Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Love secrets: ఈ లవ్ సీక్రెట్స్ తెలుసుకోండి..మీ ప్రేమను ఎవ్వరూ విడదీయలేరు
ఏదైనా రిలేషన్ ని ప్రారంభించడం చాలా ఈజీనే కానీ దానిని లైఫ్ లాంగ్ మెయింటెయిన్ చేయడం మాత్రం చాలా కష్టం. మీ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉండటాలంటే మీ సమయాన్ని, ప్రేమను ఇవ్వాలి, ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు గౌరవించాలి. ఇలా చేయకపోతేంటే కొంతకాలం తర్వాత సంబంధంలో ప్రేమ లేదా సాన్నిహిత్యం లేకపోవడం వల్ల క్రమంగా సంబంధంలో దూరం పెరగడం ప్రారంభమవుతుంది. ఇది రిలేషన్ షిప్ జీవితకాలాన్ని తగ్గిస్తుంది. మీ రిలేషన్ షిప్ మునుపటిలా ఉండకపోతే, సంబంధంలో పెరుగుతున్న దూరాన్ని తగ్గించాలనుకుంటే..7 ప్రేమ రహస్యాలు మీ రిలేషన్ షిప్ ని దూరం కాకుండా నిరోధించగలవు.
మీ రిలేషన్ షిప్ ని ఎప్పుడూ యంగ్ గా ఉంచే టిప్స్
మీ స్వరం విషయంలో జాగ్రత్తగా ఉండండి
ఏ సంబంధంలోనైనా కమ్యూనికేషన్ మంచిది, కానీ మాట్లాడేటప్పుడు మీ స్వరం చాలా ముఖ్యం. మీరు మంచి విషయాన్ని తప్పుగా చెబితే, మీ మంచి విషయం అవతలివాళ్లకి ఏమీ అర్థం కాదు. కాబట్టి మాట్లాడేటప్పుడు మీ స్వరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.

కలిసి ఉన్నప్పుడు అపరిచితులుగా ఉండకండి
మీరు మీ భాగస్వామి ఉన్న గదిలోనే ఉన్నట్లయితే వారిని తాకడం లేదా ఐ కాంటాక్ట్ చేయడం ముఖ్యం. ఒకే గదిలో అపరిచితులలా జీవించడం అనేది జంటలు అనుకోకుండా చేసే అతి పెద్ద తప్పులలో ఒకటి. గంటలు గంటలు మొబైల్‌లో గడపడం, ముఖం తిప్పుకుని నిద్రపోవడం వల్ల దూరం పెరుగుతుంది.
నాణ్యమైన సమయాన్ని వెచ్చించండి
కొందరు వ్యక్తులు తమ సంబంధాన్ని బలవంతంగా కొనసాగిస్తారు,పిల్లల కారణంగా లేదా ఇతర కారణాల వల్ల దానిని జీవితకాలం పొడిగిస్తారు. అయితే ఇది కరెక్ట్ కాదు. సంబంధంలో మీరు ఎంత నాణ్యమైన సమయాన్ని వెచ్చిస్తున్నారనేది ముఖ్యం.
భావోద్వేగ సాన్నిహిత్యం అవసరం
ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉండటానికి ఒకరితో ఒకరు భావోద్వేగంగా ఉండాలి. భావోద్వేగ సాన్నిహిత్యం లేకుండా ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉండటం ఎక్కువకాలం మీ బంధాన్ని కొనసాగించేలా చేయదు. ఇది సంబంధం యొక్క జీవితకాలాన్ని తగ్గిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి.
మీ ప్రేమను వ్యక్తపరచండి
భాగస్వామిని ప్రేమించడం, మీ భాగస్వామి మీ ప్రేమను ఎంతగా అనుభవిస్తున్నారనేది రెండు వేర్వేరు విషయాలు. కాబట్టి ప్రేమను సరైన రీతిలో వ్యక్తపరచడం ముఖ్యం. దీని కోసం వారిని ఆశ్చర్యపరచండి, ఆరాధించండి, గౌరవించండి. ఈ విషయాలు మీ సంబంధాన్ని విడదీయకుండా చేస్తాయి.



Click it and Unblock the Notifications