Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
ఆఫీస్ రొమాన్స్ లో ఇండియా నెం.2..ప్రతి పదిమందిలో నలుగురు ఆఫీసులోనే!
ఒకప్పుడు ఆఫీసులో ప్రేమ అంటే గుసగుసలు, చాటుమాటు వ్యవహారం. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఆఫీస్ రొమాన్స్ అనేది ఇప్పుడు ఒక సాధారణ ట్రెండ్ గా మారుతోంది. ఈ విషయంలో భారతదేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని ఇటీవలి సర్వేలో తేలింది. మెక్సికో మొదటి స్థానంలో ఉంది.
ప్రముఖ డేటింగ్ ప్లాట్ ఫామ్ ఆష్లే మాడిసన్, యూగోవ్ (YouGov) సంయుక్తంగా 11 దేశాల్లో(ఇటలీ, మెక్సికో,ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, అమెరికా, జర్మనీ, భారతదేశం, స్పెయిన్, స్విట్జర్లాండ్, యూకే) నిర్వహించిన సర్వేలో..భారతదేశంలో దాదాపు 40శాతం మంది ఉద్యోగులు తమ సహోద్యోగితో గతంలో డేటింగ్ చేశారని లేదా ప్రస్తుతం చేస్తున్నారని అంగీకరించారు. ఇది అమెరికా, యూకే వంటి పాశ్చాత్య దేశాల (30శాతం) కన్నా చాలా ఎక్కువ.

స్త్రీ, పురుషుల దృక్పథంలో తేడాలు
ఈ సర్వే ప్రకారం ఆఫీస్ రొమాన్స్ విషయంలో పురుషులు (51శాతం).. మహిళల (36శాతం) కంటే ఎక్కువ చొరవ చూపుతున్నారని తేలింది. సంబంధాలను అంగీకరించడానికి కూడా మగాళ్లే ఎక్కువ ఓపెన్ గా ఉంటున్నారు.
అయితే పరిణామాల గురించి ఆలోచించడంలో ఇద్దరి మధ్య తేడాలున్నాయి. మహిళలు తమ కెరీర్ పై ప్రతికూల ప్రభావం పడుతుందేమోనని (29శాతం) ఎక్కువగా ఆందోళన చెందుతుంటే.. పురుషులు మాత్రం వ్యక్తిగత పరిణామాల (30శాతం) గురించి ఎక్కువగా భయపడుతున్నారు.
మరోవైపు 18-24 ఏళ్ల యువ ఉద్యోగులు తమ కెరీర్ ఆరంభంలో ఉన్నందున ఇలాంటి సంబంధాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నారు.
మారుతున్న భారతీయ సమాజం
ఈ ధోరణి కేవలం ఆఫీస్ రొమాన్స్ కే పరిమితం కాలేదు. ఓపెన్ మ్యారేజెస్, వివాహేతర సంబంధాల వంటి విషయాల్లో కూడా భారతీయుల ఆలోచనా సరళి మారుతోంది. గ్లీడెన్ అనే మరో డేటింగ్ యాప్ సర్వే ప్రకారం 35శాతం మంది భారతీయులు ఓపెన్ రిలేషన్ షిప్ లో ఉన్నామని, 41శాతం మంది తమ భాగస్వామి ఒప్పుకుంటే ప్రయత్నిస్తామని చెప్పడం గమనార్హం.

ప్రేమ, కెరీర్ ల మధ్య బ్యాలెన్స్ కోసం 5 సూత్రాలు
ఆఫీసులో ప్రేమ చిగురించడం సహజమే. అయితే అది మీ వృత్తి జీవితానికి అడ్డంకిగా మారకూడదు. ఆఫీసు ప్రేమలు ఒత్తిడికి కాకుండా ఆనందానికి మూలంగా మారాలంటే ప్రేమ, కెరీర్ మధ్య సరైన సమతుల్యత పాటించడం చాలా ముఖ్యం.
-మీ భాగస్వామితో ఆఫీసులో ఉన్నప్పుడు ఏ విషయాలు మాట్లాడాలి, ఏవి వ్యక్తిగతంగా ఉంచుకోవాలి అనే దానిపై స్పష్టమైన హద్దులు ఏర్పాటు చేసుకోండి. ఇది అనవసరమైన పుకార్లను అరికట్టి..పనిపై ఏకాగ్రతను పెంచుతుంది.
-మీ రిలేషన్ గురించి ఆఫీసులో ఎంతవరకు తెలియజేయాలి, ఏ విషయాలు గోప్యంగా ఉంచాలి అనే దానిపై మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడండి. ఇది అపార్థాలకు తావివ్వకుండా మీ బంధాన్ని బలపరుస్తుంది.
-ప్రేమ మీ జీవితంలో ముఖ్యమే కావచ్చు, కానీ మీ ఉద్యోగ బాధ్యతలు, డెడ్ లైన్స్ ని ఎప్పుడూ విస్మరించవద్దు. వర్క్ టైంలో పనికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి.
-మీ ప్రేమ భాగస్వామితోనే కాకుండా, ఆఫీసులోని ప్రతి ఒక్కరితోనూ వృత్తిపరంగా, గౌరవంగా ప్రవర్తించండి. అతి చనువు లేదా నాటకీయ ప్రవర్తన మీ ఇమేజ్ ను దెబ్బతీస్తుంది.
-మీ ఆఫీస్ లవ్ స్టోరీని సోషల్ మీడియాలో ఎక్కువగా పంచుకోవడం మానుకోండి. ఇది పుకార్లకు, అనవసరమైన సమస్యలకు దారితీస్తుంది. మీ వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్ గా ఉంచుకోవడం ఉత్తమం.



Click it and Unblock the Notifications