక జీవితంలో సంతోషంగా వుండవచ్చు.
మాట్లాడుకోవాలి
భార్యా భర్తల మధ్య ఎన్ని గొడవలు వచ్చినప్పటికీ ఇద్దరూ తప్పనిసరిగా కమ్యునికేషన్ చేసుకోవాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటేనే సమస్య తగ్గే అవకాశం వుంది. లేదంటే ఇద్దరి మధ్య మరింత దూరం పెరుగుతుంది. మాట్లాడుకున్నప్పుడు ఒకరి సమస్యలను మరొకరితో షేర్ చేసుకోగలుగుతారు. ఒకరి బాధలను ఒకరు అర్థం చేసుకోగలగాలి. అలాంటి జంట మాత్రమే ఎన్ని సమస్యలనైనా కలిసి ఎదుర్కోగలుగుతారు.

సహాయం
బంధం విచ్ఛిన్నమవుతుందని అనిపిస్తున్నప్పుడు భార్య భర్తలు తమ రిలేషన్‌షిప్‌ను బలపరుచుకోవడానికి ఏమి చేయాలో తెలియనప్పుడు బయటి నిపుణుల నుంచి సలహా తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. మ్యారేజ్ కౌన్సిలింగ్ సెంటర్లు, కపుల్స్ కౌన్సిలింగ్ సెంటర్లు కత్తగా ప్రారంభమయ్యాయి. వీటిని ఆశ్రయించడం వల్ల భార్యా భర్తలకు వున్న సమస్య తగ్గే అవకాశం వుంది.
ప్రాధాన్యత
మీ భాగస్వామికి సంబంధించిన అన్ని వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలి. అలాగే మీరు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యలపైన కూడా దృష్టి పెట్టాలి. రిలేషన్‌షిప్‌లో ఎన్ని గొడవలు వచ్చినప్పటికీ మీరు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవచ్చు. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, పౌష్టికాహారన్ని తప్పకుండా తీసుకోవాలి. మానిసక ఒత్తిడి తగ్గడానికి రోజు అరగంట వరకు ధ్యానం చేయాలి. దీని వల్ల మెదడు విశ్రాంతిగా అవుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా వుంటుంది.

సమస్యలను తెలుసుకోవాడ
ఇద్దరి వివాహ బంధంలో గొడవలు ఎక్కడ ప్రారంభమయ్యాయ్. సమస్య అసలు ఎక్కడ పుట్టిందో ఇద్దరూ కలిసి కూర్చొని చర్చించుకోవాలి. వేటికి సంబంధించి ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయో గుర్తించుకోవాలి. వాటిని సమర్ధవంతంగా ఎలా అధికమించవచ్చో కూర్చొని ఒపికతో సమయం కేటాయించి పరిష్కరించుకోవాలి. ఇది జరగాలంటే ముందుగా ఇద్దరు ఖచ్ఛితంగా కమ్యునికేట్ చేసుకోవాలి.
సమస్య నుంచి బయటపడ్డం
ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న సమస్య నుంచి ఎలా బయటపడవచ్చు. దానికి వున్న మార్గాలు ఏంటో అన్వేశించాలి. మీ బంధంలో మీరు ఇద్దరు కలిసి కొన్ని లక్ష్యాలను పెట్టుకోవాలి. ఆ లక్ష్యాలి ఆర్థికానికి సంబంధించింది కావచ్చు, మీ ఇద్దరి ప్రేమకు సంబంధించింది కావచ్చు, ఇద్దరూ కలిసి బయటకు వెళ్లడం, రోజూ కలిసి సమయం కేటాయించుకోవడానికి సంబంధించింది కావచ్చు, అదే ఏ లక్ష్యమైనా దాన్ని చేరుకోవడానికి ఇద్దరూ కలిసి కృషి చేయాలి. ఏ సమస్య వచ్చినా ఇద్దరూ కలిసి పరిష్కరించుకోవడానికి రెడీ అయితే ఇక ఇద్దరి బంధం వీడదీయలేనంత బలంగా వుంటుంది



Click it and Unblock the Notifications