Latest Updates
-
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా!
మీ భాగస్వామి ఈ 4 పనులు చేస్తే..ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది!
ప్రేమ అనేది ఓ అందమైన ప్రయాణం. మొదట్లో అంతా గులాబీల బాటలాగే కనిపిస్తుంది. భాగస్వామిలోని మంచి మాత్రమే కళ్ళకు కనబడుతుంది. వారి నవ్వు,మాటలు, ప్రవర్తన అన్నీ మనల్ని మాయ చేస్తాయి. ఈ బంధం శాశ్వతం అని, మనల్ని ఎవరూ విడదీయలేరని గట్టిగా నమ్ముతాం. అయితే కాలం గడిచేకొద్దీ ఆ గులాబీల కింద ఉన్న ముళ్ళు కూడా బయటపడతాయి. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. భార్యాభర్తలయినా, లవర్స్ అయినా వారి నిజ స్వరూపాలు అప్పుడే బయటపడతాయి.
ప్రేమంటే కేవలం అనుభూతి కాదు అదొక బాధ్యత. రిలేషన్ లో గొడవలు వంటి చిన్న చిన్న తుఫానులు రావడం సహజం. అయితే ఆ గండాల నుండి గట్టెక్కి బంధాన్ని పదిలంగా నిలబెట్టుకోవాలంటే కొన్ని ప్రాథమిక సూత్రాలను తప్పక పాటించాలి. ఈ సూత్రాలు అనే పునాదులు బలంగా లేకపోతే ప్రేమ అనే సౌధం కూలిపోవడానికి లేదా మీ రిలేషన్ తెగిపోడానికి ఎక్కువ కాలం పట్టదు. మరి ఆ కీలకమైన అంశాలేమిటో చూద్దాం.

స్నేహమే పునాది
ఏ బంధానికైనా స్నేహమే ఆయువుపట్టు. పునాది లేని ఇల్లు ఎంత బలహీనమో స్నేహం లేని ప్రేమ బంధం కూడా అంతే. మీ భాగస్వామితో మీరు స్నేహితుల్లా మనసు విప్పి మాట్లాడుకోలేనప్పుడు మీ మధ్య ఒక సౌకర్యవంతమైన వాతావరణం లోపించినప్పుడు ప్రేమ అనే దీపం కొడిగట్టిందని అర్థం. ప్రతిరోజూ బిక్కుబిక్కుమంటూ ఏది పంచుకోవాలో ఏది దాచుకోవాలో తెలియని అయోమయంలో బంధం కొనసాగితే అది బంధం కాదు బందీఖానానే.
మాటలే మనసులను కలిపే వారధులు
మాట్లాడుకోవడానికి సమయం లేదు..ఈ ఒక్క మాట చాలు ఎంతటి బలమైన బంధాన్నైనా బలహీనపరచడానికి. మీరు ఎంత బిజీగా ఉన్నా మీ ప్రియమైన వారికోసం రోజుకు ఓ పది నిమిషాలు కేటాయించుకోవాలి. ఆ పది నిమిషాల్లో ఫిర్యాదులు, గొడవలు ఉండొచ్చు లేదా సంతోషాలు, సరదాలు పంచుకోవచ్చు. ఏదేమైనా ఆ సంభాషణే మీ మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది. ఒకరి మనసులో ఏముందో మరొకరికి అర్థమయ్యేలా చేస్తుంది. మానసిక మద్దతు కరువైన చోట బంధం ఎక్కువ కాలం నిలబడదు.
పరస్పర గౌరవం
ప్రేమ, స్నేహం, వివాహం బంధం ఏదైనా ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. గౌరవం లేని చోట ప్రేమ ఉండదు..అగౌరవం అపార్థాలకు, అనవసర సమస్యలకు దారితీస్తుంది. మిమ్మల్ని, మీ భావాలను గౌరవించని వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడం ఆత్మహత్యతో సమానం. అలాంటి బంధం నుంచి ఎంత త్వరగా బయటకు వస్తే అంత మంచిది.
మానసిక అనుబంధం
శారీరక సాన్నిహిత్యం కంటే మానసిక అనుబంధం చాలా ముఖ్యమైనది. భావోద్వేగపరంగా, మానసికంగా ఒకరికొకరు దూరమైనప్పుడు ఆ బంధంలో ఒంటరితనం ఆవహిస్తుంది. ఈ మానసిక దూరం పదేపదే మిమ్మల్ని ఆ బంధాన్ని వదిలేయమని ప్రేరేపిస్తుంది.



Click it and Unblock the Notifications