Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
RCB విజయం తర్వాత పరుగెత్తుకెళ్లి భార్యను కౌగలించుకున్న కోహ్లీ.. హగ్ చేసుకుంటే ఇన్ని లాభాలా?
ఐపీఎల్(IPL) చరిత్రలో తొలిసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)టైటిల్ ను గెల్చుకుంది. మంగళవారం(జూన్ 3,2025)అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై 6 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించి18 ఏళ్ల తర్వాత తొలిసారి ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. అయితే మ్యాచ్ విజయం తర్వాత ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ నుంచి తన భార్య అనుష్క శర్మని హగ్ చేసుకోడానికి స్టాండ్స్ కి పరుగెత్తుతున్న వీడియోలు, తన భార్యను హగ్ చేసుకొని భావోద్వేగానికి గురైన దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మ్యాచ్ తర్వాత ఇచ్చిన ప్రజెంటేషన్ లో తన జర్నీలో తన పక్కనే ఉంటూ తనకు సపోర్టివ్ గా నిలిచినందుకు అనుష్క శర్మకు విరాట్ కోహ్లీ థ్యాంక్స్ చెప్పారు.
అయితే అసలు భాగస్వామిని హగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందో మీకు తెలుసా? భాగస్వామిని ఆలింగనం చేసుకోవడం కేవలం ప్రేమను వ్యక్తపరిచే మార్గం మాత్రమే కాదండోయ్..అది మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక ఆత్మీయ కౌగిలిలో దాగి ఉన్న ఆ ఐదు అద్భుత ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూడండి.

భాగస్వామిని హగ్ చేసుకోవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలివే
ఒత్తిడి మాయం
ఒక వెచ్చని కౌగిలి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది..దీనిని లవ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇది ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్‌ను తగ్గిస్తుంది..తద్వారా మీరు ప్రశాంతంగా, సంతోషంగా ఫీల్ అవుతారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఒక గట్టి కౌగిలి అన్నీ మర్చిపోయేలా చేస్తుంది.
బంధం బలపడుతుంది
ఆలింగనం భాగస్వాముల మధ్య భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేస్తుంది. ఇది నమ్మకాన్ని, భద్రతా భావాన్ని పెంచుతుంది. ఒకరికొకరు తోడుగా ఉన్నామనే అనుభూతిని ఇస్తుంది. కమ్యూనికేషన్ లేకపోయినా ఒక కౌగిలి వేల మాటల అర్థాన్ని తెలియజేస్తుంది.
గుండెకు భద్రత
ఆలింగనం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆక్సిటోసిన్ విడుదల రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
రోగనిరోధక శక్తి పెంపు
నమ్మశక్యంగా లేకపోయినా తరచుగా ఆలింగనం చేసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒక పరిశోధన ప్రకారం తరచుగా కౌగిలించుకునే వారు ఒత్తిడికి తక్కువగా గురవుతారు. దీనివల్ల వారి శరీరం వ్యాధులతో పోరాడే శక్తిని పొందుతుంది.
నొప్పికి ఉపశమనం
దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతున్న వారికి ఆలింగనం కొంతవరకు ఉపశమనం కలిగిస్తుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆక్సిటోసిన్ సహజసిద్ధమైన నొప్పి నివారిణిగా పనిచేసి నొప్పిని తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications