Latest Updates
-
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త!
శృంగార సమయంలో మూలుగులు..గది బయట ఉన్నోళ్లకి వినబడకూడదంటే ఇలా చేయండి
లైంగిక జీవితం గురించి ప్రతి వ్యక్తికి వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయి. . ఆరోగ్యకరమైన శృంగార జీవితం మనిషికి మానసికంగా, శారీరకంగా చాలా అవసరం. అయినా ఏ వ్యక్తి దీని గురించి బహిరంగంగా మాట్లాడటానికి లేదా చర్చించడానికి ఇష్టపడరు. ముఖ్యంగా అమ్మాయిలు దీనికి పూర్తిగా దూరంగా ఉండాలని కోరుకుంటారు. ఒకప్పటి విశాలమైన ఇళ్ల స్థానంలో ఇప్పుడు రెండు గదుల చిన్న ఫ్లాట్లు వచ్చేశాయి. గోడలు పలుచగా, ప్రైవసీ తక్కువగా ఉండే ఈ ఆధునిక నివాసాల్లో దంపతులకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి.
ముఖ్యంగా కొత్తగా పెళ్లయినవాళ్లకు అయితే తామ ఏకాంత సమయంలో మాటలు, శబ్దాలు బయటకు వస్తాయేమోనని ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటారు. అయితే ఏకాంతంగా గడిపే సమయంలో కలిగే భావోద్వేగాలను, ఆనందపు అరుపులను అదుపు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారా? మీ బెడ్ రూమ్ బయట ఉన్నవాళ్లో, పక్కగదిలోనో, పైన, కింద ఫ్లాట్లలో ఉండేవాళ్లు వింటారేమోనన్న భయం మీ ఆనందాన్ని ఆవిరి చేస్తుందా?

శృంగారంలో మూలుగులు, చిన్న చిన్న అరుపులు సర్వసాధారణం. అవి లేకుండా ఆ అనుభూతి అసంపూర్ణం అని చాలామంది భావిస్తారు. తమ భాగస్వామి ఆనందంతో చేసే శబ్దాలు వినడానికే పురుషులు, స్త్రీలు ఇద్దరూ ఇష్టపడతారని పలు సర్వేల్లో కూడా తేలింది. ఆ మూలుగులు వారి మధ్య బంధాన్ని, ఉత్తేజాన్ని మరింత పెంచుతాయి. అయితే ఇంట్లో పెద్దవాళ్లు లేదా పిల్లలు ఉంటే మనసు విప్పి ఆ క్షణాలను ఆస్వాదించలేని పరిస్థితి. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటబ్బా అని బుర్ర బద్దలు కొట్టకుంటున్నారా? మీ ఏకాంతాన్ని, ఆనందాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్న చిన్న చిట్కాలతో ఈ ఇబ్బందిని అధిగమించవచ్చు.
సంగీతంతో స్వర్గం
మీ ఏకాంత సమయంలో మీకు ఇష్టమైన రొమాంటిక్ పాటలను లేదా సంగీతాన్ని ప్లే చేయండి. ఇది మీ గదిలో ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించడమే కాకుండా బయటి ప్రపంచానికి మీ శబ్దాలు వినిపించకుండా ఒక తెరలా పనిచేస్తుంది.
శబ్దాన్ని శబ్దంతోనే
ఏసీ లేదా ఫ్యాన్‌ను ఆన్ చేయడం కేవలం వేడిని తగ్గించడానికే కాకుండా వాటి నుండి వచ్చే శబ్దం మీ భావోద్వేగాల తీవ్రతను బయటకు వినిపించకుండా కాపాడుతుంది. బాత్రూమ్ లో ట్యాప్‌ను కాసేపు అలా వదిలేయడం కూడా ఒక మంచి ఉపాయం. అయితే నీటిని వృద్ధాగా పోనివ్వకుండా ఓ బకెట్ లో పట్టి ఉంచుకోండి..తద్వారా నీటి వృద్ధా ఉండదు.
టీవీ సౌండ్ తో మేనేజ్
మీ గదిలో టీవీని ఆన్‌లో ఉంచండి. దాని శబ్దం మీ ప్రైవసీకి భంగం కలగకుండా చూస్తుంది. ఇది చాలా సులభమైన, ఎవరికీ అనుమానం రాని పద్ధతి.
భావోద్వేగ నియంత్రణ
భావోద్వేగం కట్టలు తెంచుకుంటున్నప్పుడు నోటితో మెత్తగా చేతిని లేదా దిండును కొరకడం వల్ల శబ్దం అదుపులో ఉంటుంది.. అదే సమయంలో మీలోని ఉత్తేజం రెట్టింపు అవుతుంది. ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే, మీ ఏకాంత ప్రపంచంలో మీరే రారాజు, మీరే రాణి. ఎటువంటి భయం లేకుండా మీ మధురమైన క్షణాలను పూర్తి ఆనందంతో ఆస్వాదించవచ్చు.



Click it and Unblock the Notifications