Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
దంపతులకు ఇది బెస్ట్ టిప్.. మీ భాగస్వామి మీతో నిజాయితీగా ఉంటున్నారో లేదో ఇలా తెలుసుకోండి!
ఏ బంధంలోనైనా నమ్మకం, నిజాయితీ అనేది చాలా ముఖ్యం. అదే ప్రేమ, వివాహ బంధంలో నమ్మకం, నిజాయితీ అనేది మూల స్తంభంగా పని చేస్తుంటాయి. అందుకే ఎవరైనా ప్రేమలో ఉన్నా, పెళ్లి చేసుకున్నా భాగస్వామితో నిజాయితీగా ఉండాలి అప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. ఆ బంధం బలంగా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది తమ భాగస్వామిని మోసం చేస్తూ.. వేరే సంబంధం పెట్టుకుంటున్నారు. అలాగే ఎలాంటి నీతి నిజాయితీ లేకుండా మోసం చేస్తున్నారు.
భాగస్వామి మోసం చేస్తున్నా కొందరికి మాత్రం తెలియదు. అలాంటి వ్యక్తులు తమ భాగస్వామి తమతో నిజాయితీగానే ఉంటున్నారా లేదా అనేది ఈ టిప్స్‌తో తెలుసుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటి? ఎలా తెలుసుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చివరి నిమిషంలో ప్రణాళికలు మార్చడం
జీవిత భాగస్వామితో ఎంతో కాలంగా కలిసి ఉంటారు. కాబట్టి ఆ వ్యక్తి ఏ విధంగా ఉంటారు? ఏ విధంగా ప్రవర్తిస్తారు అనే ఒక క్లారిటీ మీకు ఉంటుంది. అయితే ఆ వ్యక్తి విషయంలో హఠాత్తుగా మార్పులు కనిపించినా, ఆస్మికంగా ప్రణాళికలు, ప్రయాణాలు మార్చుకున్నా కచ్చితంగా ఆ వ్యక్తిపై శ్రద్ధ పెట్టాల్సిందే. ప్రతిరోజూ ఒకే సమయానికి వచ్చే వ్యక్తి, లేట్‌గా వస్తున్నా, బిజీగా ఉంటున్నా లేదా ఆ వ్యక్తి ప్రవర్తన వింతగా ఉన్నా గమనించాల్సి ఉంటుంది.
పాస్‌వర్డ్ మారిస్తే..
ఈ కాలంలో ఫోన్ ఉంటే సరిపోతుంది. ప్రతి పనిని ఫోన్‌తోనే చేసుకోవచ్చు. నిజాయితీగల వ్యక్తులు ఫోన్‌కు పాస్‌వర్డ్ పెట్టుకోరు. పెట్టుకున్నా ఒకే లాక్ ఉంటుంది. కానీ తప్పు చేసే వ్యక్తులు లేదా వేరే వ్యక్తులతో సంబంధం పెట్టుకున్న వ్యక్తులు మాత్రం పాస్‌వర్డ్ పెట్టుకుంటారు. లేదా తమ పాస్‌వర్డ్‌ను పదే పదే మారుస్తుంటారు. దీనిని బట్టి ఆ వ్యక్తి కచ్చితంగా నిజాయితీగా లేరని అర్ధం చేసుకోవాలి.
దీంతో పాటు ఫోన్ వచ్చినపుడు లేదా మెస్సేజ్ వచ్చినపుడు ఆ వ్యక్తిలో భయాందోళనలు కనిపించినా, ఫోన్ మెసేజ్ రాకపోయినా ప్రతిసారి ఫోన్ వంకే చూస్తున్నా కచ్చితంగా ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్ధం చేసుకోవాలి. దానికి అనుగుణంగా మీరు వ్యవహరించాలి.
భావోద్వేగాల మార్పు
నిజాయితీగా ఉండే భాగస్వాములు తమ భాగస్వామితో ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటారు. తమ ఎమోషన్స్‌ను వారికి అర్థమయ్యేలా ఉంచుతారు. కానీ నిజాయితీగా లేని వ్యక్తులు మాత్రం తమ భావేద్వేగాల్లో మార్పులు చేస్తారు. మూడీగా మారడం, అతిగా మాట్లాడడం, అతిగా కోప్పడడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆ వ్యక్తిలో మార్పు వచ్చిందని, ఎదో తప్పుడు చేస్తున్నారని గ్రహించాలి. అసలు ఎందుకు అంతలా మూడ్ చేంజ్ చేస్తున్నారు, దానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
కొత్త మార్పులు
ఎప్పుడూ మీకు నచ్చే దుస్తులు ధరించే వ్యక్తి సరికొత్తగా తనకు నచ్చిన దుస్తులు దరిస్తున్నా తనకు ఇష్టమైన పనులు చేస్తున్నా కచ్చితంగా అతనిపై ద్రుష్టి పెట్టాలి. తన శరీరంపై, తన అందంపై శ్రద్ధ చూపిస్తున్నా ఆ మార్పు పెను ప్రమాదంగా మారబోతుందని గమనించాలి. ఈ మార్పులు మీకోసం అయితే ఆ మార్పులు మీకు తెలిసేలా చేస్తాడు. కానీ మీకు తెలియకుండా తనకు తానే చేస్తే కచ్చితంగా అది వేరే వ్యక్తి మీద ఇష్టంతో చేస్తున్నారని గ్రహించాలి. ఈ టిప్స్‌తో మీ భాగస్వామి మీతో నిజాయితీగా ఉంటున్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు.



Click it and Unblock the Notifications