Latest Updates
-
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.!
శృంగారంలో క్లైమాక్స్ కాకముందే సినిమా అయిపోతోందా? మీ వారికి ఇలా చెప్పి చూడండి
శృంగారంలో ఇద్దరు భాగస్వాములు ఫుల్‌గా ఆస్వాదించినప్పుడే ఆ మజా తెలుస్తుంది. ఎవరో ఒకరూ మాత్రం ఉద్వేగానికి లోనై సంతృప్తి పడిపోతే అది అసలు శృంగారమే అనిపించుకోదు. శృంగారంలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి క్లైమాక్స్ కు చేరుకోలేరు. ఒకరు వేగంగా క్లైమాక్స్ చేరుకుంటే మరొకరి భావప్రాప్తి పొందడానికి సమయం పడుతుంది. ఇద్దరూ ఒకేసారి భావప్రాప్తి పొందగలిగితే శృంగారాన్ని సక్రమంగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకోవచ్చు.
ఈ గ్యాప్ వల్ల శృంగారాన్ని తనివితీరా ఎంజాయ్ చేయలేరు చాలా మంది. పురుషులు చాలా త్వరగా క్లైమాక్స్‌కు చేరుకుని స్ఖలనం ద్వారా భావప్రాప్తి పొందుతారు. కానీ స్త్రీలు చాలా నిదానంగా క్లైమాక్స్ చేరుకుంటారు. ఈ గ్యాప్ గురించి పురుషులతో ఎలా మాట్లాడాలో చాలా మంది మహిళలకు తెలియదు. చెబితే ఏమనుకుంటారో అని అనుకుంటారు. దాని వల్ల అరకొర సుఖంతోనే సంతృప్తి పడిపోతారు. దీని గురించి భర్తలతో ఎలా చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కమ్యూనికేషన్ చాలా కీలకం:
మంచైనా చెడైనా మాటల ద్వారా చెప్పాలి. మాట్లాడితే మన మనసులో ఏముందో ఎదుటి వారికి తెలుస్తుంది. మాటల ద్వారా చెప్పలేకపోతే మెసేజ్, లెటర్ ద్వారా చెప్పడానికి ప్రయత్నించాలి. సైగలు, సంజ్ఞలు, ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ద్వారా మీ మనసులో ఏముందో తెలియజెప్పాలి.
సొంత భావాలను, కోరికలను ప్రతిబింబించాలి:
మీకేం కావాలి, మీకు ఎలాంటి కోరికలు ఉన్నాయో ఎదుటివారికి చెప్పే ముందు మీకు తెలిసి ఉండాలి. మనకు ఏం కావాలో స్పష్టంగా తెలిసినప్పుడు ఎదుటివారిని దాని గురించి అడగొచ్చు. సెక్సువల్ గ్యాప్ గురించి మాట్లాడాలనుకుంటే ముందు మీ భావాలను, కోరికలను తెలుసుకుని వాటి గుర్తించి ప్రస్తావిస్తూ అసలు విషయం చెప్పాలి.
పరస్పర ఆనందం, అన్వేషణపై దృష్టి పెట్టాలి:
ఏ విషయం గురించి అయినా, ముఖ్యంగా శృంగార సంబంధిత విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు నేరుగా విమర్శలు చేయడం కంటే ఇతర విషయాల గురించి పాజిటివ్ గా మాట్లాడాలి. వారికి ఏం కావాలి, ఎలా ఉంటే మరింతగా ఎంజాయ్ చేస్తారో అడగడంతో మొదలు పెట్టి మీకేం కావాలో చెప్పాలి.
పరిష్కారంపై కలిసి పని చేయాలి:
భావప్రాప్తి అంతరాన్ని తగ్గించడానికి ఏం చేయాలో ఏం చేస్తే ఇద్దరూ సంతోషంగా ఉంటారో అలాంటి పరిష్కారాన్ని కనుక్కోవాలి. కలిసి ఆలోచనలు పంచుకోవాలి. కొత్త టెక్నిక్ లు ప్రయత్నించడం, సెక్స్ టాయ్స్ ఉపయోగించడం, విభిన్న భంగిమల్లో సెక్స్ చేయడం, ఫోర్‌ప్లే ప్రయోగాలు చేయడం లాంటి వాటితో ఇద్దరూ సంతోషంగా శృంగారాన్ని ఆస్వాదించవచ్చు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications