Latest Updates
-
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే!
పెళ్లి తమ్ముడితో,కాపురం అన్నతో..సైకాలజిస్ట్ చెప్పిన రియల్ స్టోరీ
పెళ్లి అంటే ఏమిటి?ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ, గౌరవం, నమ్మకాలతో పెనవేసుకున్న పవిత్ర బంధమా? లేక కేవలం పిల్లల్ని కని, వంశాన్ని నిలబెట్టే ఒక సామాజిక ఒప్పందమా? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ ప్రభుత్వ అధికారి నోటి వెంట వచ్చిన ఈ మాటలు వివాహ బంధం మూలాలపైనే తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ రోషిణి రావ్..తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఓ వీడియోలో ఓ రియల్ స్టోరీ గురించి పంచుకున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన చదువురాని భార్యతో కలిసి తన దగ్గరకు వచ్చాడని, అప్పటికే ఆమె 7 నెలల గర్భవతి అని కూడా చెప్పాడని సైకాలజిస్ట్ రోహిని చెప్పారు. అయితే తన భార్య తన మీద శ్రద్ధ చూపించడం లేదు అని భర్త కంప్లెయింట్ చేశాడని చెప్పారు.
అంతేకాకుండా మాటల సందర్భంలో ఆయన నేను 7 నెలలు ఉద్యోగ పని మీద బయట ఉండి 3 నెలల క్రితమే ఇంటికి వచ్చానని చెప్పాడు. అయితే మీరు 3 నెలల క్రితమే ఇంటికి వస్తే మీ భార్య 7 నెలల గర్భవతి ఎలా సాధ్యం అని సైకాలజిస్ట్ రోహిని ఆ ప్రభుత్వ ఉద్యోగిని అడగ్గా..ప్రెగ్నెంట్ చేయడానికి మా అన్న ఉన్నాడుగా అని సమాధానమిచ్చాడు. ఈ సమాధానం విని సైకాలజిస్ట్ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఏంట్రా ఇదంతా అనుకుంటూ అసలు మీరు దీన్ని ఎలా అంగీకరిస్తున్నారు అని ఆ ప్రభుత్వ ఉద్యోగిని అడగ్గా..నాది,మా అన్నది ఒకటే రక్తం కదా, నేను నా పనుల్లో బిజీగా ఉంటున్నా కానీ నా భార్యను ప్రెగ్నెంట్ చేయాలంటే ఎవరో ఒకరు ఉండాలిగా, వారసత్వం పెంచాలి కదా అని సామాధానమిచ్చాడని సైకాలజిస్ట్ రోహిని చెప్పారు.

పెళ్లి ఇప్పుడు సామాజిక ఒప్పందమా?
సంప్రదాయబద్ధంగా చాలా సమాజాల్లో వివాహం ప్రాథమిక ఉద్దేశ్యం వంశోద్ధరణే. వారసులను కనడం, ఆస్తిని తర్వాతి తరానికి అందించడం, కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడం వంటివి ముఖ్యమైనవిగా భావించేవాళ్లు. ఈ దృక్పథంలో భార్య ప్రాథమిక పాత్ర మాతృత్వానికే పరిమితం చేయబడింది. ఆ అధికారి మాటలు సరిగ్గా ఈ పాతకాలపు, పితృస్వామ్య భావజాలానికి అద్దం పడుతున్నాయి. ఆయన దృష్టిలో భార్య ఒక సహచరి కాదు..కేవలం తన వంశాన్ని నిలబెట్టే ఒక సాధనం. ఇది ఆమె వ్యక్తిత్వాన్ని, భావోద్వేగాలను, ఆకాంక్షలను పూర్తిగా అవమానించడమే. కానీ ఆధునిక సమాజంలో వివాహానికి అర్థం మారింది.
నేటి తరానికి వివాహం అంటే జీవితాంతం తోడునీడగా నిలిచే ఒక భాగస్వామ్యం. కష్టసుఖాల్లో ఒకరికొకరు అండగా ఉండటం, మానసికంగా ధైర్యాన్ని ఇవ్వడం, పరస్పరం గౌరవించుకుంటూ వ్యక్తిగతంగా ఎదగడానికి తోడ్పడటం వంటివి ఆధునిక వివాహ బంధానికి పునాదులు. ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధ లేని చోట కేవలం శారీరక కలయిక ద్వారా పిల్లల్ని కనడం అనేది బంధాన్ని యాంత్రికంగా మార్చేస్తుంది. అలాంటి వాతావరణంలో పెరిగే పిల్లల మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. వివాహ బంధం నిజమైన విలువను గుర్తించి, భాగస్వామిని ఒక యంత్రంగా కాకుండా మనసున్న మనిషిగా గౌరవించడం నేర్చుకోవాలని. అప్పుడే కుటుంబ వ్యవస్థ ఆరోగ్యంగా, ఆనందంగా వర్ధిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications











