Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
Office colleagues: మీ సహోద్యోగి ఇలా చేస్తున్నారా? వెంటనే ఇలా చేయకపోతే డేంజర్!
పని ప్రదేశంలో లేదా ఆఫీసులో పని చేస్తున్నప్పుడు సహోద్యోగులతో(colleagues) మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. ఉద్యోగుల మధ్య సఖ్యత ఉంటే వర్క్ సజావుగా సాగిపోతుంటది. దీంతో సంస్థకు కూడా మంచి ప్రొడక్టివిటీ అందించవచ్చు అదే సమయంలో మన కెరీర్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు ఆఫీసులో ఉద్యోగులు కలిసి ఉండరు..ఒక కుటుంబంలోని వ్యక్తుల్లా ప్రవర్తించకుండా ఏదో యుద్ధ ప్రాంతంలోని యోధుల మాదిరి బిహేవ్ చేస్తుంటారు.
మరికొన్ని సందర్భాలలో సహోద్యోగులు వ్యక్తిగత పరిమితులను దాటడానికి కూడా ట్రై చేస్తుంటారు. వారి లిమిట్స్ క్రాస్(limits cross) చేసి బిహేవ్ చేస్తుంటారు. కాబట్టి ఆఫీసులో ఎలాంటి సంకేతాలతో ఇలాంటి వారిని గుర్తించాలి, వారు లిమిట్స్ క్రాస్ చేస్తే ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం.

మీ సహోద్యోగి నుండి ఇవి విస్మరించవద్దు
-వ్యక్తిగత ప్రశ్నలు అడగడం: సహోద్యోగి మీ వ్యక్తిగత జీవితం(personal life) గురించి అంటే కుటుంబం,సంబంధాలు లేదా అలవాట్ల గురించి పదే పదే ప్రశ్నలు అడిగితే అది వారి పెరుగుతున్న ఆసక్తికి సంకేతం కావచ్చు.
-అతిగా చెప్పడం: ఆఫీసు బయట మీ ప్రయాణ సమయాలపై పదేపదే శ్రద్ధ చూపడం,భోజనానికి బయటకు వెళ్లాలని పట్టుబట్టడం లేదా పని తర్వాత కలుసుకోవాలని డిమాండ్ చేస్తుంటే దీన్ని అసలు ఉపేక్షించకూడదు.
-సోషల్ మీడియాపై ఎక్కువ శ్రద్ధ: ఆ వ్యక్తి మీ సోషల్ మీడియా ప్రొఫైల్ లో అతిగా యాక్టివ్‌గా ఉండి మీరు పెట్టిన ప్రతి పోస్ట్‌కి రొమాంటిక్ రియాక్షన్స్ ఇస్తుంటే అది మీ వ్యక్తిగత ప్రదేశంలోకి(personal space) ప్రవేశించే ప్రయత్నం కావచ్చు.
-శారీరకంగా దగ్గరవ్వడానికి ప్రయత్నించడం: ఆఫీసు సహోద్యోగి మీకు చాలా దగ్గరగా కూర్చోవడం లేదా మిమ్మల్ని పదే పదే తాకేందుకు ప్రయత్నించడం వంటి శారీరక సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇది చాలా డేంజరస్ సంకేతం.
పరిమితిని ఎలా నిర్ణయించాలి
-స్పష్టంగా ఉండాలి
ముందుగా మీరు వృత్తిపరమైన సంబంధాన్ని మాత్రమే కోరుకుంటున్నారని వారికి మర్యాదపూర్వకంగా చెప్పండి.
-ఆత్మవిశ్వాసంతో సరైన బాడీ లాంగ్వేజ్
వారిని ఆకర్షించేలాచేసేవిధంగా కానీ, వారి చర్యలను ప్రోత్సహించే ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా ఉండండి.
-ఇతర సహోద్యోగులకు చెప్పండి
మీకు అసౌకర్యంగా అనిపిస్తే మీ సన్నిహిత సహోద్యోగులతో లేదా మేనేజర్‌తో చర్చించండి.
-హద్దులు దాటితే ఇలా
ఆఫీస్ లో సహోద్యోగి లిమిట్స్ క్రాస్ అయితే దానిని విస్మరించే బదులు వెంటనే చర్య తీసుకోండి. వారి ప్రవర్తన హద్దులు దాటడం ప్రారంభిస్తే మీ ఆఫీస్ హెచ్‌ఆర్ టీమ్‌ని సంప్రదించడం బెటర్. ఇది మీ మానసిక ఆరోగ్యానికి మాత్రమే ముఖ్యమైనది కాదు, కార్యాలయంలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్వహించడంలో కూడా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications
