Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మీ ఫ్రెండ్‌లో ఈ లక్షణాలు ఉంటే వారు మిమ్మల్ని అవసరానికి వాడుకుంటున్నారని అర్ధం!
అన్ని బంధాలలో స్నేహబంధం చాలా గొప్పది. కష్టాల్లో ఉన్నప్పుడు నిజమైన స్నేహితుడు ఒక్కడే అందరికంటే ముందు మన వెనకాల నేనున్నా అని వెన్నుతట్టి ముందుకు సాగనంపుతాడు. అలాంటి గొప్ప స్నేహబంధంలో కలుపు మొక్కలు కూడా తయారయ్యారు. అవసరానికి మాత్రమే స్నేహితులను వాడుకుంటున్నారు. తమ ప్రయోజనాల కోసం వారిని ఎంతటి దయనీయ స్థితిలో కూడా వదిలేస్తున్నారు. అలాంటి వ్యక్తుల వల్ల స్నేహానికి ఉండే విలువలు తగ్గిపోతున్నాయి.
అయితే ఈ స్టోరీలో వెన్నుపోటు పొడిచే, నిన్ను అవసరానికి వాడుకునే స్నేహితుడిలో ఉండే లక్షణాలను తెలుసుకుందాం. ఇలాంటి లక్షణాలు కనుక మీ స్నేహితుడిలో కూడా కనిపిస్తే అతను మిమ్మల్ని కేవలం తన సొంత ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నాడని అర్ధం చేసుకోవాలి. ఆ లక్షణాలు ఏంటంటే..

మీ భావాలను గౌరవించకపోవడం..
ఎలాంటి బంధంలోనైనా ఒకరి భావాలను మరొకరు గౌరవించుకోవాలి. అలా గౌరవించుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. అలాగే ఆ బంధానికి విలువ పెరుగుతుంది. అలా కాకుండా మీ భావాలను గౌరవించకపోవడం, మీ సూచనలను విస్మరించడం చేస్తే అవతలి వ్యక్తికి మీ అవసరం లేదని అర్ధం చేసుకోవాలి. మీ భావాలను గౌరవించని వ్యక్తులు కేవలం వారి సమస్యల పరిష్కారం కోసమే మిమ్మల్ని వినియోగించుకుంటున్నారని, మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారని గ్రహించాలి.
తరచూ మీ నుంచి సహాయం ఆశించడం
స్నేహ బంధమైనా, ఇతర బంధాలు ఎవరైనా.. పరస్పర సహాకారం ఉంటేనే బాగుటుంది. అలా కాదని ఒక వ్యక్తిపైనే ఆధారపడం అది ఏ మాత్రం మంచిది కాదు. మరీ ముఖ్యంగా స్నేహ బంధంలో అది చెడు సంకేతంగా చెప్పుకోవచ్చు. మీ ఫ్రెండ్‌షిప్‌లో ప్రతీసారి మీ నుంచి సహాయం కోరడం.. మీకు అవసరమైనప్పుడు సహాయం చేయకపోవడం కూడా మిమ్మల్ని వారి సొంత ప్రయోజనాల కోసమే వినియోగించుకుంటున్నారని అర్ధం చేసుకోవాలి.
అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడడం..
స్నేహ బంధంలో ఒకరి మంచి చెడులు ఇంకొకరు తెలుసుకోవాలి. ఆపదలో ఉంటే ఆదుకోవాలి. అలా కాదని కేవలం అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడడం, వారికి సమస్య ఉన్నప్పుడు మాత్రమే మీకు ఫోన్ చేయడం వంటివి చేస్తే కచ్చితంగా వారు మిమ్మల్ని అవసరానికి వాడుకుంటున్నారని అర్ధం చేసుకోవాలి. అలాంటి వ్యక్తులు మీ భావాలను పట్టించుకోకపోవడంతో పాటు మిమ్మల్ని ఒక వస్తువుగా మాత్రమే పరిగణిస్తారు.
అయితే కొన్ని పనుల వల్ల అప్పుడప్పుడు ఫోన్ చేసే వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్లంతా అవసరానికి వాడుకునేవారని మేము చెప్పడం లేదు. వ్యక్తి ప్రవర్తన, వారు మాట్లాడే విధానం బట్టి మనం వారిని ఎలాంటి వారో అంచనా వేసుకోవాలి.
లిమిట్స్‌ను గౌరవించుకోవడం..
ఏ బంధంలోనైనా ఎదుటి వ్యక్తి సరిహద్దులను గౌరవించాలి. అలాంటప్పుడే ఆ వ్యక్తిని మీరు గౌరవిస్తున్నట్లు అవుతుంది. అలా కాదని తమ కోరికలను, తమ ఇష్టాలను రుద్దాలని అనుకునే వ్యక్తులు కచ్చితంగా మిమ్మల్ని వారి అవసరానికి వాడుకుంటారని అర్ధం చేసుకోవాలి. అలాంటి వ్యక్తులు మీ ప్రైవసి, స్వఛ్చను పట్టించుకోరు. వారి సొంత అవసరాల కోసం, సొంత పనుల కోసమే మిమ్మల్ని వినియోగించుకోవాలని చూస్తుంటారు. పై లక్షణాలు కనుక మీ స్నేహితుల్లో లేదా మీ భాగస్వామిలో కనిపిస్తే కచ్చితంగా వారు మిమ్మల్ని తమ అవసరాల కోసం వినియోగించుకుంటారని అర్ధం చేసుకోవాలి. అలాంటి వ్యక్తులతో దూరంగా ఉంటే మీ జీవితంలో ప్రశాంతత ఉంటుంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.



Click it and Unblock the Notifications