Latest Updates
-
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి!
మీ భాగస్వామి సీక్రెట్ గా మీ ఫోన్ పై నిఘా పెట్టారా? ఇలా తెలుసుకోండి
ఈ రోజుల్లో సంబంధాల్లో అనుమానం కూడా పెరుగుతోంది. దీంతో కొందరు తన భాగస్వామి ఫోన్ ను తరచూ చెక్ చేయడం లేదా వారి ఫోన్ ను హ్యాక్ చేసి వారి రహస్యాలను తెలుసుకోడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే మీ భాగస్వామి మీ ఫోన్‌తో మీపై గూఢచర్యం చేస్తున్నారా? ఈ అనుమానం చాలా మందిని వేధిస్తుంటుంది. ప్రముఖ డిజిటల్ నిపుణుడు, QR కోడ్ జనరేటర్ సీఈఓ మార్క్ పోర్కార్ ది సన్ కి తెలిపిన ప్రకారం.. మీ ఫోన్‌లో కొన్ని అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే అది మీ భాగస్వామి మిమ్మల్ని రహస్యంగా ట్రాక్ చేస్తున్నారనడానికి సంకేతం కావచ్చని హెచ్చరిస్తున్నారు. మెసేజ్ లు, కాల్స్, చివరికి మీరు ఎక్కడున్నారో కూడా ఈ నిఘా సాఫ్ట్‌వేర్ పట్టేస్తుందట.
లేటెస్ట్ స్పైవేర్.. మన కంటికి కనిపించకుండానే మన వ్యక్తిగత డేటాను దొంగిలించి వేరేవాళ్లకు పంపేస్తుందని మార్క్ హెచ్చరిస్తున్నారు. మీ అనుమతి లేకుండా మీ ఫోన్‌లో స్పైవేర్ తిష్ట వేసిందని చెప్పడానికి ఐదు కీలక సంకేతాలను ఆయన సూచించారు. అవేంటో ఇక్కడ చూడండి.

బ్యాటరీ వెంటనే ఖాళీ అవుతోందా?
ఎంతసేపు ఛార్జింగ్ పెట్టినా అది ఆగట్లేదు..బ్యాటరీ వెంటనే ఖాళీ అయితపోతుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? మీ ఫోన్ లో ఏదో స్పై యాప్ దాగి ఉందనడానికి ఇది తొలి సంకేతం కావచ్చు. మార్క్ ప్రకారం.. స్పైవేర్ కంటిన్యూగా బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూనే ఉంటుంది. అందుకే మీ బ్యాటరీని వాడేస్తుంది. ఈ నిఘా యాప్ లు ఎప్పుడూ స్లీప్ మోడ్ లోకి వెళ్లవు. డేటాను రిమోట్ సర్వర్ కు పంపడానికి అవి నిరంతరం యాక్టివ్ కనెక్షన్‌లను కొనసాగించాలి. ఈ రహస్య కార్యకలాపం వల్ల చాలా ఎనర్జీ ఖర్చయి బ్యాటరీలు సాధారణం కంటే వేగంగా ఖాళీ అయిపోతాయని చెబుతున్నారు.
ఫోన్ వేడెక్కుతోందా?
స్పై యాప్ లు ప్రాసెసర్ ను ఎక్కువగా వాడేసినప్పుడు ఫోన్లు అగ్గిలా మారిపోతాయని మార్క్ చెబుతున్నారు. నిఘా సాఫ్ట్‌వేర్ ఉన్న ఫోన్లు వాడకుండా ఉన్నప్పుడు కూడా వేడిగానే ఉంటాయి. స్పైవేర్ ప్రాసెసర్ ను అనవసరంగా ఎక్కువగా పనిచేయించడం వల్లే ఈ వేడి పుడుతుంది. చాలా సందర్భాల్లో మీ ఫోన్‌లో మీకు తెలియకుండానే ఏవో ప్రోగ్రామ్‌లు నడుస్తున్నందువల్లే ఈ వేడి పెరుగుతుందని మార్క్ తెలిపారు.
డేటా వినియోగం ఎక్కువ కూడా
అసాధారణంగా డేటా వాడకం పెరిగిపోయిందా? ఇది కూడా దాగి ఉన్న నిఘాను బయటపెట్టే కీలక ఆధారం అని మార్క్ సూచిస్తున్నారు. మీ ఫోన్ సెట్టింగ్స్ లో మీ డేటా వినియోగ గణాంకాలను ఓసారి చెక్ చేసుకోవాలని ఆయన సలహా ఇస్తున్నారు. నిఘా యాప్ లు తాము సేకరించిన సమాచారాన్ని తమ నిర్వాహకులకు పంపాలి. దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి కాబట్టి మీ డేటా ఖర్చవుతుంది.
