Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
ఈ లక్షణాలుంటే.. అమ్మాయిలు ఈజీగా ఆకర్శితులౌతారు..!
అమ్మాయిలతో ఎలా మాట్లాడాలని చాలా మంది అబ్బాయిలకు తెలియదు. తనను తానుగా గుర్తించి అర్థం చేసుకునే అబ్బాయి కోసం అమ్మాయిలు వెతుకుతూ వుంటారు. అబ్బాయిలకన్నా అమ్మాయిలు చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు.

అబ్బాయిల్లో అమ్మాయిలు ఇష్టపడే లక్షనాలు ఇవే..
1. బయటకు అమ్మాయిలు మామూలుగా కనిపించినా తమలోని లక్షణాలను పొగిడేవారి కోసం అమ్మాయిలు చూస్తుంటారు. తాము చేసే పనులను మెచ్చుకున్న అబ్బాయిలంటే అమ్మాయిలు ఇష్టపడతారు.
2. అమ్మాయిలు పొంత నిర్ణయాలను త్వరగా తీసుకోలేరు. ఆ అవరోధాన్ని దాటగలిగి చెప్పే వాళ్లను వారు అభినందిస్తారు. అతిగా బాగున్నావు అమ్మాయికి చెబితే విసుక్కుంటారు. మొహంమీదే బాగాలేవని చెబితే అమ్మాయిలకు నచ్చదు. ఎందుకు బాగాలేదో వివరణ ఇస్తే అప్పుడు కొంచెం తప్పుకునే అవకాశం వుంది.
3. ఏ చెడుఅలావాట్లు లేకపోయినా ఒక మంచి అలవాటు వుండాలని కోరుకుంటారు. వారికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చిన వారితోనే అమ్మాయిలు వుండడానికి ఇష్టపడతారు.
4. ప్రపంచంలో ఏ అమ్మాయి అయినా తనకన్నా అబ్బాయి తెలివిగా వుండాలని కోరుకుంటుంది. తన దగ్గర మాత్రం చిన్నపిల్లాడిలా వుండాలని అమ్మాయి కోరుకుంటుంది. మరీ చిన్నవాడిలా వున్నా, మరీ పెద్దవాడిలా వున్నా కూడా అమ్మాయిలకు నచ్చదు.
5. తాను ఎప్పుడు కాల్ చేసినా తనకు టైమ్ ఇచ్చి మాట్లాడే అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. ప్రేమలో పడినప్పుడు మాత్రమే కాకుండా అన్ని వేలల్లో తమతో మాట్లాడాలని అమ్మాయిలు కోరుకుంటారు.

6. ప్రపంచంలో ఎంత మంది అమ్మాయిలు వున్నా వారందరిలో నువ్వే నాకు చాలా స్పెషల్ అని అమ్మాయితో అన్నప్పుడు అప్పుడు వారిలో కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది.
7. అబ్బాయిల్లో అమ్మాయి కోరుకునేది ముందుగా గౌరవం. బయట వేరే వాళ్లతో వేేరేలా మాట్లాడుతూ గౌరవం ఇచ్చినట్లు నటించినా అమ్మాయిలకు నచ్చదు.
8. తనను చూడగానే పాజిటివ్‌గా ఫీల్ అయ్యే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారు. అంటే తనవల్ల అబ్బాయి సంతోషంగా వున్నాడనే భావన ఆమ్మాయిలో కలుగుతుంది.
9. అమ్మాయిలు ఏది చెప్పినా వింటూ వుండాలి. వారు చెప్పేదాన్ని పూర్తిగా వినాలి. ఎటువంటి బిజీ పని వున్నా కొంత సేవటివరకు దాన్ని పక్కకు పెట్టి అమ్మాయి వినాలి.
10. అబ్బయిల్లో వుండే తెలివితేటలను అమ్మాయిలు ఇష్టపడతారు. వారి ఇంటలిజెన్స్‌ను మెచ్చుకుంటారు. అందరితో మంచిగా మాట్లాడి, అందరితో కలిసే వాళ్లంటే కూడా అమ్మాయిలు ఇష్టపడతారు.
11. ప్యాషన్, లక్ష్యం వున్న అబ్బాయిలంటే కూడా అమ్మాయిలు ఇష్టపడతారు. అప్పుడప్పుడూ జోక్ చేస్తూ నవ్వించే అబ్బాయిలను కూడా అమ్మాయిలు ఇష్టపడుతుంటారు.
12. నిజాయితీగా వుండే అబ్బాయిలను కూడా అమ్మాయిలు ఇష్టపడతారు. చేసే పనిలో కాన్ఫిడెంట్‌గా వున్న అబ్బాయిలంటే కూడా అమ్మాయిలు చాలా ఇష్టపడతారు.



Click it and Unblock the Notifications