Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మీ భార్య అలిగిందా.. ఇలా చేస్తే క్షణాల్లోనే కూల్ అయిపోతుంది!
భార్య, భర్తల బంధం ఎంతో ప్రత్యేకమైనది. ఇద్దరు వ్యక్తులు తమ జీవితాంతం ఒకరికి ఒకరు కలిసి ఉండాలి. ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకోవాలి. ఒకరి భావాలను, ఒకరి ప్రేమను, ఒకరి కోపాన్ని, ఒకరి సంతోషాన్ని మరొకరితో పంచుకోవాల్సి ఉంటుంది. అంతటి పవిత్రమైన బంధంలో అప్పుడప్పుడు కొన్ని అలకలు, కోపాలు సర్వ సాధారణం. వాటన్నిటినీ ఎదుర్కొని జీవితాంతం కలిసుండే వ్యక్తులే నిజమైన భార్య భర్తలుగా చెప్పుకోబడతారు.
అయితే కొన్ని కొన్ని సార్లు భార్య అలక ఎంతైనా తీరదు. ఎంత బ్రతిమాలిన ఆమె అలక సద్దుమణగదు. దీంతో కొందరు భర్తలకు ఏం చేయాలో అర్ధం కాదు. అయితే ఈ చిట్కాల ద్వారా భార్య అలకను విడిపించొచ్చు. మళ్ళీ ఆమెను సాధారణ మనిషిగా చేయొచ్చు. ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఒకరిని ఒకరు స్పర్శించుకోవడం
భార్య కోపంగా ఉంటే ఆమెను స్పర్శించాలి. ఒక చిన్న స్పర్శ భార్య భర్తల మధ్య దూరాన్ని తగ్గించగలదు. భార్య ఎంత బ్రతిమాలినా కోపం వీడకపోయినా అలక వదలకపోయినా ఆమెను అప్పుడప్పుడు తాకుతూ ఉండడం వల్ల.. ఆమె మంచులా కరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. కౌగిలించుకోవడం, నుదుటిపై ముద్దు పెట్టుకోవడం వంటివి చేయడం వల్ల ఎడబాటు దూరమై భార్య భర్తలు దగ్గరవుతారు.
తగ్గి మాట్లాడడం
ఒక వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు ఇంకో వ్యక్తి తగ్గి మాట్లాడాలి. అది భార్య భర్తల బంధంలోనైనా, ఏ బంధంలోనైనా. భార్య కోపంగా ఉన్నా, అలిగినా భర్త కొంత తగ్గి మాట్లాడాలి. ఆమె కోపాన్ని తగ్గించేందుకు ఆమె ఏం చెప్పినా ఒకే అంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల భార్య కూల్ అవుతుందని పేర్కొంటున్నారు. అలా తగ్గి మాట్లాడకుండా మళ్ళీ వాదిస్తే గొడవ ఇంకా పెద్దది అవుతుందని చెబుతున్నారు.
క్షమాపణలు చెప్పండి
భార్యలు అలిగినప్పుడు భర్తల తప్పు లేకపోయినా కొన్నికొన్నిసార్లు క్షమాపణలు చెప్పాలి. క్షమాపణ చెప్పడం వల్ల పోయేది ఏముండదు కానీ, భార్య వెంటనే కూల్ అయిపోతుందట. ఎందుకంటే తమ గొడవలో భార్య తప్పేమి లేదని ఆమె భావిస్తోందట. అందుకే భార్య అలిగినప్పుడు ఓసారి క్షమాపణలు చెప్పడం మంచిందని నిపుణులు సూచిస్తున్నారు.
షాపింగ్‌కు తీసుకెళ్లడం..
ప్రపంచంలో ఏ భార్యకైనా షాపింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే భార్య అలిగినప్పుడు ఆమెను షాపింగ్‌కు తీసుకెళ్ళాలట. ఇలా చేయడం వల్ల భర్తపై ఉన్న భార్య కోపం పోవడంతో పాటు వెంటనే కూల్ అయిపోతుందని చెబుతున్నారు. భార్యకు ఇష్టమైన వస్తువులను కొనివ్వడం, వారికి సర్‌ప్రైజ్ గిఫ్టులు ఇవ్వడం వంటివి చేయడం వల్ల భార్య అలక వీడుతుందని చెబుతున్నారు. దీంతో పాటు వంట చేయడం వల్ల కూడా భార్యలు అలక వదిలేస్తారని, వెంటనే కూల్ ఐపోతారని చెబుతున్నారు.



Click it and Unblock the Notifications