Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
మీ లవర్ మిమ్మల్ని ఇలా హగ్ చేసుకుంటే..అది డూప్లికేట్ ప్రేమనే!
ప్రస్తుతం ప్రేమలు అన్నీ గంటల్లో కూడా ముగుస్తున్నాయి. కొన్ని రోజుల వరకు, మరికొన్ని నెలలు,ఇంకొన్ని కొన్ని సంవత్సరలు మాత్రమే కొనసాగుతున్నాయి. ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం ఆ ప్రేమించిన వ్యక్తితో కలిసి గడపగలరన్న నమ్మకం లేకుండా పోతుంది. నూటికో కోటికో ఒక్కరు ప్రేమించి పెళ్లి చేసుకొని జీవితాంతం కష్ట సుఖాల్లో తోడుగా ఉండగల్గుతున్నారు. మిగతావన్నీ టైం పాస్ ప్రేమలే. అయితే ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నా అని చెబితే వారిది నిజమైన ప్రేమనో కాదో చిన్న ట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రేమికుల మధ్య గొడవలు, అలకలు సర్వసాధారణం. మాటలు ముగిసి, మౌనం ఆవరించినప్పుడు ఒకే ఒక్క వెచ్చని కౌగిలింత చాలు, గొడవలన్నీ గాలికి కొట్టుకుపోయి, కోపమంతా మంచులా కరిగిపోతుంది. అయితే ఆ కౌగిలింత కేవలం కోపాన్ని తగ్గించే మంత్రమేనా? లేక మీ బంధం యొక్క లోతును చెప్పే అద్భుతమైన భాషేనా? నిపుణుల అభిప్రాయం ప్రకారం మీ భాగస్వామి మిమ్మల్ని కౌగిలించుకునే విధానంలోనే మీ సంబంధానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు దాగివున్నాయి. మీ లవర్ మిమ్మల్ని కౌగలించుకునే లేదా హగ్ చేసుకునే విధానాన్ని బట్టి వారికి మీ మీద ఎలాంటి లవ్ ఉందో చెప్పవచ్చని నిపుణులు చెబుతున్నారు. వారిది ఎంత లోతైన లవ్ తెలుసుకోవాలంటే వారు మిమ్మల్ని ఎలా హగ్ చేసుకుంటున్నారనేది గుర్తించాలి.

పక్కనుంచి వచ్చే స్నేహపూర్వక కౌగిలి
మీ లవర్ మీ భుజంపై చేయి వేసి పక్కనుంచి మిమ్మల్ని ప్రేమగా దగ్గరకు తీసుకుంటారా? ఇందులో ప్రేమేముంది? కేవలం స్నేహం మాత్రమేనా? అని నిరాశపడకండి. ఇది బలమైన స్నేహానికి, నమ్మకానికి ప్రతీక. మీ బంధంలో దాపరికాలు లేవని..ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారని ఇది సూచిస్తుంది. ఇది అపార్థాలకు తావులేని ఆరోగ్యకరమైన బంధానికి పునాది.
ఛాతీకి హత్తుకునే రక్షణ కవచం
మిమ్మల్ని గట్టిగా తమ ఛాతీకి హత్తుకుని ప్రపంచం నుంచి మిమ్మల్ని కాపాడుతున్నట్లుగా భద్రతనిస్తారా? ఇది కేవలం శారీరక ఆకర్షణ కాదు అంతకుమించిన భద్రతా భావం, శ్రద్ధ. మీ సంతోషం, మీ బాధ అన్నీ తమవేనని చెప్పకనే చెప్పే ప్రేమపూర్వకమైన కౌగిలి ఇది. ఇలాంటి భాగస్వామి దొరకడం నిజంగా అదృష్టం.
వెనుక నుంచి వచ్చే వెన్నంటి ఉండే ధైర్యం
మీరు ఏదైనా పనిలో నిమగ్నమై ఉండగా అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చి మిమ్మల్ని వాటేసుకుంటారా? ఇది నేను నీకు అండగా ఉన్నాను అని చెప్పే ఒక బలమైన సందేశం. జీవితంలోని ఎలాంటి కష్టనష్టాల్లోనైనా మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టనని, మీకు రక్షణగా నిలుస్తానని ఇచ్చే భరోసా ఈ కౌగిలి.

కళ్లలోకి చూస్తూ.. ఆత్మల సంభాషణ
మిమ్మల్ని బలంగా హత్తుకుని, మీ కళ్లలోకి సూటిగా చూస్తూ ప్రేమను వ్యక్తపరుస్తారా? ఇక సందేహమే వద్దు..మీకు దొరికినది ఆదర్శవంతమైన భాగస్వామి. మీ మంచి, చెడులతో సహా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అంగీకరించారని దీని అర్థం. ఇది లోతైన, నిజాయితీ గల ప్రేమకు చిహ్నం.
అభద్రతకు అద్దం పట్టే కౌగిలి
మీ భాగస్వామి కౌగిలించుకోబోతున్నారని తెలిసినప్పుడు మీకు భయంగా, ఇబ్బందిగా అనిపిస్తుందా? ఆ కౌగిలిలో ప్రేమ కన్నా ఏదో తెలియని బిగువు, ఆందోళన కనిపిస్తోందా? ఇలాంటి కౌగిలింతలు అభద్రతా భావానికి సంకేతం. బంధం ఎక్కడ ముగిసిపోతుందోనన్న భయం ఇద్దరిలోనూ ఉండొచ్చు. ఇలాంటి సమయంలో వెంటనే విడిపోవాలని కాకుండా, మీ బంధం గురించి పునరాలోచించుకోవాల్సిన సమయం ఇది.



Click it and Unblock the Notifications