Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
Adani: అదానీలో ఈ యాంగిల్ కూడా ఉందా..మాటలతోనే ఆమెను అలా..
అదానీ..గత కొద్ది రోజులుగా టీవీ చూసినా,న్యూస్ పేపర్ చదివినా,ఏ పొలిటికల్ ప్రెస్ మీట్ విన్నా అన్ని చోట్ల ఈ పేరు మార్మోగుతుంది. భారతీయ పారిశ్రామికవేత్త, ప్రపంచ కుబేరుడు అయిన అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీ(Gautam adani) తన గ్రీన్ ఎనర్జీ కంపెనీకి సోలార్ ఎనర్జీ సప్లై ఒప్పందాలు పొందేందుకు భారత అఫీషియల్స్ కి భారీగా లంచాలు ఇచ్చారన్న ఆరోపణలో అమెరికాలో కేసు నమోదవడంతో అమెరికా నుంచి ఇండియా దాకా చర్చ జరుగుతోంది. అయితే ఇదిలా ఉంటే,నేడు అదానీ విజయ ప్రయాణంలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన మరొక ప్రత్యేక అంశం ఉంది. అయితే ఆయన లవ్ స్టోరీ.
గౌతమ్ అదానీ చాలా సింపుల్ గా ఉండే మనిషి. ఆయన పెద్దగా హడావుడి చేస్తున్నట్లు ఎక్కడా మనకు కనిపించదు. అదానీ లైఫ్ స్టైల్ లాగే ఆయన ప్రేమ కథ కూడా చాలా సింపుల్ గా,ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. ఆర్ ఎన్ భాస్కర్ రాసిన గౌతమ్ అదానీ: రీమేజినింగ్ బిజినెస్ ఇన్ ఇండియా అనే గౌతమ్ అదానీ,ఆయన భార్య ప్రీతి అదానీల(Priti adani) ప్రేమకథ వివరంగా చెప్పబడింది. మొదట్లో ప్రీతీ అదానీకి గౌతమ్ అదానీ అంటే ఇష్టం లేదని ఆ పుస్తకంలో తెలిపారు. నిజానికి ప్రీతి డెంటిస్ట్. గౌతమ్ అదానీ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయనప్పటికీ ప్రీతి తండ్రి సెవంతిలాల్ తన కూతురికి పెళ్లి కోసం సరైన వ్యక్తి గౌతమ్ అదానీ అని భావించాడు.

అయితే గౌతమ్ తనకు సరిపోడని ప్రీతి భావించింది. గౌతమ్ అదానీనీ కలిసేందుకు కూడా ఆమె ఇష్టపడలేదు. దీంతో ఒకరి బాహ్య రూపాన్ని మాత్రమే కాకుండా వారి నిజమైన సామర్థ్యాన్ని చూడాలని ప్రీతి తండ్రి ఆమెకు వివరించాడు. దీని తర్వాత ప్రీతి.. గౌతమ్ అదానీని కలవడానికి అంగీకరించింది. మొదటి సమావేశం తర్వాత ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి..తర్వాత వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రీతి, గౌతమ్ అదానీల పెళ్లి 1986 మే1న జరిగింది.
వివాహం తర్వాత ప్రీతి జీవితంలో కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే గౌతమ్ తరచుగా పని కోసం దూరంగా ఉండవలసి వచ్చింది. అయితే సమయం దొరికినప్పుడల్లా భార్య, కుటుంబ సభ్యులతో గడిపేందుకు అదానీ ప్రయత్నించాడు. ఆర్ఎన్ భాస్కర్ పుస్తకం ప్రకారం గౌతమ్ ఎప్పుడూ పని ముగించుకుని కుటుంబంతో గడపడానికి ప్రయత్నించేవాడని ప్రీతి చెప్పింది.
ప్రీతి అదానీ వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో ఎల్లప్పుడూ గౌతమ్‌కు అండగా నిలిచారు. ఆమె గౌతమ్ అదానీకి మద్దతు ఇవ్వడమే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటుంది. అదానీ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవ వైపు అనేక అడుగులు వేశారు. ప్రీతి అదానీ సామాజిక కార్యకర్తగా పేరుగాంచింది. విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక రంగాలలో ఆమె దాతృత్వ సేవలందిస్తున్నారు.
గౌతమ్ అదానీ, ప్రీతి మధ్య సంబంధం ప్రేమ మాత్రమే కాదు,భాగస్వామ్య బాధ్యత కూడా. ఇద్దరూ ఒకరినొకరు ప్రేరేపించుకుంటారు. వారి జీవితంలోని ప్రతి అంశంలో ఒకరికొకరు మద్దతు ఇస్తారు.
ప్రేమ,అవగాహన,గౌరవం ఉంటే ఏ జంట అయినా ప్రపంచంలోనే అతిపెద్ద సవాళ్లను ఎదుర్కోగలరనడానికి గౌతమ్,ప్రీతి ప్రేమకథ సజీవ ఉదాహరణ. ఇద్దరూ తమ తమ రంగాలలో విజయవంతంగా పని చేస్తున్నారు.



Click it and Unblock the Notifications