Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ఎక్కువసేపు శృంగారం చేయాలని ఉందా? ఇలా చేస్తే రాత్రంతా జాగారమే
క్రికెట్ లో అయినా, శృంగారంలో అయినా త్వరగా ఔట్ అయిపోవాలని ఎవరూ కోరుకోరు. స్టేడియంలో బ్యాటింగ్‌కు దిగితే సెంచరీ చేయాలనే అనుకుంటారు అందరూ. అలాగే బెడ్రూములో రతిక్రీడలో పాల్గొంటే సంతృప్తి చెందే వరకు, చాలా సేపు చేస్తూ ఉండాలని, ఇద్దరూ భావప్రాప్తి చెందాలని కోరుకుంటారు. కానీ చాలా మంది మధ్యలోనే ఔట్ అయిపోతారు. 2 రన్స్ కొట్టగానే పెవిలియన్ చేరే వారే చాలా మందే ఉంటారు. చాలా సేపు చేయాలని ఉన్నా.. అది కుదరక, సాధ్యంకాక అప్‌సెట్ అయిపోతారు.

శృంగారం అనే మత్తును, భాగస్వామి మెత్తని ఒత్తిళ్లను మొదటి నుంచి చివరి వరకు ఆస్వాదిస్తేనే దాని మధురమైన అనుభూతి తెలిసివస్తుంది. శృంగారం అనగానే కొంత మంది తెగ ఎగ్జైట్ అయిపోతారు. గాబరా పడిపోతారు. దాని వల్ల స్త్రీలకు శృంగార తృప్తి మొదలవుతున్న సమయంలోనే పురుషులు ఔట్ అయిపోతారు. ఇలాంటి శృంగారం వల్ల పురుషులకు ఎలాంటి సంతృప్తి ఉండదు. మహిళలకు సంతృప్తి ఉండకపోగా.. తీవ్రమైన అసంతృప్తి, నిరాశ ఉంటుంది.
సెక్స్ డ్రైవ్ ఎక్కువ సేపు ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని సెక్స్ నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలేమిటో, వాటి వల్ల ఎక్కువ సేపు సెక్స్ చేసి ఎంజాయ్ చేయగలగడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.
అతిగా తింటే అతిగా చేయలేరు:
సెక్స్ కు ముందు అతిగా తినొద్దు. పొట్ట నిండా తింటే కొద్ది సేపు కదిలితే ఆయాసం వచ్చేస్తుంది. అలా అని మొత్తానికి తినకుండా ఉండే ఎనర్జీ ఉండదు. కాబట్టి ముందుగా తినడం, కొద్ది మొత్తంలో తినడం, మంచి ఆహారం తినడం వల్ల సెక్స్ డ్రైవ్ పెంచుకోవచ్చు.
సున్నితత్వం:
కొందరి అంగం మరీ సున్నితంగా ఉంటుంది. శృంగార సమయంలో జరిగే కొద్ది పాటి రాపిడి వల్ల తీవ్ర ఉద్వేగానికి గురై త్వరగా స్ఖలిస్తారు. అలాంటి అంగం ఉన్నవారు వైద్యుల సూచన మేరకు లిడోకాయిన్, ప్రిలోకైన వంటివి వాడాలి. వీటి వల్ల త్వరగా స్ఖలనం జరగదు.
స్టాప్ అండ్ స్టార్ట్:
సంభోగం చేసే సమయంలో పురుషాంగానికి జరిగే రాపిడి వల్ల స్ఖలనం జరుగుతుంది. అయితే స్ఖలనం జరిగే కొన్ని సెకన్ల ముందు ఆ విషయం తెలిసిపోతుంది. అలాంటి సమయంలో వెంటనే సంభోగాన్ని ఆపాలి. కొన్ని సెకన్ల పాటు అలా ఆపడం వల్ల స్ఖలనం ఆగుతుంది. తర్వాత మళ్లీ సంభోగం కొనసాగించవచ్చు.
కండోమ్ వాడొచ్చు:
పురషాంగానికి ఎక్కువగా రాపిడి వల్ల త్వరగా స్ఖలనం జరుగుతుంది. అలా అవకూడదంటే.. కండోమ్ చక్కగా హెల్ప్ చేస్తుంది. కండోమ్ పురుషాంగానికి ఒక అవరోధాన్ని ఏర్పరుస్తుంది. అలా సున్నితత్వం తగ్గుతుంది. కండోమ్ వాడితే ఆ ఫీల్ రావట్లేదు అనుకూనే వాళ్లు.. డాటెడ్, ఎక్స్‌ట్రా డాటెడ్, ఆల్ట్రా థిన్ లాంటి రకాలు వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది.
ఏదీ కుదరకపోతే.. అదే దిక్కు:
ఈ చిట్కాలేవీ పని చేయకపోతే వైద్యుల సూచన మేరకు వయాగ్రా వాడవచ్చు. వయాగ్రా ఎంత మోతాదులో వాడాలి అనేది వైద్యులు చెబుతారు. మెడికల్ షాపుల్లో దొరుకుతాయి కదా అని వేసుకుంటాం అనుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications