Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
భార్యా భర్తలు కలిసి ఈ పనులు చేస్తే..!
భార్యా భర్తల బంధం ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే అన్ని పనులను ఇద్దరూ కలిసి చేసుకోవాలి. వివాహమైన దగ్గరి నుంచి పిల్లలను కని చదివించి పెద్ద చేసే బాధ్యతల్లో ఇద్దరి మధ్య ఎన్నో గొడవలు వచ్చి ఉంటాయ్. ఆ సమయంలో ఇద్దరి మధ్య కొంత గ్యాప్, వారి బంధంలో కొంత బలహీనత ఏర్పడి ఉంటుంది. అలా కాకుండా ఇద్దరూ తమ బంధాన్ని మరింత బలంగా కొనసాగించాలంటే ఇక్కడ మేము సూచించిన కొన్ని విషయాలను తప్పక చేయావలసి ఉంటుంది.

భార్యా భర్తల కలిసి చేయాల్సిన పనులు
ఇద్దరూ కలిసి మొదట ఎప్పుడు ప్రేమలో పడ్డారో గుర్తుచేసుకోవాలి. అలా చేసినప్పుడు అప్పటి మీ మధుర క్షణాలు, చేసిన చిలిపి పనులు కళ్లముందు కనిపిస్తాయ్. రోజూ సాగే బోర్ లైఫ్ నుంచి ఇది మీ ఇద్దరినీ కొంత బయటకు పడేసే అవకాశం ఉంది.
డ్యాన్స్ లేదా ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీని మీ పార్టనర్‌తో కలిసి చేయండి. మీకు డ్యాన్స్ వస్తుందా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఇద్దరూ కలిసి ఈ యాక్టివిటీలను చేయాలి. ఇది ఇద్దరినీ మరింత దగ్గరకు చేసేందుకు దోహదపడుతుంది.
ఏ సమస్యలు వచ్చినా మీ పార్ట్‌నర్‌తో కలిసి కూర్చొని చర్చించుకోండి. ఆ సమస్యను పరిష్కరించుకునేందుకు కలిసి నిర్ణయాలు తీసుకోండి. ఇది మీ ఇద్దరి మధ్య కమ్యునికేషన్‌ను పెంచడమే కాకుండా బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది.
భార్యభర్తలిద్దరూ కొంత సమయం మౌనంగా ఏమి మాట్లాడకుండా కూర్చోవాలి. ఇలా ఎంత ఎక్కువ సమయం వరకు గడపగలరో చూడండి. ఇది మీ ఇద్దరూ ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవడంతో పాటు మిమ్మల్ని మీరు అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ ఇద్దరి మధ్య గొడవ వచ్చిన ప్రతీసారి కూడా ఇలా మౌనంగా ఉండడం చేస్తే మంచి ఫలితాన్ని మీరే చూడవచ్చు.
మీ పార్డ్‌నర్‌తో కలిసి టూర్స్ కు వెళ్లండి ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి ట్రావెల్ చేయండి. ఇది మీ ఇద్దరినీ మరింత దగ్గరకు తీసుకొని రావడంతో పాటు ఒకరిని ఒకరు మరింత లోతుగా అర్ధం చేసుకునేలా చేస్తుంది. మంచి మెమోరీస్‌ను కూడా మీరు ఈ ట్రావెల్ ద్వారా పొందవచ్చు.
ఇంట్లో పనులన్నింటినీ ఇద్దరూ కలిసి చేసుకొనే సందర్భాలు చాలా తక్కువగా వస్తుంటాయ్. కాబట్టి ఇలా ఒకరోజంతా ఇద్దరూ కలిసి ఇంటికి సంబంధించిన అన్ని పనులను చేసుకోండి. ఇది మీ మధ్య బంధాన్ని మరింత తియ్యగా మారుస్తుంది. ఇలా చేసిన తరువాత కలిగే మార్పును మీరు వెంటనే చూడగులుగుతారు.



Click it and Unblock the Notifications