ఈ యాప్స్ బ్యాక్ గ్రౌండ్ లోనే డేటాను లాగేస్తాయి. కొన్నిసార్లు ఫోటోలు పంపుతున్నప్పుడు లేదా ఆడియో రికార్డ్ చేస్తున్నప్పుడు భారీగా డేటాను వాడేస్తాయని ఆయన తెలిపారు. చాలా మంది బాధితులు తమ మొబైల్ ప్రొవైడర్ల నుంచి అనుకోకుండా డేటా లిమిట్ హెచ్చరికలు వచ్చినప్పుడే ఈ స్పైవేర్ బాగోతాన్ని కనిపెడతారట.
వింత మెసేజ్‌లు, నోటిఫికేషన్లు
యాదృచ్ఛిక అక్షరాలు, కోడ్ లతో కూడిన టెక్స్ట్ సందేశాలు వస్తున్నాయేమో గమనించాలని మార్క్ హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రాథమిక నిఘా యాప్ లు, ఫోన్ లో ఇన్‌స్టాల్ అయిన స్పైవేర్ ను నియంత్రించడానికి SMS ఆదేశాలను ఉపయోగిస్తాయి. ఆ సాఫ్ట్‌వేర్ యూజర్ నుండి దాక్కోవడానికి ప్రయత్నించినప్పుడు ఇవి కొద్దిసేపు కనిపించి మాయమైపోవచ్చు. వచ్చి మాయమయ్యే మెసేజ్ లను మీరు గమనించినా లేదా మీరు గుర్తించని యాప్ ల నుండి నోటిఫికేషన్లు వస్తున్నా తక్షణమే దీనికి చెక్ పెట్టాలని ఆయన తెలిపారు.
ఖాళీగా ఉన్నా ఫోన్‌లో ఏదో గడబిడ
చివరి హెచ్చరిక సంకేతం.. ఫోన్ వాడకుండా పక్కన పెట్టినప్పుడు కూడా అది వింతగా ప్రవర్తించడం. మీరు మీ స్క్రీన్‌ను వాడనప్పుడు కూడా అది వెలగవచ్చు లేదా కాల్స్ సమయంలో అనుకోని శబ్దాలు వినపడవచ్చని మార్క్ అంటున్నారు. కొన్ని అత్యాధునిక స్పైవేర్ లు మైక్రోఫోన్లు, కెమెరాలతో సహా ఫోన్ ఫంక్షన్ లను రిమోట్‌గా యాక్టివేట్ చేయడానికి అనుమతిస్తాయి. అందుకే ఇలా జరుగుతుంది.
ఈ ఫీచర్లు మీకు తెలియకుండానే ఎవరైనా మీ సంభాషణలను వినడానికి లేదా మీ పరిసరాలను చూడటానికి వీలు కల్పిస్తాయి..ఇది మీ గోప్యతపై తీవ్రమైన దాడి అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కాపాడుకోవడం ఎలా?
అన్ని మొబైల్ డివైజ్ లలో క్రమం తప్పకుండా భద్రతా తనిఖీలు చేయాలని మార్క్ సూచించారు. మీరు గుర్తించని అప్లికేషన్‌లను వెంటనే తొలగించండి. విశ్వసనీయ సాఫ్ట్‌వేర్ తో భద్రతా స్కాన్ లను రన్ చేయండి. అనుమానాస్పద అనుమతులు ఉన్న యాప్ ల కోసం ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలని ఆయన సూచించారు. స్ట్రాంగ్ పాస్‌వర్డ్ పెట్టుకోవడం, నలుగురిలో ఉన్నప్పుడు ఫోన్‌ను భౌతికంగా సురక్షితంగా ఉంచుకోవడం చాలా కీలకమని తెలిపారు. మీరు పూర్తిగా నమ్మని వ్యక్తి దగ్గర మీ ఫోన్‌ను ఎప్పుడూ అన్‌లాక్ చేసి ఉంచకండి.. ఎల్లప్పుడూ స్క్రీన్ లాక్ వాడండని ఆయన హెచ్చరించారు.



Click it and Unblock the Notifications











