Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
విడాకులు ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో విడాకుల పరిస్థితి ఏంటి?
ప్రస్తుతం మనదేశంలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో..విడాకులు కూడా అంతే వేగంగా అవుతున్నాయి. ఉదయం పెళ్లి పీఠలెక్కిన దంపతులు సాయంత్రానికి విడిపోయి విడాకులకు అప్లయ్ చేస్తున్న అనేక ఘటనలు మనం తరచుగా చూస్తూనే ఉన్నాం.
పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల భారత్ లో విడాకుల రేట్లు ఎక్కువగా ఉంటాయని మనం తరచుగా అనుకుంటూ ఉంటాం. కానీ మీ అంచనాలు తప్పని వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజా నివేదిక చెబుతోంది. ఈ రిపోర్ట్ చూస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

విడాకుల్లో ప్రపంచ నెంబర్ వన్
ప్రపంచంలోనే అత్యధిక విడాకులు నమోదవుతున్న దేశం స్పెయిన్. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ప్రకారం స్పెయిన్ లో దాదాపు 85 శాతం వివాహాలు విడాకులతోనే ముగుస్తున్నాయట. ఇది నిజంగా దిగ్భ్రాంతికరమైన విషయం. 2023 గణాంకాల ప్రకారం ప్రతి 100 పెళ్లిళ్లలో దాదాపు 45 పెళ్లిళ్లు పెటాకులవగా.. 2024లోనూ అక్కడ 82,991 విడాకుల కేసులు నమోదయ్యాయి.
ఎందుకింత తేడా?
స్పెయిన్ లో విడాకుల రేటు ఇంత ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం అక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితులే. మన దేశంలో విడాకులను ఒక శాపంగా భావిస్తే.. స్పెయిన్ లో దానిని ఒక ప్రగతిశీల నిర్ణయంగా (ప్రోగ్రెసీవ్ ఐడియా) చూస్తారు.
ఆర్థిక స్వాతంత్ర్యం
స్పెయిన్ లో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానంగా సంపాదిస్తారు. ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేకపోవడంతో నచ్చని బంధంలో ఇబ్బంది పడుతూ కొనసాగడానికి ఎవరూ ఇష్టపడరు.
సహజీవనం
పెళ్లికి ముందే కలిసి జీవించడం అక్కడ చాలా సాధారణం. ఇది బంధాల పట్ల వారి దృక్పథాన్ని మార్చేసింది. భాగస్వామి నచ్చకపోతే విడిపోవడానికి చట్టపరంగా గానీ, సామాజికంగా గానీ అక్కడ పెద్దగా అడ్డంకులు ఉండవు.
రష్యా, అమెరికా పరిస్థితి ఏంటి?
స్పెయిన్ తర్వాత అత్యధిక విడాకులు జరుగుతున్న దేశం రష్యా. అక్కడ 74 శాతం వివాహాలు విడాకులకు దారితీస్తున్నాయి. పొరుగున ఉన్న ఉక్రెయిన్ (71 శాతం), ఇటలీ (69 శాతం), ఫ్రాన్స్ (55 శాతం) వంటి దేశాలు కూడా ఈ జాబితాలో ముందే ఉన్నాయి. మనం ఎక్కువగా ఊహించుకునే అమెరికాలో విడాకుల రేటు 41 శాతం మాత్రమే ఉండటం గమనార్హం.

ఆసియా దేశాల్లో బెటర్
యూరప్ తో పోలిస్తే ఆసియా దేశాల్లో విడాకుల సంస్కృతి కాస్త తక్కువనే చెప్పాలి. ఆసియాలో దక్షిణ కొరియా 46, చైనాలు 44 శాతం విడాకుల రేటుతో ముందున్నాయి. టెక్నాలజీ పరంగా ఎంత ఎదిగినా జపాన్ లో విడాకుల రేటు 35 శాతమే. ఇక ఇండోనేషియా (28 శాతం), ఇరాన్ (14 శాతం), వియత్నాం (7 శాతం) దేశాలు విడాకుల విషయంలో చాలా వెనుకబడి ఉన్నాయి.
భారత్ స్థానం ఎక్కడ?
భారత్ ఎంత మోడరన్ అవుతున్నా, విడాకుల విషయంలో మాత్రం ప్రపంచంలోనే అట్టడుగు స్థానంలో ఉంది. మన దేశంలో విడాకుల రేటు 1 శాతం కంటే తక్కువ. దీనికి ప్రధాన కారణం మన కుటుంబ వ్యవస్థే. భారత్ లో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందం కాదు రెండు కుటుంబాల కలయిక.
పెళ్లిని మనం ఏడడుగుల పవిత్ర బంధంగా భావిస్తాం. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే విడిపోవాలని కాకుండా, పెద్దలు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించడానికే ప్రయత్నిస్తారు. సమాజం, కుటుంబ పరువు, పిల్లల భవిష్యత్తు వంటి అంశాలు దంపతులను కలిసేలా చేస్తున్నాయి.
నేటికీ మన సమాజంలో విడాకులను అంత తేలికగా స్వీకరించరు. డిజిటల్ యుగంలో పాశ్చాత్య పోకడలు వస్తున్నప్పటికీ, భారతీయులు ఇంకా తమ సంప్రదాయ విలువలు, నైతికతకే పెద్దపీట వేస్తున్నారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
కాబట్టి భారత్‌లో విడాకులు పెరుగుతున్నాయని మనం కంగారు పడుతున్నా, ప్రపంచ దేశాలతో పోలిస్తే మన కుటుంబ బంధాలు ఇంకా పటిష్టంగానే ఉన్నాయని గర్వంగా చెప్పుకోవచ్చు.



Click it and Unblock the Notifications