Latest Updates
-
లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా చేసుకునేలా ‘గీ రైస్’.. ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో ఇలా చేసేయండి.! -
నలుగురితో నవ్వుతూ కలిసిపోవాలంటే ఈ 6 ప్రశ్నలు అస్సలు అడగకండి.! -
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం.. పాలు లేకుండానే ఎంతో టేస్టీగా.! -
మెనోపాజ్ తర్వాత తీవ్రంగా కీళ్లు, ఎముకల సమస్య.. ఇందుకు కారణాలేంటి.. ఎలా బయటపడాలి.? -
మహిళల్లో పీరియడ్స్, ఫిట్నెస్ సమస్యలకు చెక్ పెట్టే ప్రొటీన్ పౌడర్.. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఇలా చేసేయండి -
ఉల్లి, వెల్లుల్లి లేకుండా పూరీ, బగారాకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆలూ టమాటర్ గ్రేవీ.. ఈ తాలింపుతోనే అసలు మజా.! -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీ, ఈ చట్నీతో తింటే అమోఘం.! -
ఉతికిన బట్టలు ఈ సమయంలో ఆరేస్తున్నారా.. వాస్తు ప్రకారం ఇంటికి ఎంత ప్రమాదకరమో తెలుసా.? -
వరలక్ష్మీ వ్రతం 2026: మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి బెస్ట్ మెసేజెస్, వాట్సాప్ స్టేటస్ లు.. -
రోజుకు 2 యాలకులు తింటే..15 రోజుల్లో మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
భార్యాభర్తలు ఇలాంటి లైంగిక తప్పులు అస్సలే చేయకూడదు, చాలా ప్రమాదకరం!
భార్యాభర్తల బంధంలో సెక్స్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఓ ఇద్దరు దంపతుల మధ్య కేవలం ప్రేమ మాత్రమే కాకుండా ప్రతిరోజూ దినచర్యలో సెక్స్ ను భాగం చేసుకుంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆరోగ్యాన్ని బాగు చేయడమే కాకుండా.. ఇద్దరి మధ్య ప్రేమ ఎక్కవవడానికి కూడా కారణం అవుతుందట. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతిరోజూ సెక్స్ లో పాల్గొనలేకపోతున్నారు.

ఒకరికి మార్నింగ్ షిఫ్ట్, మరొకరికి నైట్ ఫిష్ట్, లేదా పనిలో విపరీతమైన ఒత్తిడి, రోజూవారీ ఉద్యోగ పనుల్లో భాగంగా బాగా అలిసిపోయే వాళ్లు సెక్స్ కు చాలా దూరంగా ఉంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి జంటలు అయినా వారి సెక్స్ జీవితంలో ఇలాంటి తప్పులు చేయకూడదని చెబుతున్నారు. అసలు ఎలాంటి లైంగిక తప్పులు దంపతుల మధ్య బంధాన్ని తగ్గిస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఫోర్ ప్లే చేయకపోవడం..!
దంపతులు శారీరకంగా కలిసేటప్పుడు ఫోర్ ప్లే లో పాల్గొనడం చాలా ముఖ్యం. కానీ చాలా మంది నేరుగా సెక్స్ చేస్తుంటారు. కానీ ఇద్దరిలోనూ ఉద్రేకం పెరిగే వరకు ఒకరినొకరు తడముకోవడం, ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం వంటివి చేయాలి.
ఒకరి స్పర్శతో మరొకరు ఉద్రేకాన్ని పెంచుకోవాలి. అప్పుడే సెక్స్ ను బాగా ఎంజాయ్ చేయగల్గుతారు. ఫోర్ ప్లే లేకుండా నేరుగా చేసుకుంటే.. కొన్నాళ్లకు అదో రెగ్యులర్ పని లాగా అనిపిస్తుందట.
2. ఉద్రేకానికి అవకాశం ఇవ్వకపోవడం
చాలా మంది పురుషులు ఆడవారు ఉద్రేకానికి వచ్చే వరకు ఓపికగా ఉండలేరు. దాని వల్ల యోని పొడిబారడం, ఆమెకు నొప్పిగా అనిపించడం జరుగుతుంది. కానీ ఫోర్ ప్లే వంటివి చేస్తూ.. మీ భాగస్వామిలో ఉద్రేకం పెంచి, ఆమె ఉద్రేకం పొందే వరకు వేచి చూడాలి. అప్పుడు సెక్స్ ని ఇద్దరూ చాలా బాగా ఎంజాయ్ చేయగల్గుతారు.
3. ఐ లవ్ యూ చెప్పకపోవడం
ఐ లవ్ యూ అనే పదం చాలా చిన్నది. కానీ మీ భాగస్వామిపై మీ ప్రేమను వ్యక్తిపరిచే అద్భుతమైన మాట ఇది. అందుకే తరచుగా మీ భాగస్వామికి ఐ లవ్ యూ అని చెప్పాలి. ముఖ్యంగా సెక్స్ చేసుకునేటప్పుడు ఈ మాట చెప్పడం వల్ల ప్రేమతో పాటు ఉద్రేకం కూడా ఎక్కువవుతుంది. ఇది మీరిద్దరూ మరింత ఆహ్లాదమైన క్షణాలను గడపడానికి దోహదపడుతుంది.
4. పోర్న్ కి బానిసలుగా మారడం
చాలా మంది ఈరోజుల్లో పోర్న్ సైట్స్ చూస్తున్నారు. ఎప్పుడో ఒకసారి చూస్తే పరవాలేదు కానీ తరచుగా చూడడం వల్ల వాటికి బానిసలుగా మారుతుంటారు. దీని వల్ల అనేక సమస్యలు ఏర్పడుతుంటాయి.
నేరుగా సెక్స్ లైఫ్ ను అంతగా ఎంజాయ్ చేయలేరు. ముఖ్యంగా అంగస్తంభన, సెక్స్ పై కోరిక తగ్గడం, స్ఖలనం సమ్యలు రావడం జరుగుతుంటుంది. కాబట్టి పోర్న్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
5. అభిరుచులు ఎప్పుడూ ఒకేలా ఉండవు..!
ఎక్కువ శాతం జంటలు.. తమ భాగస్వామి గురించి తమకు పూర్తిగా తెలుసనుకుంటారు. కానీ కాలానికి అనుగుణంగా అలవాట్లు, అభిరుచులు మారుతాయని గుర్తించాలి.
ఎప్పటికప్పుడు మీ భాగస్వామి అభిరుచులను గమనిస్తూ.. వారికి ఏదంటే ఇష్టమో తెలుసుకుంటూ ఉండాలి. మోజుతో చేసే సెక్స్ ఎక్కువ కాలం ఉండదు. కానీ ప్రేమతో చేసే సెక్స్ జీవితాంతం కొనసాగుతుంది.



Click it and Unblock the Notifications