Latest Updates
-
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక
ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే.. సైలెంట్‌గా వదులుకోవడం బెటర్
కొందరు వ్యక్తులు స్నేహం రూపంలో విషాన్ని చిమ్ముతుంటారు. వారితో స్నేహం ఎప్పటికీ ప్రమాదమే. ఎప్పుడు అవకాశం దొరుకుతుందో అప్పుడు తమ నిజస్వరూపాన్ని బయటపెడతారు. అలాంటి ఫ్రెండ్స్ వల్ల ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువ.
స్నేహం మధురమైన భావన. ఎలాంటి చుట్టరికం లేని వారిని సొంత వారిని చేసుకోవడమే స్నేహం. ప్రతి వ్యక్తి జీవితంలో స్నేహం అనేది గొప్ప సంపద. నిజమైన స్నేహితులు మన వెంటే ఉంటారు. మనకు అండగా ఉంటారు. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, సంతోషమేసినా, ఆనందమైనా మనతో పాటు అనుభవిస్తారు. కానీ, కొందరు వ్యక్తులు స్నేహం రూపంలో విషాన్ని చిమ్ముతుంటారు. వారితో స్నేహం ఎప్పటికీ ప్రమాదమే. ఎప్పుడు అవకాశం దొరుకుతుందో అప్పుడు తమ నిజస్వరూపాన్ని బయటపెడతారు. అలాంటి ఫ్రెండ్స్ వల్ల ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువ.

మీ స్నేహితుల్లో ఇలాంటి వారు ఎవరైనా ఉంటే వారి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే. వీలైతే వారికి దూరంగా ఉండటం చాలా మంచిది.
అసలు అలాంటి ఫ్రెండ్స్‌ను ఎలా గుర్తించాలి.. ఎలాంటి పనులతో అలాంటి ఫ్రెండ్స్‌ను గుర్తించవచ్చో ఇప్పుడు చూద్దాం.

1. హద్దులను గౌరవించరు
నిజమైన స్నేహితులు హద్దులను అర్థం చేసుకుంటారు. వాటిని గౌరవిస్తారు. మీకు ఇష్టం లేకపోయినా మీ వ్యక్తిగత విషయాల్లో తలదూర్చే వ్యక్తులు ఎప్పటికీ ప్రమాదమే. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మీ సరిహద్దులను అగౌరవపరచడం, దాటడం వంటి రూపంలో ఇది జరగొచ్చు.
2. వన్ సైడెడ్ ఫ్రెండ్‌షిప్
వన్ సైడెడ్ లవ్ గురించి తెలుసు కానీ ఈ వన్ సైడెడ్ ఫ్రెండ్‌షిప్ అంటే ఏంటి అనుకోవచ్చు. స్నేహం అనేది రెండు వైపుల నుండి ఉన్నప్పుడే దానికి మంచి విలువ ఉంటుంది. ఒకరు స్నేహంగా ఉండటం మరొకరు దూరంగా ఉండటం నిజమైన స్నేహం అనిపించుకోదు.
వన్ సైడెడ్ ఫ్రెండ్‌షిప్‌లో ఒకరు ఇస్తుంటారు, మరొకరు తీసుకుంటారు. ఇది కొన్ని రోజుల వరకు బాగానే ఉంటుంది. తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది.
3. ఎప్పుడూ మీదే తప్పని అంటుంటారు
టాక్సిక్ ఫ్రెండ్స్ తమ తప్పులను కూడా మీపై నెట్టివేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఏ విషయంలోనైనా తమ తప్పు లేదనే చెబుతుంటారు. అపరాధాన్ని వారిపై వేసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు. మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే వారితో స్నేహం కొనసాగించడం గురించి ఆలోచించాల్సిందే.

4. నమ్మకం లేకపోవడం
ఏ విషయమైనా సరే వారిని నమ్మడం కష్టంగా ఉంటుంది. ఎలాంటి బంధంలోనైనా నమ్మకం అనేది అతి ముఖ్యం. నమ్మకమే లేకపోతే ఏ సంబంధం కూడా ఎక్కువ కాలం సాగలేదు. నమ్మకం ఒక్కరోజులోనో, రెండు రోజుల్లోనో వచ్చేది కాదు.
కొందరు స్నేహితులు అవకాశవాదంతో ఉంటారు. మంచి ఛాన్స్ రాగానే వారి నిజస్వరూపం చూపిస్తారు.
5. మానిప్యులేట్ చేయడం
టాక్సిక్ ఫ్రెండ్స్ ఎప్పుడూ మానిప్యూలేట్ చేస్తుంటారు. జరిగింది జరగనట్లు, జరగనిది జరిగినట్లు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తుంటారు. మోసం చేసే స్నేహితులు ఎప్పటికీ ప్రమాదమే. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండటం మంచిది.

6. వేధిస్తుండటం
ఏదో రకంగా నిత్యం వేధిస్తుంటారు. గతంలో జరిగిన అవమానకర ఘటనలు గుర్తు చేస్తుంటారు. గాసిప్స్ వ్యాప్తి చేస్తారు. ఇతర అల్లరి పనులు చేస్తూ వేధించడం అలాంటి ఫ్రెండ్స్‌కు వెన్నతో పెట్టిన విద్య.
7. సానుభూతి చూపరు
విషపూరితమైన స్నేహితుడు కష్ట సమయంలో తోడుగా ఉండడు. మీ బాధలపై వారికి దిగులు ఉండదు. అసలు మీ గురించి, మీ సమస్యల గురించి వారికి పట్టింపు ఉండదు. ఎంతమాత్రం వారికి వారి స్వార్థం, స్వలాభం మాత్రమే చూసుకుంటారు.
కష్టకాలంలో తోడుగా ఉండాల్సిన స్నేహితులు మనల్ని వదిలేసి వెళ్లిపోతారు. అది ఏమాత్రం నిజమైన స్నేహం అనిపించుకోదు. మీతో జాలీగా ఉండటం మాత్రమే వారికి కావాల్సింది. కష్టాల్లో కూరుకుపోయినా, బాధతో ఏడుస్తున్నా పట్టించుకోరు. కాబట్టి అలాంటి ఫ్రెండ్స్‌కు ఎంత దూరం ఉంటే అంత మంచిది.



Click it and Unblock the Notifications