Latest Updates
-
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు! -
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి -
రాత్రంతా తేనెలో ఓట్స్ నానబెట్టి ఉదయాన్నే తింటే ఏమవుతుందో తెలుసా?
సెక్స్‌కు నెలల తరబడి గ్యాప్ వచ్చేసిందా? ఇలా అగ్గి రాజేయండి
పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లడం, వ్యాపారం కోసం వేరే చోట్లకు వెళ్లడం, అలాగే ఇంట్లో పనులు, పరిస్థితులు సహకరించకపోవడం.. ఇంకేదైనా కారణం వల్ల కొన్నిసార్లు శృంగారానికి ఎక్కువ రోజులు గ్యాప్ వచ్చేస్తుంది. మీరొక దగ్గర, మీ జీవిత భాగస్వామి మరో దగ్గర ఉంటూ ఇద్దరూ విరహ వేదన అనుభవించే ఉంటారు. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మీ జీవిత భాగస్వామి వద్దకు వెళ్తే.. శృంగారంలో మునిగిపోవాలని కోరుకుంటారు చాలా మంది.

కొన్ని సార్లు శృంగారానికి గ్యాప్ రావడం కూడా బాగుంటుంది. విరహ వేదన అనుభవించి ఒక్కసారిగా గేట్లు ఎత్తేస్తే.. పడగ్గదిలో రెచ్చిపోయి శృంగారం చేస్తుంటారు. మీకు కూడా అలాంటి పరిస్థితే వచ్చినట్లయితే, చాలా రోజుల గ్యాప్ తర్వాత శృంగారంలో పాల్గొంటుంటే.. తొందరపడి కార్యాన్ని చెడగొట్టుకోకుండా ఇద్దరూ కలిసి ఎలా సంతృప్తి పడాలో తెలుసుకోవడం ముఖ్యం.
రొమాంటిక్ మూవీస్ చూడండి:
చాలా రోజుల గ్యాప్ వచ్చిన తర్వాత మీరు జీవిత భాగస్వామిని కలుసుకుంటున్నారు అనుకోండి. ఓ ప్రణాళిక ప్రకారం, ఓ ప్లాన్ వేసుకుని శృంగారంలో పాల్గొంటే సంతృప్తి స్థాయిలో వేరే స్థాయిలో ఉంటుంది. ఇద్దరి మధ్య మొదట సాన్నిహిత్యాన్ని తిరిగి పెంచుకునేందుకు ప్రయత్నించండి. నేరుగా కార్యం మొదలు పెట్టకుండా మెల్లిగా, నిదానంగా మూడ్ లోకి తీసుకురండి. కావాలంటే రొమాంటిక్ మూవీస్, ఇద్దరికీ నచ్చితే శృంగారభరిత వీడియోలు కలిసి దంపతులు ఇద్దరు కలిసి చూడండి. ఏదైనా కొత్తగా చేయాలనుకుంటే, మీ భాగస్వామికి శృంగార బొమ్మలు బహుమతిగా ఇవ్వండి. హాట్ రొమాంటిక్ మూవీ చూస్తూ మూడ్ లోకి వచ్చేసి క్రమంగా శృంగారాన్ని ప్రారంభించండి. జీవిత భాగస్వామిని పక్కన పెట్టుకుని రొమాంటిక్ సన్నివేశాలు చూస్తుంటే ఆటోమేటిక్ గా ఎక్సైట్‌మెంట్ వచ్చేస్తుంది.
సంభోగానికి తొందర పడవద్దు:
ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత శృంగారం చేస్తున్నారు కాబట్టి తొందరపాటు సహజం. కానీ కాస్త ఓపిక పట్టడం మంచిది. తొందరపడవద్దు. ఎందుకంటే తొందరపాటు మొత్తం మానసిక స్థితిని నాశనం చేస్తుంది. అందుకే మీరు నెమ్మదిగా భాగస్వామి వద్దకు వెళ్లి, వారితో రొమాంటిక్ గా మాట్లాడండి. ఆపే వారి శరీరాన్ని నెమ్మదిగా తాకండి. రొమాన్స్ చేస్తుంటే క్రమంగా వారిలో అగ్గి రాజుకుంటుంది. క్రమంగా అది ఎక్కువవుతుంది. వారి ప్రైవేట్ పార్ట్స్ ను, ట్రిగ్గరింగ్ పార్ట్స్ ను మెల్లిగా తాకండి. రొమాన్స్ చేయడంలో తొందరపాటు వద్దు.. నిదానమే బాగుంటుంది.
స్థానాన్ని మార్చండి:
చాలా రోజుల గ్యాప్ తర్వాత శృంగారం చేస్తున్నారు. కాబట్టి, కొత్తగా ప్రయత్నించండి. పడగ్గదిలో ఎప్పుడూ చేసుకునేది కాబట్టి ఈ సారి వేరే చోట చేయండి. వంటగది, బాత్రూమ్, హాల్, బాల్కనీ, టెర్రస్ లాంటి ప్రదేశాల్లో ప్రయత్నించండి. కొత్త చోట, కొత్త కొత్తగా శృంగారాన్ని ఎంజాయ్ చేయండి. కొత్తదనం ఎప్పుడూ ఎగ్జైట్‌మెంట్‌ను అందిస్తుంది.
రొమాన్స్ లో కొత్తదనం ప్రయత్నించండి:
చాలా రోజుల గ్యాప్ వచ్చిన తర్వాత కొత్తకొత్తగా ట్రై చేయండి. వాళ్లు వంట పనిలో బిజీగా ఉంటే వెనక నుంచి వాటేసుకోండి. మెడపై కిస్ చేస్తూ రొమాన్స్ చేయండి. ఒక వేళ వాళ్లు ల్యాప్ టాప్ పట్టుకుని పని చేస్తూ ఉంటే.. పక్కనే కూర్చొని ఎక్స్‌పోజింగ్ తో మత్తెక్కించండి. ప్రైవేట్ పార్ట్స్ వద్ద తాకుతూ ఉండండి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications