Latest Updates
-
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.! -
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట!
కండోమ్ లేకుండానే శృంగారం ఆస్వాదించాలా?..ప్రెగ్నెన్సీ రాకూడదంటే ఈ భంగిమల్లో..
ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. చిటపటమని కురిసే వర్షం, చల్లగా వీచే గాలి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు ప్రియమైనవారితో ఏకాంతంగా గడపాలన్న కోరిక కలగడం సహజంగానే వస్తుంది. ఒకే దుప్పటి కింద వెచ్చని కౌగిలిలో బంధీ అవ్వాలని, భాగస్వామితో ప్రేమను పంచుకోవాలని మనసు తహతహలాడిపోతుంది. అయితే ఈ మధురమైన క్షణాల్లో ఆనందంతో పాటు ఓ చిన్న ఆందోళన కూడా మొదలవుతుంది..అదే అనుకోని గర్భం.
కండోమ్ లు వాడితే గర్భం రాకుండా శృంగారాన్ని ఆస్వాదించవచ్చని తెలిసిన విషయమే అయినప్పటికీ కొందరికీ శృంగార సమయంలో కండోమ్ లు వాడటం అంటే ఒకరకమైన అసౌకర్యం. దీనికి వాళ్లు చెప్పే కారణం ఏంటంటే.. శృంగారంలో సహజత్వానికి, స్పర్శానుభూతికి కండోమ్ అడ్డుగా ఉంటుందని. ఈ కారణంగానే గర్భం రాకుండా ఉండేందుకు రకరకాల ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తుంటారు. అయితే ఈ ఆలోచనలే కొన్నిసార్లు ప్రమాదకరమైన అపోహలకు దారితీస్తాయి.

గర్భధారణ జరగని సురక్షితమైన మార్గాలు
వాస్తవానికి శృంగారంలో గర్భధారణ రిస్క్ లేకుండానే అద్భుతమైన సాన్నిహిత్యాన్ని పొందవచ్చు. ఒకరినొకరు తాకుతూ, చేతులతో, నాలుకతో ప్రేమను వ్యక్తపరుచుకోవడం ద్వారా అపారమైన ఆనందాన్ని పొందవచ్చు. మహిళలు తమ సున్నితమైన భాగాలలో తడి కోసం సిలికాన్ ఆధారిత లూబ్రికెంట్లను ఉపయోగించడం వల్ల అనుభూతి మరింత పెరుగుతుంది. 69 వంటి ఓరల్ శృంగార భంగిమలు కూడా పూర్తిగా సురక్షితం, ఎందుకంటే ఇక్కడ వీర్యం యోనిలోకి ప్రవేశించే ఆస్కారమే ఉండదు. ఇవి సాన్నిహిత్యాన్ని పెంచుతాయే తప్ప, గర్భానికి దారితీయవని కొందరు నిపుణులు చెబుతున్నారు.
ప్రమాదకరమైన అపోహలు,వాస్తవాలు
అయితే కొన్ని భంగిమల విషయంలో చాలామందిలో తీవ్రమైన అపోహలు ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ చూడండి.
కౌగర్ల్ లేదా నిలబడి చేసే భంగిమ
ఈ భంగిమలలో గురుత్వాకర్షణ శక్తి కారణంగా వీర్యం యోనిలోకి సరిగ్గా చేరదని, తద్వారా గర్భం వచ్చే అవకాశాలు తక్కువని చాలామంది నమ్ముతారు. అయితే ఇది పూర్తిగా అవాస్తవం, అత్యంత ప్రమాదకరమైన నమ్మకం. వీర్యకణాలు చాలా శక్తివంతమైనవి.. అవి గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా కూడా వేగంగా ప్రయాణించగలవు. యోనిలో ఎక్కడ స్ఖలనం జరిగినా, ఒక్క వీర్యకణం గర్భాశయంలోకి చేరినా గర్భం వచ్చేస్తుంది.. భంగిమలు దీనిని ఆపలేవు.
భద్రతే అసలైన ఆనందం
ఏ భంగిమా గర్భనిరోధక సాధనం కాదు. ఈ అపోహలను నమ్మి అనవసరమైన రిస్క్ తీసుకోవడం అంటే మీ భవిష్యత్తుతో ఆడుకోవడమే. అవాంఛిత గర్భాన్ని నివారించడానికి శాస్త్రీయంగా నిరూపితమైన మార్గాలు కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలు వంటివే. కండోమ్ లు గర్భాన్ని నివారించడంతో పాటు లైంగికంగా సంక్రమించే వ్యాధుల నుండి కూడా రక్షణ కల్పిస్తాయి. నిజమైన శృంగారం అంటే ఆందోళన లేకుండా ఆనందాన్ని పంచుకోవడం. భద్రత పాటించడం మీ ఆనందాన్ని తగ్గించదు, పైగా రెట్టింపు చేస్తుంది. ఏవైనా సందేహాలున్నా, సమస్యలున్నా డాక్టర్ ని లేదా సంబంధిత నిపుణులను సంప్రదించడానికి అస్సలు వెనుకాడవద్దు.



Click it and Unblock the Notifications