Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
ఇలా చేస్తే ఏ అమ్మాయి ఐనా మీ వెనక పడాల్సిందే..!
ఎవరైతే తమ అట్రాయక్టివ్‌నుస్‌ను వివిధ రకాలుగా పెంచుకుంటారో వారినే అందరూ ఇష్టపడతారు, వారికి ఆకర్షితులౌతారు, వారి వద్దకే వెళ్తారు, వారిని కాంపిటీటర్లుగా గుర్తిస్తారు. రాజకీయాల్లో ఆకర్షనీయంగా వున్న వారు 20 శాతం ఎక్కువ విజయాన్ని సాధిస్తారు. వివిధ కంపెనీల్లో అట్రాక్టివ్‌గా వుండే సేల్స్ మ్యాన్ ఎక్కువ జీతాన్ని సంపాదిస్తున్నారు. వారు ఇతరులతో పోలిస్తే ఎక్కువ డబ్బును సంపాదించి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆకర్శనీయంగా వున్న వారు పుట్టుకతోనే అలా లేరని అధ్యయనాలు చెబుతున్నాయ్. చిన్న ట్రిక్కులు పాటిస్తే మీరు కూడా చాలా ఆకర్శనీయంగా మారుతారు.

ఆకర్షనీయంగా వుండాలంటే మొట్టమొదట ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. శరీరంలో పొట్టిగా వున్నా, పొడుగ్గా వున్నా ఫిట్‌నెస్‌ను కచ్ఛితంగా ఫాలో అవ్వాలి. అట్రాక్టివ్‌గా వుండాలంటే 6 అడుగులు వుండనవసరం లేదా, బాడీ షేప్ సరిగ్గా మెయింటేయిన్ చేయాలి. కనీసం వారానికి 4 రోజులైనా సరే వ్యాయామం చేయండి, కొవ్వును కరిగించే ప్రయత్నం చేయాలి. వ్యాయామాన్ని చాలా మంది వాయిదా వేస్తుంటారు, అలాంటి వాయిదాలు వేయకుండా వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయాలి. ఈరోజు నుంచే వ్యాయామం మొదలుపెడితే 3వ వారం నుంచి మీకు మంచి ఫలితాలు కనబడతాయ్.
ఫ్యాషన్ గురించి అన్ని దేశాల్లో ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూనే వున్నారు. కొన్ని ప్రత్యేకమైన దుస్తులు, ఆర్నమెంట్స్ ధరించిన వాళ్లు చాలా ఆకర్శనీయంగా వున్నారు. వారికి సమాజంలో చాలా గౌరవం కూడా వుంటుంది. చాలా మంది తమకు కంఫర్ట్ వున్న వాటినే వేసుకుంటారు. అలా కాకుండా తమ శరీరానికి ఏవి సూట్ అవుతాయో వాటినే వేసుకోవడానికి రెడీ అవ్వండి. ఫ్యాషన్ దుస్తులు ఎక్కువ ఖరీదు వున్నాయని బాధపడకుండా తక్కువ ధరలో మంచి వాటిని ఎంచుకోండి.

బాడీ షేప్, మంచి దుస్తులు, కొన్ని యాక్ససరీస్ వుంటే చాలా అట్రాక్టివ్‌గా కనబడతారు. మంచి బాడీ ల్యాంగ్వేజ్ కూడా చాలా ముఖ్యమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. బాడీ ల్యాంగ్వేజ్ బాగుంటే చాలా మందిని అట్రాక్ట్ చేయగలుగుతారు. నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు వంగి కాకుండా కాన్ఫిడెంట్‌గా, నిలబడి నడవాలి, కూర్చోవాలి.
పొగిడితే ఎలాంటి అమ్మాయి ఐనా ఈజీగా పడిపోతుంది. పొగిడితే అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఈజీగా పడిపోతారు. కేవలం పొగడ్డం కాకుండా అవి నిజమని వారికి అనిపించేలా చేయాలి.
అట్రాక్టివ్‌గా కనబడాలంటే ఆమెతో మాట్లాడాలి, ఆమె చెబుతున్న వాటిని శ్రద్ధగా వినాలి. అమ్మాయి కుటుంబం గురించి తెలుసుకోవాలి. ఎక్కడ పెరిగింది, ఎలా పెరిగింది, తనకు ఏమంటే ఇష్టమో తెలుసుకోవాలి. ఆమె ఆలోచనలను, అభిప్రాయాలను గౌరవించాలి. ఆమెకు తగిన గౌరవాన్ని ఇస్తే ఆమె మీకు ఆకర్శితులౌతుంది. ఆమెకు ఇష్టమైన హాబీ ఏంటో అడిగి తెలుసుకోండి.
మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవడాన్ని ఆపివేయాలి. మీరు మీలాగే వుండాలి. మీకు ప్రత్యేకమైన వ్యక్తిత్వం వుండడం వల్ల కూడా అమ్మాయి మీకు అట్రాక్ట్ అవుతుంది. ఈ ప్రపంచానికి మీరు ఏంటో తెలియజేయండి. ఇతరుల లాగా మీరు వుండడానికి ప్రయత్నించవద్దు.
శుభ్రంగా వుండడం కూడా చాలా ముఖ్యం. మీ శరీరాన్ని కూడా మీరు సరిగ్గా జాగ్రత్తగా, శుభ్రంగా చూసుకోలేకపోతే ఏ అమ్మాయి కూడా మీకు ఆకర్శితులవ్వదు. బ్రాండెడ్ బట్టలు మాత్రమే వేసుకోనవసరం లేదు. సరైన హెయిర్ స్టైల్‌ను మెయింటేయిన్ చేయాలి. టీషర్ట్, జీన్స్ , వాచ్ బాగా ఫిట్ అయ్యేలా చూసుకోవాలి. బట్టలను మరీ లూజ్‌గా కాకుండా కొంచం టైట్‌గా వేసుకోవడానికి ప్రయత్నించండి.



Click it and Unblock the Notifications