Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
పెళ్లికి ముందున్న హీట్ పెళ్లి తర్వాత తగ్గిపోతుందా? సైకాలాజికల్ డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజాలు
పెళ్లి అనేది ఎవరి జీవితంలో అయినా చాలా ముఖ్యమైన ఘట్టం. అయితే పెళ్లికి ముందు లేదా పెళ్లయిన కొత్తలో భాగస్వామి మీద ఉన్న శారీరక ఆకర్షణ క్రమంగా తగ్గుతూ ఉండటం చాలా జంటల్లో గమనించవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ రోజుల్లో జస్ట్ హనీమూన్ పీరియడ్ ముగిస్తే చాలు మొగుడి మీద పెళ్లాంకి,పెళ్లాం మీద మొగుడికి శారీరకంగా విరక్తి వచ్చేస్తుంది చాలామంది జంటల్లో. అయితే కుటుంబ పరువు కోసం, సమాజం కోసం మాత్రమే వీళ్లు కలిసే ఉంటారు. పెళ్లి తర్వాత జంటల మధ్య ప్రేమ, ఉత్సాహం రెండూ క్రమంగా తగ్గడానికి గల ముఖ్య కారణాలను మ్యారేజ్ కోచ్, సైకలాజికల్ కౌన్సెలర్ డాక్టర్ సప్నా శర్మ తన ఇన్ స్టాగ్రామ్ వీడియో ద్వారా తెలిపారు.
ఈ 5 ప్రధాన కారణాలు
గోప్యత
భారతీయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఒక అందమైన అనుబంధం. కానీ అదే సమయంలో నవ దంపతులకు గోప్యత అనేది ఒక పెద్ద సవాలుగా మారుతుంది. ఇంటి పెద్దల సమక్షంలో ఒకరినొకరు ప్రేమగా తాకడం, పగటిపూట గది తలుపు వేసుకోవడం కూడా అనాగరికమనే భావన ఉంటుంది. అందరూ నిద్రపోయాక మాత్రమే దొరికే ఏకాంతం, మనసు విప్పి మాట్లాడుకోవడానికి, ప్రేమను పంచుకోవడానికి సరిపోతుందా? ఇలా కలిసి ఉన్నా, దగ్గర కాలేకపోతున్నామనే బాధ చాలామందిలో ఉంటది. ఆ నాలుగు గోడల మధ్య కూడా దొరకని స్వేచ్ఛ, వారి మధ్య అదృశ్యమైన గోడను నిర్మిస్తుంది. అందుకే చాలామంది జంటలు ఈ రోజుల్లో పెళ్లి తర్వాత వేరు కాపురం పెట్టడానికి ఇష్టపడుతున్నారు.

రొమాంటిక్ డేటింగ్
పెళ్లికి ముందు రొమాంటిక్ డేటింగ్ చాలామందికి ఇష్టంగా ఉంటది. కానీ వివాహం తర్వాత పెద్ద నగరాల్లో, చిన్న కుటుంబాల్లో కొంతవరకు ఈ వెసులుబాటు ఉన్నా ఉమ్మడి కుటుంబాల్లో దంపతులు విడిగా బయటకు వెళ్లడం, ఏకాంతంగా సమయం గడపడం కష్టసాధ్యం. ఏ కార్యక్రమానికైనా కుటుంబ సమేతంగా వెళ్లాల్సిందే. స్నేహితులు, పిల్లలతో కలిసి చేసే ప్రయాణాల్లో, రద్దీ ప్రదేశాల్లో వీరికి ప్రత్యేకమైన సమయం దొరకదు. సెలవుల్లో కూడా ఇదే పరిస్థితి. దీంతో పెళ్లి నాటి ప్రేమ ప్రయాణం కాస్తా... సామూహిక యాత్రగా మారి, వ్యక్తిగత అనురాగానికి చోటు లేకుండా పోతుంది.
ఇంట్లో దుస్తులు
పెళ్లయిన కొత్తలో లేదా పెళ్లికి ముందు భాగస్వామిని కలవడానికి లేదా వారి ముందు అందంగా కనబడేందుకు మంచిగా రెడీ అయ్యేవాళ్లు. రంగురంగుల దుస్తులు, చక్కని కేశాలంకరణ, ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలు... అన్నీ వారిని ఆకట్టుకోవడానికే. కానీ పెళ్లయ్యాక ఆ శ్రద్ధంతా ఇతరుల కోసమే అన్నట్టుగా మారిపోతుంది. ఇంట్లో, జీవిత భాగస్వామి ముందు మాత్రం పాతబడిన, మాసిపోయిన, పారేయడానికి సిద్ధంగా ఉన్న దుస్తుల్లో దర్శనమిస్తారు. ఎలా ఉన్నా నావాళ్లే కదా అనే నిర్లక్ష్యం మీ మధ్య ఉన్న ఆకర్షణను నెమ్మదిగా చంపేస్తుందని గ్రహించడం ముఖ్యం అని సప్నా శర్మ తెలిపారు.
శారీరక సౌందర్యం పెళ్లి వరకేనా
పెళ్లి సమయంలో చూడముచ్చటగా కనిపించాలని అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఎంత తపన పడతారు. ఫిట్ గా ఉండటానికి నానా తంటాలు పడతారు. కానీ ఒక్కసారి పెళ్లి పీటలెక్కితే చాలు... ఆ శ్రద్ధ గాలికి కొట్టుకుపోతుంది. కూర్చుని చేసే పనులు, అడ్డూ అదుపూ లేని తిండి, నిద్ర. ఫలితంగా 30 ఏళ్లు దాటగానే చాలామందిలో బరువు పెరగడం, శరీర సౌష్టవం దెబ్బతినడం చూస్తూనే ఉంటాం. ఇక్కడ బరువు తగ్గడం, ఆకారం గురించి మాత్రమే కాదు శరీరాన్ని చురుకుగా, శక్తివంతంగా ఉంచుకోవడం ముఖ్యం. పెళ్లికి ముందు భాగస్వామిని ఆకర్షించిన ఆ శారీరక ఆకర్షణ, పెళ్లయ్యాక మీ పట్టించుకోని తనం వల్ల మాయమైపోతే మీ మధ్య దూరం పెరగక తప్పదు.
ఇది అవసరం
శారీరక సాన్నిహిత్యానికి, ఆకర్షణకు కొంత రహస్యం, కొత్తదనం అవసరం. మీ ప్రత్యేకమైన వ్యక్తిత్వమే మీ బంధానికి ఊపిరి. కానీ చాలా కుటుంబాల్లో ఎవరైనా తమ ప్రత్యేకతను నిలబెట్టుకోవాలనుకుంటే, దాన్ని తప్పుగా చూస్తారు. భాగస్వామిని సంతోషపెట్టాలనే తపనలోనో వారిని అదుపులో ఉంచుకోవాలనే ప్రయత్నంలోనో నెమ్మదిగా ఇద్దరూ తమతమ వ్యక్తిత్వాలను కోల్పోతారు. ఒకరికొకరు పూర్తిగా తెలిసిపోయామనే భావన, ఆపై ఆసక్తీ తగ్గిపోతుంది. మీ వ్యక్తిత్వం మీ భాగస్వామికి ఒక నిత్య నూతన ఆవిష్కరణలా ఉండాలి, అప్పుడే బంధంలో మాధుర్యం చిరకాలం నిలిచి ఉంటుంది.



Click it and Unblock the Notifications











