Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Relationship Advice : ఇవి పాటిస్తే.. కలకాలం సంతోషంగా ఉంటారు..!
వివాహం బంధం బలంగా ఉండాలంటే అది భార్యా భర్త ఇద్దరి చేతుల్లో ఉంది. తల్లిదండ్రి బంధంలా భార్యా భర్త బంధం పుట్టుకతో రాదు. కానీ కలకాలం కలిసి ఉండాల్సిందే, చనిపోయేంత వరకు కలిసి నడవాల్సింది భార్యా, భర్తలు మాత్రమే. వివాహ బంధంలో వచ్చే సమస్యలను తేలికగా తీసుకోకుండా వాటిని ఎప్పటికప్పుడు పరిష్కిరించుకుంటూ ఉండాలి. ఎంతో ఖర్చు పెట్టి, ఎన్నో జాగ్రత్తలు తీసుకొని వివాహం చేస్తారు. అలాంటి వివాహాన్ని చులకనగా చూడకుండా కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకోవాలి. లేదంటే ఆ బంధం ఎక్కువ కాలం సాగదు.
బ్రేకింగ్ న్యూస్
వివాహబంధంలో ఉన్న సమస్యలను, భార్యా భర్తల మధ్య వున్న గొడవలను ప్రతీ ఒక్కరితో చెబితే ఆ సమస్య మరింత పెద్దదయ్యే అవకాశం వుంటుంది. ఈ గొడవలపై 10 మందికి 10 రకాల అభిప్రాయాలు ఉంటాయ్. సమస్య చెప్పినప్పుడు ఖచ్ఛితంగా సలహా ఇస్తారు, మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయ్. వివాహాలు విచ్ఛిన్నం కావడానికి కూడా ఇలాంటి బ్రేకింగ్ న్యూస్‌లే కారణం. భార్య భర్తల మధ్య సమస్య వుంటే వారు మాత్రమే పరిష్కరించుకోవాలి లేదంటే పరిస్థితి తీవ్రంగా మారుతుంది.

సోషల్ మీడియా
కొందరు తమకున్న సమస్యలన్నింటినీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ వుంటారు. వారు సమాజంలో పెద్ద సెలబ్రిటీ అయినట్టుగా వారి వివాహంలో జరిగిన సంఘటనలను పోస్ట్ చేస్తూ వుంటారు. ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. భార్యా భర్తల మధ్య చాలా సంఘటనలు జరుగుతాయ్ అలాంటి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు. ఏది అనిపించగానే దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల సమస్య పెద్దవుతుంది. సోషల్ మీడియా మీ పర్స్‌నల్ డైరీ కాదని తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో ఎంత తక్కువగా యాక్టివ్ ఉంటే అంత మంచిదనే విషయాన్ని గ్రహించాలి.
ఎక్కువగా ఆశించడం
భార్యా భర్త నుంచి ఎక్కువగా ఆశించవద్దు. అనుకున్నవి, ఆశించినవి దొరకకపోతే తీవ్రమైన భాదలోకి జారుకుంటారు. అన్ని విషయాల్లో అనుకూలంగా ఉండలేకపోవచ్చు కొన్ని విషయాల్లో వ్యతిరేకంగా ఉండే అవకాశముంది. ఇలా ఎక్కువ ఆశించడం వల్ల వివాహబంధంలో సమస్యలు ఎక్కువవుతాయ్.
ఇద్దరూ ఒక్కటి కాదు
పురుషులు, స్త్రీలు ఇద్దరూ ఒక్కటి కాదు. ప్రకృతి పరంగా పురుషుడి మనస్తత్వం, స్త్రీ మనస్తత్వం వేరుగా వుంటుంది. పురుషులు, స్త్రీల ఒక్కటికాదనే సత్యాన్ని ఎవ్వరూ కాదనలేరు. భార్యా భర్తల మధ్య విభేదాలు వచ్చినప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరి మధ్యలో వాదనలు జరితే అవి కేవలం వారి అభిప్రాయమే తప్ప అవే సత్యం కాదనే నిజాన్ని మరిచిపోవద్దు.
వివాహ ప్రమాణాలు
వివాహ సమయంలో పురోహితుడి ద్వారా భార్యా, భర్త ఇద్దరూ ఎన్నో ప్రమాణాలు చేస్తారు. ఇద్దరికీ ఏ బాధ్యతలుంటాయనేది భార్యభర్తలిద్దరికీ చెప్పబడుతుంది. దేవుడి సాక్షిగా, అగ్ని సాక్షిగా, దేవతల సాక్షిగా ఇద్దరి వివాహం జరుగుతుంది. ఆ రోజు చేసిన ప్రమాణాలను ఇద్దరూ చులకనగా తీసుకోకుండా సీరియస్‌గా భావించాలి. ఆ ప్రమాణాలను తప్పి ప్రవర్తిస్తే ఇక ఇద్దరి బంధం నిలవదనే సత్యాన్ని తెలుసుకోవాలి.
పడుకునే ముందు
ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకొన్న తరువాతే నిద్రపోవాలి. సమస్య పరిష్కరిచుకోకుండా నిద్రపోతే అది మరింత జఠిలంగా మారుతుంది. తరువాత రోజు ఆ సమస్య మరింత తీవ్రంగా పెద్దగా కనబడుతుంది.



Click it and Unblock the Notifications