Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
వీటిని ముందే తెలుసుకుంటే.. అప్పుడు ఏ సమస్యా రాదు..!
ప్రేమించిన తరువాత లేదా పెళ్లి చేసుకున్న తరువాత ఎందుకు ఈ బంధంలో ఉన్నామన్న సందేహం అస్సలు రాకూడదు. ప్రస్తుతం అలాంటి కేసులే ఎక్కువగా పెరిగిపోతున్నాయ్. ప్రేమించడానికి లేదా పెళ్లి చేసుకోవడానికి రెండు తరపుల నుంచి అమ్మాయి, అబ్బాయ్ ఎంతో కొంత అబద్ధాలతో మొసంతో బంధంలోకి దిగుతారు, ప్రేమిస్తారు, పెళ్లి చేసుకుంటారు. ఇదే ఇప్పుడు వారి బాంధవ్య జీవితానికి ప్రమాదకరంగా మారింది. అలాంటి సమస్యలను ముందుగా ఎదురుకోవద్దు అంటే కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తప్పకుండా తీసుకోవాలి. రిలేషన్‌షిప్ గురించి ముఖ్యమైన ఈ విషయాలు సమస్యలను రాకుండా చేస్తుంది. ప్రమించే ముందు లేదా పెళ్లి చేసుకునే ముందు ఏ విషయాలను పరిగనణలోకి తీసుకోవాలి. ఎలా వ్యవహరించాలనే కొన్ని ముఖ్యమైన వాటిని మీతో ఇక్కడ పంచుకుంటున్నాం. మీమే మీకు ఇచ్చే సమాచారం మీ రిలేషన్‌షిప్ లైఫ్‌లో మిమ్మల్ని సంతోషంగా వుంచుతుందని ఆశిస్తున్నాము.
సీరియస్‌నెస్ ముఖ్యం
జీవితంలో ముఖ్యమైన వాటికి కాకుండా వేరే ఇతర కాలక్షేపానికి సంబంధించే మీ పార్ట్‌నర్ ఎక్కువగా ప్రధాన్యనిస్తున్నారంటే మీతో రిలేషన్‌షిప్‌కు సంబంధించి ఎక్కువగా సీరియస్‌గా లేరని అర్ధం చేసుకోవాలి. ప్రేమలో అయినా పెళ్లి సంబంధంలో అయినా సరే సీరియస్‌నెస్ చాలా ముఖ్యం లేదంటే వారి ఇద్దరి బంధం ఆటబొమ్మలా మారిపోతుంది.

వ్యక్తిగతంగా దాపరికాలు
రిలేషన్‌షిప్‌లో ఉండేవారు వారికి సంబంధించిన అన్ని విషాయాలను సూటిగా ఎలాంటి దాపరికాలు లేకుండా చర్చించుకోవాలి. అలా కాకుండా మీతో కొన్ని అంశాలను దాస్తున్నారంటే అటువంటి వారితో బంధం కొనసాగించడం చాలా ప్రమాదకరమని తెలుసుకోవాలి. ఎలాంటి ప్రశ్నలకైనా వ్యక్తిగతాన్ని దాటి ఇద్దరూ కలిసి జీవితంలో నిర్ణయం తీసుకోవాలి. స్వేఛ్ఛ ఉండాలి కానీ అది హద్దులు మీరేలా వుండకూడదు.
సమస్యను కలిసి పరిష్కరించుకోవాలి
ఇద్దరి మధ్య ఎలాంటి సమస్య వచ్చినా కలిసి పరిష్కరించుకోవాలి. అప్పుడు మాత్రమే వారి మధ్య ఉన్న విభేదాలు తగ్గి సంతోషంగా ముందుకు వెళ్తారు. గొడవ వచ్చిందంటే అప్పటికప్పుడు తగ్గిపోయేలా ఇద్దరి మాటతీరు, ప్రవర్తన ఉండాలి.
భవిష్యత్తలు మీతో
భవిష్యత్తులో మీతో కలిసి తీసుకునే నిర్ణయాలన్నింటికీ సహకారిగా ఉండాలి. వీటికి సంబంధించి ఇద్దరిలో విభేదాలు వస్తే అప్పుడు అప్రమత్తం కావాల్సిన అవసరం వుంది. జీవిత భాగస్వామి అంటే జీవితంలో కడదాకా నడిచే వ్యక్తి, అలాంటి వ్యక్తి అభిప్రాయాలు చాలా ముఖ్యం. భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమైన విషయాల్లో మీతో కలిసి లేకపోతే ఆ బంధం బలహీనంగా మారుతుంది.
ప్రశ్నలు మిగిలడం
ఇద్దరిలో కొన్ని ప్రశ్నలు అలాగే వుండిపోతాయ్ లేదా వాటికి సమాధానాలు కూడా ఇద్దరికీ సంతృప్తిని ఇవ్వలేదు. ఒకరి నుంచి మరొకరు దూరం జరిగిపోతారు. కలిసి కూర్చొని సమస్య పరిష్కరించుకోవడానికి కూడా ముందుకు రాకపోతే ఇక ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు.
ఎందుకు వివాహం చేసుకోవాలనుకుంటున్నారు ? లేదా ఎందుకు కలిసి ఉన్నారు
భార్యా భర్త ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఎందుకు కలిసి ఉన్నారో వారికి వారు కొన్ని సార్లు ప్రశ్నలు వేసుకొవాలి. దీనిపై ఒకరికి ఒకరు సమాధానం చెప్పుకోవాలి. ఇద్దరి నుంచీ ఓ స్పష్టమైన సమాధానం వచ్చే విధంగా ఉండాలి. పెళ్లి ఒక రోజులో అయిపోతుంది, కానీ భార్యా భర్తలు జీవితాంతం కలిసి ఉండాలి. దీనిపై ఇద్దరూ ఆచితూచి అడుగువేయాలి. తొందరపాటు చర్యలతో ఇద్దరి జీవితాలు నాశనమయ్యే అవకాశం వుంది.



Click it and Unblock the Notifications