Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మీ భర్త మీ మాట వినడం లేదా?ఈ పని చేస్తే సెట్ అవుతాడు..మీ కొంగు పట్టుకొని తిరుగుతాడు!
చెప్పిన మాట వినే భర్త దొరకడం ఒక వరం లాంటిది. మనసులోని మాటను శ్రద్ధగా ఆలకించి, దానికి విలువ ఇచ్చే భాగస్వామి ఉంటే ఏ భార్య మాత్రం సంతోషంగా ఉండదు..కానీ చాలాసార్లు భర్తలు భార్యల మాటలను పెడచెవిన పెడుతుంటారు.
ఇలాంటి చిన్న చిన్న సమస్యలే రాను రాను పెద్ద గొడవలకు, మనస్పర్థలకు దారితీస్తాయి. అసలు భర్తలు ఎందుకిలా ప్రవర్తిస్తారు? వారి ప్రవర్తన వెనుక ఉన్న కారణాలేంటి? మీ భర్త మీ మాట వినకపోవడానికి గల 5 ముఖ్య కారణాలు, వాటి పరిష్కారాలు ఇప్పుడు చూద్దాం.

భర్తలు మాట వినకపోవడానికి కారణాలు
ఆధిపత్య భావన: మనది పురుషాధిక్య సమాజం. చిన్నప్పటి నుండి మగవారి మాటకు ఎక్కువ విలువ ఇవ్వడం చూస్తూ పెరిగిన చాలామంది పురుషులు పెళ్లి తర్వాత కూడా అదే ధోరణిని కొనసాగిస్తారు. భార్య కంటే నేనే గొప్ప, ఆమె చెప్పేది నేనెందుకు వినాలి? అనే అహం వారిలో ఉంటుంది. ఇదే చాలా సమస్యలకు మూల కారణం.
సమస్యను లైట్ తీసుకోవడం: భార్య తన బాధనో, భావాన్నో షేర్ చేసుకోడానికి వచ్చినప్పుడు ఓదార్పు కోరుకుంటుంది. కానీ కొందరు భర్తలు ఆ సమస్యను తేలికగా తీసుకుని, అనవసరమైన హాస్యంతో దాన్ని దాటవేయాలని చూస్తారు. ఇది భార్యకు మరింత చికాకు తెప్పిస్తుంది.
ఏమనుకోదులే అనే నిర్లక్ష్యం: కొన్ని తప్పులు పదేపదే చేసినా భార్య ఏమీ అనదులే, కాసేపు కోప్పడినా తర్వాత సర్దుకుపోతుంది అనే అతి విశ్వాసం కొందరు భర్తల్లో ఉంటుంది. ఈ నిర్లక్ష్య ధోరణే వారిని బాధ్యతారాహిత్యంగా, మాట వినకుండా ప్రవర్తించేలా చేస్తుంది.
ఎంపిక చేసిన విషయాలనే వినడం: కొందరు భర్తలు తమకు ముఖ్యమనిపించిన విషయాలను, లేదా తమ గౌరవానికి సంబంధించిన విషయాలను మాత్రమే శ్రద్ధగా వింటారు. భార్య చెప్పే చిన్న చిన్న విషయాలను, ఇంటి సంగతులను పట్టించుకోరు. వారికి ఆసక్తి లేని విషయాలను పూర్తిగా విస్మరిస్తారు.
భావోద్వేగాలకు దూరంగా ఉండటం: సాధారణంగా పురుషులు భావోద్వేగాలను ఎక్కువగా ప్రదర్శించరు. భార్య ఏదైనా సమస్యను ఎమోషనల్‌గా చెబితే వారు దానికి హేతుబద్దతతో కూడిన పరిష్కారం చెప్పాలని చూస్తారు. ఇది భార్యకు నా భర్తకు నాపై ప్రేమ లేదు, నా బాధను అర్థం చేసుకోవడం లేదు అనే భావనను కలిగిస్తుంది.

మీ భర్త మీ మాట వినాలంటే ఏం చేయాలి?
సూటిగా, స్పష్టంగా చెప్పండి: సూటిగా విషయం చెప్పాలి. మీకేం కావాలో, మీరేం ఆశిస్తున్నారో అతని కళ్లలోకి చూసి స్పష్టంగా వివరించండి.
సరైన సమయం ఎంచుకోండి: అతను టీవీ చూస్తున్నప్పుడు, ఫోన్‌లో ఉన్నప్పుడు లేదా అలసిపోయి ఉన్నప్పుడు ముఖ్యమైన విషయాలు మాట్లాడొద్దు. మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి కాస్త సమయం కేటాయించండి అని అడిగి, అతని పూర్తి దృష్టి మీపై ఉండేలా చూసుకోండి.
మీకేం కావాలో వివరించండి: సమస్య చెప్పే ముందే నాకు మీ సలహా కావాలా, లేక నేను చెప్పేది ఓపికగా వింటే చాలా? అని చెప్పండి. దీనివల్ల అనవసర వాదనలు తగ్గుతాయి.
నిందలతో మొదలుపెట్టవద్దు: నువ్వెప్పుడూ నా మాట వినవు వంటి నిందలతో సంభాషణ ప్రారంభిస్తే అతను రక్షణాత్మక ధోరణిలోకి వెళ్లిపోతాడు. సానుకూలంగా మాట్లాడటం మొదలుపెట్టండి.
ఊహించుకుంటాడని ఆశించవద్దు: సినిమాల్లో లాగా మన ప్రవర్తనను చూసి మనసులోని బాధను అర్థం చేసుకోవాలని ఆశించవద్దు. నిజ జీవితంలో అది సాధ్యం కాదు. మీ భావాలను, అవసరాలను మాటల్లో చెప్పడం వల్ల మీ బంధంలో పారదర్శకత పెరుగుతుంది.
ఈ చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మీ భర్త మీ మాట వినడమే కాకుండా మీ బంధం కూడా మరింత బలోపేతం అవుతుంది.



Click it and Unblock the Notifications