Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
శృంగారంలో పాల్గొనే ముందు ఇది చేయకుంటే..రోగాలు గ్యారెంటీ!
ఒక అందమైన బంధానికి పునాది లేదా మూలస్తంభాలుగా మూడింటిని చెబుతారు..అవే ప్రేమ, నమ్మకం,ఒకరికొకరు ఇచ్చే ఎమోషనల్ సపోర్ట్ . ఈ పునాదులు ఎంత గట్టిగా ఉంటే ఆ బంధం అంతకాలం బలంగా నిలుస్తుందని రిలేషన్ షిప్ నిపుణులు చెబుతుంటారు. అయితే ఈ భావోద్వేగ బంధాన్ని మరింత దృఢపరిచేదే శారీరక సాన్నిహిత్యం. లైంగిక సాన్నిహిత్యం అనేది ఇద్దరి మధ్య మానసిక బంధాన్ని కూడా బలపరుస్తుంది. అయితే ఈ సాన్నిహిత్యం ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా డిస్టర్బ్ చేయకుండా ఉండాలి.
అసురక్షిత శారీరక సంబంధం సిఫిలిస్, హెచ్‌ఐవి (HIV), క్లామిడియా, గోనేరియా వంటి ఎన్నో లైంగికంగా సంక్రమించే వ్యాధుల (STDs)కు దారితీయవచ్చు. అందుకే మీ శారీరక, మానసిక, లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ మధురమైన అనుభూతిని పొందడానికి కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకోవాలి. అవేంటో ఇక్కడ చూడండి.

సురక్షితమైన సంభోగం
టెన్షన్ లేని శృంగారానికి కండోమ్ మొదటి మెట్టు. ఇది అవాంఛిత గర్భధారణను నివారించడమే కాకుండా ఎన్నో ప్రమాదకరమైన లైంగిక వ్యాధుల నుండి మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. ముఖ్యంగా అవివాహిత జంటలు తమ బంధాన్ని సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కండోమ్ వాడటం ఒక బాధ్యత. ఇది మీ లైంగిక ఆరోగ్యాన్ని కాపాడటానికి సులభమైన, అత్యంత ప్రభావవంతమైన మార్గం.
నిజాయితీతో కూడిన సంభాషణ
మీ ఆరోగ్య పరిస్థితులు, మీ ఇష్టాయిష్టాలు, మీ సరిహద్దుల గురించి మీ భాగస్వామితో బహిరంగంగా చర్చించండి. ఒకవేళ మీకు ఏదైనా లైంగిక వ్యాధి ఉన్నా లేదా ట్రీట్మెంట్ తీసుకుంటున్నా దాని గురించి నిజాయితీగా పంచుకోవడం ఇద్దరి ఆరోగ్యానికి క్షేమకరం. ఈ పారదర్శకతే మీ మధ్య నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది.
క్రమం తప్పని పరీక్షలు
లైంగికంగా చురుగ్గా ఉండే జంటలు ముఖ్యంగా పెళ్లికాని వారు ఎలాంటి లక్షణాలు లేకున్నా క్రమం తప్పకుండా లైంగిక సంక్రమణ వ్యాధుల కోసం పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. కొన్ని వ్యాధులు ప్రారంభంలో ఎలాంటి లక్షణాలను చూపించవు కానీ లోపల తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. హెచ్ ఐవి, హెపటైటిస్ బి, సి, సిఫిలిస్ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా మిమ్మల్ని, మీ భాగస్వామిని సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఇది మీపై, మీ భాగస్వామిపై మీకు ఉన్న బాధ్యతకు నిదర్శనం.
వ్యక్తిగత శుభ్రత
సంభోగానికి ముందు, తర్వాత మీ చేతులను, జననేంద్రియ ప్రాంతాన్ని శుభ్రపరచుకోవడం తప్పనిసరి. శుభ్రమైన పడక వస్తువులను వాడటం వల్ల ఇన్‌ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ముఖ్యంగా మహిళలు సంభోగం తర్వాత మూత్ర విసర్జన చేయడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (UTI) బారి నుండి తమను తాము కాపాడుకోవచ్చు. గోరువెచ్చని నీటితో ప్రైవేట్ భాగాలను శుభ్రం చేసుకోవడం ఉత్తమ పద్ధతి.
భావోద్వేగ అనుబంధం
లైంగిక సాన్నిహిత్యం అనేది కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు అది రెండు మనసుల ఏకత్వం. ప్రేమ, గౌరవం, పరస్పర అవగాహన లేని బంధంలో శారీరక కలయిక కేవలం తాత్కాలిక సంతృప్తిని మాత్రమే ఇస్తుంది. కానీ ఒకరినొకరు భావోద్వేగంగా అర్థం చేసుకున్నప్పుడు ఆ సాన్నిహిత్యం మరింత మధురంగా, సంతృప్తికరంగా మారి మీ బంధాన్ని కలకాలం పదిలంగా ఉంచుతుంది.



Click it and Unblock the Notifications