Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
కొత్త రిలేషన్ షిప్ ట్రెండ్ 'ఫబ్బింగ్'..లవర్స్ పై తీవ్ర ప్రభావం!
మీరు మీ ప్రియమైన వారితో ఏకాంతంగా గడుపుతున్నప్పుడు, వారి చూపులు మీపై కాకుండా చేతిలో ఉన్న ఫోన్‌పైనే నిలిచిపోతున్నాయా? మీరు చెప్పేది వింటున్నట్లు తల ఊపుతూ, వారి వేళ్లు మాత్రం స్క్రీన్ పై నాట్యం చేస్తున్నాయా? అయితే మీరు ఫబ్బింగ్ అనే ఆధునిక డిజిటల్ హింసకు గురవుతున్నట్లే. ఈ పేరు కొత్తగా అనిపించినా, ఈ అనుభవం నేటి డిజిటల్ యుగంలో చాలామందికి సుపరిచితమే. ఘోస్టింగ్, బ్రెడ్‌క్రంబింగ్, లవ్ బాంబింగ్ వంటి పదాల సరసన ఇప్పుడు ఫబ్బింగ్ కూడా చేరిపోయింది.
అసలేంటి ఈ ఫబ్బింగ్?
ఫబ్బింగ్ అంటే..ఇద్దరి మధ్య అనుబంధంలో ఒక వ్యక్తి తన భాగస్వామిని కాదని, ఫోన్‌కే అధిక ప్రాధాన్యత ఇవ్వడం. స్మార్ట్ ఫోన్ మన జీవితాల్లోకి ఎంతలా చొచ్చుకుపోయిందంటే అది ఇప్పుడు ప్రేమ బంధంలోకి చొరబడిన మూడో వ్యక్తిగా మారిపోయింది. ఈ మూడో వ్యక్తి మనిషి కాదు ఒక మెషీన్. మీ భాగస్వామి మీతో గడిపే సమయం కన్నా, సోషల్ మీడియా నోటిఫికేషన్లకే ఎక్కువ విలువిస్తున్నారంటే ఆ సంబంధాన్ని ఫబ్బింగ్ విషపూరితం చేస్తున్నట్లే. ఈ ధోరణి నగరాలకే పరిమితం కాలేదు, ఇంటర్నెట్ ఉన్న ప్రతిచోటా ఈ సమస్య విస్తరిస్తోంది.

ప్రేమపై ఫబ్బింగ్ ప్రభావం ఎంత తీవ్రమైనది?
మొదట్లో ఇది చిన్న విషయంగా, సర్దుకుపోగల అలవాటుగా అనిపించవచ్చు. కానీ ఇది నెమ్మదిగా బంధాన్ని కాల్చేసే నిప్పురవ్వ లాంటిదిగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రేమ బంధం అంటే కేవలం కలిసి ఉండటం కాదు. ఒకరి భావాలను ఒకరు పంచుకోవడం, కష్టసుఖాల్లో తోడుగా నిలవడం. ఫబ్బింగ్ మనల్ని మన భాగస్వామి పక్కనే ఉన్నా, ఒంటరి ద్వీపాల్లా మార్చేస్తుంది. శారీరకంగా దగ్గరగా ఉన్నా, మానసికంగా మైళ్ల దూరంలో ఉంటాం.
భాగస్వామి నుంచి నిరంతర నిర్లక్ష్యం ఎదురైనప్పుడు అవతలి వ్యక్తిలో అభద్రతాభావం, నిరాశ పెరుగుతాయి. నాకు విలువ లేదా? అనే ఆత్మన్యూనతా భావం మొదలవుతుంది. ఈ నిర్లక్ష్యం ఒంటరితనాన్ని పెంచి, క్రమంగా బంధంలో అగాధాన్ని సృష్టిస్తుంది. ఆ అగాధం పెరిగి పెరిగి, చివరికి విడిపోయేంత దూరం తీసుకెళ్తుంది. మెషీన్ కోసం మనిషిని దూరం పెట్టే ఈ అలవాటు, సంబంధాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది.
పరిష్కారం ఏమిటి?
మీ బంధంలో ఈ ఫబ్బింగ్ విషపు పొగలు కమ్ముకుంటున్నాయని అనిపిస్తే, ఆలస్యం చేయకండి. సమస్యను గుర్తించి, మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి. ఫోన్ ను పక్కనపెట్టి, ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుని మాట్లాడుకునే కొద్ది నిమిషాలు కూడా మీ బంధాన్ని బలోపేతం చేస్తాయి. టెక్నాలజీ మనల్ని కలపడానికే కానీ, మన మధ్య గోడలు కట్టడానికి కాదు.



Click it and Unblock the Notifications