Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ ఆయన పక్కనే ఉన్నా మిమ్మల్ని పట్టించుకోకుండా ఫోన్ చూసుకుంటున్నాడా?
ఈ రోజుల్లో చాలా ఇళ్లలో వినిపించే ఒకే ఒక్క కంప్లెయింట్ ఏంటంటే.. మా ఆయన ఇంట్లోనే ఉంటారు, కానీ నాతో ఉండరు.. ఆయన ప్రపంచమంతా ఆ ఫోన్‌లోనే ఉంటుంది. భార్యలు ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నా చాలామంది భర్తల చూపు మాత్రం ఫోన్ స్క్రీన్ పైనే నిలిచిపోతుంది. ఇలాంటి సమయంలో ఏ భార్యకైనా మనసు చివుక్కుమంటుంది.
నన్ను పట్టించుకోవడం లేదా? నాకంటే ఆ ఫోన్ ఎక్కువైపోయిందా? బహుశా వేరే అమ్మాయితో మా ఆయన ఎఫైర్ పెట్టుకున్నాడేమో? లాంటి అనుమానాలు రావడం సహజమే. కానీ మీ భర్త ఫోన్‌లో మునిగిపోవడానికి కారణం ప్రతిసారీ వివాహేతర సంబంధం మాత్రమే కాకపోవచ్చు. అనేక ఇతర కారణాలు కూడా దీని వెనుక ఉండవచ్చు. అవేంటో ఇక్కడ చూడండి.

ఆఫీసు ఇప్పుడు జేబులోనే
ఒకప్పుడు ఆఫీసు పని గంటలు ముగిశాక ఇంటికి వస్తే పూర్తి విశ్రాంతి దొరికేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ మీటింగ్‌లు, అర్ధరాత్రి వచ్చే ఈమెయిల్స్ ఇలా ఆఫీసు మొత్తం ఫోన్ లోకి వచ్చేసింది. మీ భర్త ఫోన్ చూస్తున్నారంటే అది క్లయింట్‌తో చాటింగ్ కావచ్చు లేదా మరుసటి రోజు వర్క్ కి స్ంబంధించిన ఫ్లాన్ కూడా కావచ్చు. పని బాధ్యతలు వారిని అలా ఫోన్ కు కట్టిపడేసి ఉండవచ్చు.
ఒత్తిడి నుంచి చిన్న విరామం కోసం
రోజంతా వర్క్, బాధ్యతలు, ప్రయాణాలతో అలసిపోయిన మనసుకు కాస్త ఉపశమనం కావాలని అనిపిస్తుంది. కొంతమందికి ఆ ఉపశమనం ఫోన్ లోనే దొరుకుతుంది. ఫన్నీ వీడియోలు చూడటం, ఆన్ లైన్ గేమ్స్ ఆడటం, ఫ్రెండ్స్ తో సరదాగా చాట్ చేయడం ద్వారా వారు తమ ఒత్తిడిని మర్చిపోవడానికి ప్రయత్నిస్తుండవచ్చు.
సోషల్ మీడియా అనే మాయా ప్రపంచం
ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్.. ఇవి కేవలం యాప్స్ కావు..దేశంలో చాలామందికి ఇదొక వ్యసనంలా మారిపోయింది. ఒక్కసారి స్క్రోలింగ్ మొదలుపెడితే సమయమే తెలియదు. ఎటువంటి చెడు ఉద్దేశం లేకపోయినా ఈ సోషల్ మీడియా అలవాటు వల్ల కూడా మీ భర్త గంటల తరబడి ఫోన్ తోనే గడిపే అవకాశం ఉంది.
స్నేహితులతో బంధం
పెళ్లి తర్వాత బాధ్యతలు పెరిగినా, పాత స్నేహితులను ఎవరూ వదులుకోలేరు. స్కూల్ ఫ్రెండ్స్, కాలేజీ ఫ్రెండ్స్ తో వాట్సాప్ గ్రూపులలో కబుర్లు చెప్పుకోవడం, వారితో టచ్ లో ఉండటం కూడా వారిని ఫోన్ లో బిజీగా ఉంచవచ్చు.
సంబంధాన్ని కాపాడుకోవడానికి మీరేం చేయాలి?
-ఎప్పుడూ ఫోనేనా? అని కోపంగా అడగకుండా మనం కాసేపు మాట్లాడుకుందామా? మీతో సమయం గడపాలని ఉంది అని ప్రేమగా చెప్పండి.
వారి పని ఒత్తిడిని, వారి అవసరాలను తెలుసుకోండి. దీనివల్ల మీకు స్పష్టత వస్తుంది.
-భోజనం చేసేటప్పుడు, నిద్రపోయే ముందు గంటసేపు ఇద్దరూ ఫోన్లు పక్కన పెట్టేయాలని ఒక నియమం పెట్టుకోండి. ఆ సమయంలో ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోండి.
-ఇద్దరూ కలిసి సినిమా చూడటం, వాకింగ్ కు వెళ్లడం వంటివి చేయడం వల్ల ఫోన్ పై ధ్యాస మళ్లుతుంది.



Click it and Unblock the Notifications