Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
టైమ్ పాస్ బంధమా? నిజమైన ప్రేమా? తేల్చేసుకోండిలా!
మీ భాగస్వామి మీతో నిజంగానే ఉన్నారా లేక కేవలం సమయం గడుపుతున్నారా అనే సందేహం మిమ్మల్ని వేధిస్తోందా? ఈ రోజుల్లో ఎంతో మంది తమ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి బంధాల్లోకి వస్తున్నారు. కానీ ఆ బంధానికి పూర్తి నిబద్ధతతో కట్టుబడి ఉండే సమయం వచ్చేసరికి నీడలా మాయమైపోతారు.
మీ భాగస్వామి భవిష్యత్తు ప్రణాళికల్లో మీకు స్థానం కల్పించకుండా కేవలం వర్తమానంలోనే మిమ్మల్ని బంధిస్తున్నారేమోనని ఒక్కసారి ఆలోచించండి. నిబద్ధతకు భయపడే వారి ప్రవర్తనలో కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. వాటిని గమనిస్తే మీ బంధం భవిష్యత్తు ఏమిటో మీకే అర్థమవుతుంది.

తమ ప్రపంచంలో మీకు స్థానం ఇవ్వరు
ఒక వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే వారి ప్రపంచంలోకి మిమ్మల్ని సగర్వంగా ఆహ్వానిస్తారు. తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మిమ్మల్ని పరిచయం చేయడానికి వెనుకాడరు. కానీ, కేవలం కాలక్షేపం కోసం మీతో ఉన్నవారు మిమ్మల్ని ఓ రహస్యంలా దాచిపెడతారు.
వారి సోషల్ మీడియాలో మీ ప్రస్తావన ఉండదు, కుటుంబ వేడుకలకు మీకు ఆహ్వానం లభించదు. ఒకవేళ మీరు వారి స్నేహితులను కలుద్దామని అడిగినా ఏదో ఒక సాకు చెప్పి ఆ ప్రస్తావనను దాటవేస్తుంటారు.
భవిష్యత్తు ప్రస్తావన వస్తేనే భయం
నిజమైన బంధానికి పునాది భవిష్యత్తు ప్రణాళికలు. వచ్చే ఏడాది విహారయాత్ర అయినా, ఐదేళ్ల తర్వాత జీవితం అయినా ఇద్దరూ కలిసి కలలు కంటారు. కానీ మీ భాగస్వామికి భవిష్యత్తు అనే పదం వింటేనే అసౌకర్యంగా ఉందా?
పెళ్లి, పిల్లలు, కలిసి జీవించడం వంటి మాటలు వింటే వారికి చిరాకు వస్తుందా లేదా నవ్వి ఆ విషయాన్ని తేలికగా తీసిపారేస్తున్నారా? అయితే జాగ్రత్త. వారి డిక్షనరీలో రేపు అనే పదానికి స్థానం ఉండదు.. కేవలం ఈరోజు మాత్రమే ఉంటుంది.
అకస్మాత్తుగా స్పందన ఆగడం
అంతా సవ్యంగా సాగుతున్నట్లే ఉంటుంది. కానీ ఉన్నట్టుండి మీ భాగస్వామి మీ ఫోన్ కాల్స్ కు, మెసేజ్ లకు రిప్లై ఇవ్వడం మానేస్తారు. దీన్నే ఘోస్టింగ్ అంటారు.
బంధం బలపడుతోందని, మరింత లోతుగా మారుతోందని అనిపించినప్పుడల్లా వారు కావాలనే దూరం పాటిస్తారు. ఎందుకంటే ఎమోషనల్ రిలేషన్ ఏర్పడటమంటే వారికి భయం. మీరు నిలదీసినా వారు సరైన కారణం చెప్పలేరు.
అంతా వారి ఇష్టప్రకారమే జరగాలి
ఈ బంధం ఒక వన్ వే ట్రాఫిక్ లాంటిది. ప్రతి నిర్ణయం, ప్రతి ప్రణాళిక వారి సౌలభ్యం మేరకే ఉంటుంది. మీ ఇష్టాయిష్టాలకు, మీ భావాలకు విలువ ఉండదు.
వారికి తోచినప్పుడు అర్థరాత్రి అయినా మిమ్మల్ని కలవాలని కోరతారు కానీ మీకోసం వారి బిజీ షెడ్యూల్ లో చిన్న సర్దుబాటు కూడా చేసుకోలేరు.
శారీరక సాన్నిహిత్యం, మానసిక దూరం
ఇలాంటి వారు శారీరకంగా మీకు ఎంత దగ్గరగా ఉన్నా మానసికంగా మాత్రం మైళ్ల దూరంలో ఉంటారు. తమ భయాలు, ఆశయాలు, కలలు వంటి లోతైన విషయాలను మీతో పంచుకోరు. ఎందుకంటే అలా పంచుకుంటే మీ మధ్య బంధం బలపడుతుందని, అది వారికి ఇష్టం ఉండదని వారి భయం.



Click it and Unblock the Notifications