Latest Updates
-
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే..
దూరంగా ఉన్న లవర్ తో ఫోన్..సంభాషణ ఇంట్రెస్టింగ్ గా ఉండాలంటే ఇలా చేయండి!
ఎవరైనా ప్రేమలో ఉంటే ఇక వారి ప్రపంచమంతా లవర్ చుట్టూనే తిరుగుతుంది. ఎప్పుడెప్పుడు మాట్లాడదామా, మనసులోని ప్రతి మాటను పంచుకుందామా అని ఆరాటపడతారు. ముఖ్యంగా దూరంగా ఉండే ప్రేమికులైతే ఫోన్ కాల్ మాత్రమే వారికి ఏకైక ఆప్షన్. రోజంతా జరిగిన విశేషాలు, సరదా సంఘటనలు, చిలిపి కోపాలు అన్నీ పంచుకునేది ఆ సంభాషణలోనే. అయితే కొన్నిసార్లు ఆ ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లుగా, మీరు ఎంతో ఆసక్తిగా మాట్లాడుతుంటే అటువైపు నుంచి కేవలం 'హ్మ్', 'అవునా', 'ఓ' వంటి నిర్లిప్త సమాధానాలు వస్తుంటాయి. ఇలా ఒకటి రెండుసార్లు జరిగితే పర్వాలేదు కానీ ఇదే అలవాటుగా మారితే? మనసులో ఎన్నో అనుమానాలు మొదలవుతాయి. నాపై ఆసక్తి తగ్గిందా? నాతో మాట్లాడటం బోర్ కొడుతోందా? మా బంధం బలహీనపడుతోందా? వంటి ప్రశ్నలు మనసుని తొలిచేస్తాయి.
వాస్తవానికి ఇలాంటి ఏకపద సమాధానాలకు కారణం మీపై ప్రేమ లేకపోవడం కాదు. ఆఫీసులో పని ఒత్తిడి, మానసిక అలసట లేదా ఏదైనా విషయం గురించి ఆందోళన చెందడం వంటివి కూడా వారిని మౌనంగా మార్చేయవచ్చు. కాబట్టి కంగారు పడి బంధాన్ని అపార్థం చేసుకోకండి. కొన్ని చిన్న మార్పులతో మీ సంభాషణలో పోయిన ఉత్సాహాన్ని, వెచ్చదనాన్ని తిరిగి తీసుకురావచ్చు.

భాగస్వామితో మనస్ఫూర్తిగా మాట్లాడించే మ్యాజికల్ టిప్స్
ప్రశ్నలు కాదు, కథలు చెప్పండి
ఫోన్ కాల్ లో మీ లవర్ తో సంభాషణను ప్రశ్న-జవాబుల సెషన్ లా మార్చకండి. ఈరోజు ఏం చేశావ్? అని అడిగే బదులు..ఈరోజు ఆఫీసులో ఒక ఫన్నీ సంఘటన జరిగింది, వింటావా? అంటూ మీ రోజులోని ఒక చిన్న కథను ఆసక్తికరంగా చెప్పండి. కథలు వినడానికి అందరూ ఇష్టపడతారు. ఇది మీ భాగస్వామిని ఒత్తిడికి గురి చేయకుండా సంభాషణలో సహజంగా లీనమయ్యేలా చేస్తుంది.
జ్ఞాపకాల పల్లకిలో విహరించండి
సంభాషణ కాస్త చప్పగా సాగుతున్నప్పుడు పాత జ్ఞాపకాలను తట్టిలేపండి. గుర్తుందా, మనం మొదటిసారి కలిసినప్పుడు నువ్వెంత సిగ్గుపడ్డావో? లేదా మన మొదటి గొడవ తర్వాత నువ్వు నన్ను ఎలా బ్రతిమిలాడావో తెలుసా? అంటూ మధురమైన క్షణాలను గుర్తుచేయండి. ఈ జ్ఞాపకాలు మీ ఇద్దరి మధ్య ఉన్న భావోద్వేగ బంధాన్ని తట్టిలేపి వారిని కూడా ఆ రోజుల్లోకి తీసుకెళ్లి మాట్లాడేలా చేస్తాయి.
వారికి కాస్త సమయం ఇవ్వండి
మీ భాగస్వామి మౌనంగా ఉన్నప్పుడు ఏమైంది? ఎందుకు మాట్లాడవు? అంటూ వారిపై ఒత్తిడి తీసుకురావొద్దు. బహుశా వారు రోజంతా పనిచేసి అలసిపోయి ఉండవచ్చు లేదా వారి మూడ్ బాగోలేకపోవచ్చు. అలాంటి సమయంలో వారికి కాస్త సమయం ఇచ్చి పర్లేదులే, కాసేపు ప్రశాంతంగా ఉండు అని చెప్పండి. మీ అవగాహన, ప్రేమ వారికి సాంత్వననిచ్చి కాసేపటి తర్వాత వారే మీతో మనసు విప్పి మాట్లాడతారు.
సరదా ఆటలతో నవ్వులు
సంభాషణకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడానికి కొన్ని సరదా ఆటలు ఆడండి. రాపిడ్ ఫైర్, ట్రూత్ ఆర్ లై వంటి చిన్న చిన్న ఆటలు మూడ్ ను తేలికపరుస్తాయి. ఆటలో భాగంగా వారు తప్పకుండా మాట్లాడతారు. ఈ నవ్వుల మధ్యలో మీ సంభాషణ మళ్లీ ఊపందుకుంటుంది.
వీడియో కాల్
కొన్నిసార్లు వంద మాటలు చెప్పలేని భావాన్ని ఒక్క చూపు చెబుతుంది. మీ భాగస్వామి అంతర్ముఖులైతే వారికి ఏం మాట్లాడాలో తెలియకపోవచ్చు. అలాంటప్పుడు ఆడియో కాల్ కు బదులుగా వీడియో కాల్ ప్రయత్నించండి. ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడినప్పుడు ముఖ కవళికలు, చిరునవ్వులు, సైగలు సంభాషణకు కొత్త అందాన్నిస్తాయి. ఇది మాటల అవసరం లేకుండానే మీ బంధాన్ని బలంగా ఉంచుతుంది.



Click it and Unblock the Notifications
