Latest Updates
-
నలుగురితో నవ్వుతూ కలిసిపోవాలంటే ఈ 6 ప్రశ్నలు అస్సలు అడగకండి.! -
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం.. పాలు లేకుండానే ఎంతో టేస్టీగా.! -
మెనోపాజ్ తర్వాత తీవ్రంగా కీళ్లు, ఎముకల సమస్య.. ఇందుకు కారణాలేంటి.. ఎలా బయటపడాలి.? -
మహిళల్లో పీరియడ్స్, ఫిట్నెస్ సమస్యలకు చెక్ పెట్టే ప్రొటీన్ పౌడర్.. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఇలా చేసేయండి -
ఉల్లి, వెల్లుల్లి లేకుండా పూరీ, బగారాకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆలూ టమాటర్ గ్రేవీ.. ఈ తాలింపుతోనే అసలు మజా.! -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీ, ఈ చట్నీతో తింటే అమోఘం.! -
ఉతికిన బట్టలు ఈ సమయంలో ఆరేస్తున్నారా.. వాస్తు ప్రకారం ఇంటికి ఎంత ప్రమాదకరమో తెలుసా.? -
వరలక్ష్మీ వ్రతం 2026: మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి బెస్ట్ మెసేజెస్, వాట్సాప్ స్టేటస్ లు.. -
రోజుకు 2 యాలకులు తింటే..15 రోజుల్లో మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
మొదటి రోజే మేనేజర్‌కి ఊహించని షాక్.. 6 గంటల్లోనే కొత్త ఉద్యోగి షాకింగ్ నిర్ణయం
సెక్స్ షెడ్యూలింగ్.. ఇదెలా పని చేస్తుంది, దీని వల్ల ఏమైనా లాబాలు ఉన్నాయా?
సెక్స్ షెడ్యూలింగ్.. ఈ మధ్య చాలా జంటలు ఈ విధానాన్ని ఫాలో అవుతున్నాయి. మరికొంత మందేమో ఈ పద్ధతి అవసరమా దీని వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి సెక్స్ షెడ్యూలింగ్ వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి.
మనం ఉన్న ప్రస్తుతం బిజీ లైఫ్ లో దేనికైనా సరే సమయం కేటాయించుకోవాల్సిందే. లేదంటే అటు ఉద్యోగాన్ని ఇటు పర్సనల్ లైఫ్ ను అస్సలే బ్యాలెన్స్ చేయలేము.

వారమంతా బిజీ బిజీగా.. ఇకపై సెక్స్ కు సమయమెప్పుడు?
ముఖ్యంగా వారం రోజులంతా రోజూ ఉద్యోగానికి వెళ్లడం.. వచ్చాక పిల్లలు, ఇతర పనులతో రెస్ట్ తీసుకోవడానికి కూడా సమయమం లేకుండా పోతుంటుంది. అలాగే వారాంతాల్లో పిల్లలను బయటకు తీసుకెళ్లడం, షాపింగ్స్ తోనే ముగిసిపోతుంటుంది.
ఇంతటి బిజీ షెడ్యూల్ తో అలిసిపోయిన మీకు సెక్స్ అనగానే.. తర్వాత చూడొచ్చులే అనుకుంటారు. కానీ అన్ని పనులకు సమయం కేటాయించుకున్నట్లుగానే సెక్స్ కోసం కూడా టైం కేటాయించుకోవాలి. లేదంటే చాలా సమస్యలు వస్తాయి.
షెడ్యూలింగ్ వల్ల కోరికలు పెరిగే అవకాశం ఎక్కువ!
సెక్స్ షెడ్యూలింగ్ చేసుకోవడం వల్ల.. ముందు నుంచి కోరికలు పెరుగుతుంటాయి. దృష్టి అంతా ఆ రోజు మీదే ఉంటుంది కాబట్టి భాగస్వామిపై ప్రేమ పెరుగుతుంది. దీని వల్ల రోజూ సెక్స్ చేయాలనే భావన రాదు. ఏదో మిస్ అవుతున్నట్లుగా కూడా ఫీలవ్వరు.
సెక్స్ షెడ్యూలింగ్ తేదీ దగ్గరకు వస్తున్న కొద్దీ మీలో ఉత్సాహం పెరుగుతుంది. సాయంత్రం ఇంటికి వచ్చినప్పటి నుంచి భాగస్వామిపైనే మీ దృష్టి అంతా పెడతారు. దీని వల్ల దంపతుల మధ్య బంధం మరింత బలపడుతుంది.
హనీమూన్ అంత ఎగ్జైట్‌మెంట్:
సెక్స్ ని షెడ్యూల్ చేయడం వల్ల పెళ్లయిన తర్వాత హనీమూన్ కోసం మీరు ఎంతగా ఎదురు చూసి ఉంటారో.. ఇది కూడా అలాంటి భావననే కల్గిస్తుంది. ప్రతి రోజూ మీకు మీ భాగస్వామి దగ్గరగా, మీపై ఇష్టంగా ఉన్నట్లు తెలిసేలా చేస్తుంది. ఎలాంటి దంపతుల బంధం అయినా సెక్స్ పైనే ముడి పడి ఉంటుంది. ఇద్దరి మధ్య ప్రేమ బంధం బలపడేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకోసం మీరు సమయం కేటాయించుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి సెక్స్ షెడ్యూలింగ్ ను ఫిక్స్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications