Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
బ్రేకప్ అయిందా? ఈ తప్పులు చేస్తే కొత్త రిలేషన్ షిప్ కూడా బిస్కెట్ అవుతుంది!
జీవితంలో రిలేషన్ షిప్ ఒక ముఖ్యమైన భాగం. రిలేషన్ షిప్ అనేది కేవలం భార్యాభర్తల మధ్యనే ఉండేది కాదు..ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య,ప్రేమికుల మధ్య,పై అధికారులతో,కిందిస్థాయి ఉద్యోగులతో మీ సంబంధం ఏ విధంగా ఉంది.. ఇలా చెప్తూ పోతూ చాలానే ఉంటాయి. ఏ రిలేషన్ షిప్ లో అయినా ప్రారంభం నుండి చివరి వరకు చాలా జాగ్రత్త అవసరం. ఎందుకంటే బ్యాడ్ రిలేషన్ మీ మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. సాధారణంగా ఎంత క్లోజ్ రిలేషన్ షిప్ లో అయినా కొన్నాసార్లు గొడవలు వస్తుంటాయి. అవి త్వరగా ముగిసిపోతే మంచిదే.. కొన్నిసార్లు ఇలాంటివి మీ బంధాన్ని మరింత స్ట్రాంగ్ గా మారుస్తాయి కూడా.
ఒంటరిగా జీవించడం అంత సులభం కాదు. కానీ ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి తొందరపడి రిలేషన్ షిప్ ప్రారంభించడం మంచిది కాదు. రిలేషన్ షిప్ లో విడిపోయిన తర్వాత తిరిగి మరొకరితో రిలేషన్ లోకి రావాలంటే మీరు మానసికంగా దానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యం? బ్రేకప్ అయిన వెంటనే మరో కొత్త రిలేషన్ షిప్ లోకి అడుగుపెడుతుంటారు చాలామంది. అయితే కొత్త రిలేషన్ షిప్ లోకి అడుగుపెట్టేముందే కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా మీరు కొత్త రిలేషన్ షిప్ లోకి అడుగుపెట్టాలా లేదా అనేది మీకు తెలుస్తుంది.

బ్రేకప్ ను అధిగమించారా?
మీరు మీ బ్రేకప్ ని అధిగమించలేకపోతే మరొక సంబంధాన్ని ప్రారంభించకండి. విడిపోవడాన్ని మర్చిపోవడం కోసం ఏర్పరుచుకునే సంబంధాలు సాధారణంగా కాలక్రమేణా విషపూరితంగా మారతాయి.
అదే మాటలు
ఒకప్పుడు మీతో సంతోషంగా గడిపిన వ్యక్తిని మనసు నుంచి పూర్తిగా తొలగించడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ మీరు మీ మాజీని పదే పదే తలుచుకుంటూ మీ సంభాషణలలో వారి గురించి తరచుగా ప్రస్తావించినట్లయితే మీరు మళ్లీ ఇంకొకరితే రిలేషన్ లో కొనసాగడానికి సిద్ధంగా లేరనే అర్థం.
ఒంటరిగా ఉండటం
మీకు హెల్తీ రిలేషన్ షిప్ కావాలంటే మీరు ఒంటరిగా ఆనందించడం నేర్చుకునే వరకు మరొకరితో కొత్త రిలేషన్ మొదలుపెట్టకండి. చాలా కాలం పాటు సంబంధాలు తెగిపోయిన తర్వాత తరచుగా వ్యక్తులు తమతో సమయం గడపలేరు. సంతోషపెట్టడానికి వారికి ఎప్పుడూ ఎవరైనా కావాలి.
ఏమి కోరుకుంటున్నారో తెలుసా
మీ రిలేషన్ షిప్ కి సంబంధించి మీరు ఏ దశకు చేరుకోకపోతే..టైం పాస్ కోసం ఒక రిలేషన్ లో నుంచి మరొక రిలేషన్ షిప్ లోకి వెళ్లడం మీకు మంచిది కాదు. ఇలా చేసే వ్యక్తులు నిరాశకి గురవక తప్పదు.



Click it and Unblock the Notifications