Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Kanuma Wishes in Telugu: అందరికీ నచ్చేలా కనుమ శుభాకాంక్షలను ఈ విధంగా తెలియజేయండి
సంక్రాంతి పండగను ప్రతి ఒక్కరూ ఎంతో ఘనంగా జరుపుకున్నారు. గాలి పటాలు ఎగరేసి, చెక్కర పొంగలి వండుకొని, కుటుంబ సభ్యుల మధ్య ఈ పండగను ఎంతో కోలాహలంగా జరుపుకున్నారు. నేడు కనుమ. ఈ రోజున ప్రతి ఇంట్లో పశువుల పండగను జరుపుకుంటారు. పశువులను పూజించడం, నాన్ వెజ్ తినడం వంటివి చేస్తారు. సంక్రాంతి తరువాత వచ్చే ఈ పండగను కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. అంత గొప్ప పండగను మీ ఆత్మీయులకు, కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు ఈ విధంగా అందంగా, మనసుకు హత్తుకునేలా ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేయండి.
కనుమ శుభాకాంక్షలు తెలుగులో
కమ్మని విందు వినోదాలతో పాటు, కలకాలం కలిసుండే బంధాలతో మీ జీవితం మొత్తం నిండి ఉండాలని మనసారా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు కనుమ శుభాకాంక్షలు

పాడి పశువుల ఆరోగ్యంతో పాటు, మీ ఆరోగ్యం కూడా బాగుండాలని, మీ కుటుంబంలో ఆనందాలు నెలకొనాలని మనసారా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు మిత్రమా.
మీ కుటుంబ సభ్యులతో కలకాలం కలిసుండాలి, మీ పాడి పశువులు ఆరోగ్యంగా ఉండాలి, మీ వ్యవసాయ క్షేత్రాలు లాభదాయకంగా మారాలని మనసారా కోరుకుంటూ కనుమ శుభాకాంక్షలు
ఈ కనుమ మీ జీవితంలోని కష్టాలన్నింటినీ తొలగించాలని, చీకట్లను పారద్రోలి మీ జీవితంలో వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ హ్యాపీ కనుమ
కమనీయ జీవితానికి, కమ్మని విందు భోజనానికి కనుమ పండగ నాంది. కనుమలోని ఆ కమ్మదనం మీ జీవితంలో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కనుమ శుభాకాంక్షలు
ఈ కనుమ పండగ మీ జీవితంలో కాంతులను నింపాలని, కష్టాలను తరిమేసి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ కనుమ శుభాకాంక్షలు
సంక్రాంతి మూడో రోజు వచ్చే ఈ కనుమ ముచ్చటగా సాగాలని, కమ్మని క్షణాలను మీకు పంచి ఇవ్వాలని, మీ జీవితంలో మంచి క్షణాలు నెలకొనాలని కోరుకుంటూ కనుమ శుభాకాంక్షలు
కనుమ పండగ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా మంచే జరగాలి. మీరంతా సంతోషంగా ఉండాలి. హ్యాపీ కనుమ
ఈ పవిత్రమైన కనుమ రోజున మీరు ఎలాంటి వివాదాల్లో చిక్కుకోకుండా, మీ జీవితంలో ఎలాంటి ఎదురుదెబ్బలు తగలకుండా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ కనుమ
కమ్మని కనుమ ఇచ్చే మంచి విందు భోజనం మాదిరిగానే, మీ జీవితం కూడా చాలా ఆహ్లాదకరంగా, వినోదభరితంగా సాగాలని కోరుకుంటూ కనుమ శుభాకాంక్షలు



Click it and Unblock the Notifications