Latest Updates
-
మహిళల్లో పీరియడ్స్, ఫిట్నెస్ సమస్యలకు చెక్ పెట్టే ప్రొటీన్ పౌడర్.. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఇలా చేసేయండి -
ఉల్లి, వెల్లుల్లి లేకుండా పూరీ, బగారాకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆలూ టమాటర్ గ్రేవీ.. ఈ తాలింపుతోనే అసలు మజా.! -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీ, ఈ చట్నీతో తింటే అమోఘం.! -
ఉతికిన బట్టలు ఈ సమయంలో ఆరేస్తున్నారా.. వాస్తు ప్రకారం ఇంటికి ఎంత ప్రమాదకరమో తెలుసా.? -
వరలక్ష్మీ వ్రతం 2026: మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి బెస్ట్ మెసేజెస్, వాట్సాప్ స్టేటస్ లు.. -
రోజుకు 2 యాలకులు తింటే..15 రోజుల్లో మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
మొదటి రోజే మేనేజర్‌కి ఊహించని షాక్.. 6 గంటల్లోనే కొత్త ఉద్యోగి షాకింగ్ నిర్ణయం -
వరలక్ష్మీ వ్రతం రోజు అటుకులతో ఇలా కేసరి చేసి చూడండి.. శ్రమ తక్కువ, టేస్ట్ ఎక్కువ.! -
మహిళలకు అమృతంతో సమానం.. ఎముకల పటిష్టతకు, రక్తహీనతను తరిమికొట్టే హెల్తీ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
సమసప్తక యోగం: శుక్ర, శని గ్రహాల అరుదైన కలయిక.. ఈ రాశుల వారి తలరాతే మారనుంది.!
ఎంతో మందికి న్యాయం చేసి అన్యాయం అయిపోయిన లాయర్.. భార్య దెబ్బకు..
కొంత మంది కొన్ని విషయాలను సీరియస్ గా తీసుకుంటారు. ఏదైనా చట్టపర సమస్యలు ఎదురైతే అందరూ లాయర్ల దగ్గరకు పరుగు తీస్తారు. మంచి లాయర్ ను పెట్టుకుంటే మన సమస్యలు తీరిపోయి కేసుల నుంచి విముక్తిపొంది హ్యాపీగా ఉంటామని చాలా మంది అనుకుంటారు. విడాకులు తీసుకోకుండా వందలాది జంటలను మళ్లీ ఒక్కటి చేసిన లాయర్ విడాకులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అయితే విడాకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన లాయర్ కే ఆయన భార్య విడాకుల నోటీసులు ఇవ్వడంతో అందరూ బిత్తరపోయారు.
గుజరాత్ లో ఓ లాయర్ ఉన్నారు. ఆయన లాయర్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టి ఇప్పటి 15 ఏళ్లు దాటిపోయింది. లాయర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలోనే ఆయనకు వివాహం అయ్యింది. లాయర్ దంపతులకు ఓ కుమార్తె ఉంది. లాయర్ గా అనేక కేసులు వాదిస్తున్న ఆయన దగ్గరకు కొన్ని సంవత్సరాల క్రితం విడాకులు తీసుకోవడానికి ఓ జంట వచ్చింది. అక్కడే ఆ లాయర్ జీవితం మలుపు తిరిగింది.

విడాకులు తీసుకోవాలని అనుకుంటున్న జంట దగ్గర ఫీజు తీసుకుని కేసు వాదించకుండా ఆ లాయర్ ఓ పని చేశారు. మీరు ఎందుకు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారు ?, మీరు విడాకులు తీసుకుంటే మీ ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయని, మీరు కలిసి ఉంటే ఇద్దరి జీవితాలు బాగుపడుతాయని ఆ లాయర్ ఆ జంటకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ జంటకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఆ లాయర్ తరువాత ఆయన రూటు మార్చారు.
జంటలకు కౌన్సిలింగ్
అప్పటి నుంచి విడాకులు తీసుకోవాలని ఆ లాయర్ ను సంప్రధించిన జంటలకు కౌన్సిలింగ్ ఇచ్చిన లాయర్ దాదాపుగా ఎవ్వరూ విడాకులు తీసుకోకుండా అన్ని ప్రయత్నాలు చేశారు. ఇప్పటి వరకు ఆ లాయర్ విడాకులు తీసుకోవాలని అనుకున్న 138 జంటలను ఒక్కటి చేసిన ఆ లాయర్ మంచి పేరు సంపాధించుకున్నారు. విడాకులకు వ్యతిరేకంగా ఆ లాయర్ గుజరాత్ లో పోరాటం చేస్తున్నారు.

ఊహించని షాక్
విడాకులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న లాయర్ కు ఊహించని విధంగా మరో లాయర్ నుంచి నోటీసులు అందాయి. తనకు విడాకులు ఇవ్వాలని ఆ లాయర్ కు అతని భార్య నోటీసులు పంపించడంతో అందరూ బిత్తరపోయారు. నాకు నా భర్త నుంచి విడాకులు మాత్రం ఇప్పిస్తే చాలని, ఆయన నుంచి నేను, నా కుమార్తె ఆర్థిక సమస్యలతో పాటు ఇంట్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ ఫేమస్ లాయర్ భార్య కోర్టుకు మనవి చేసింది.
లాయర్ భార్య కోర్టుకు
లాయర్ గా పని చేస్తున్న తన భర్త ఏ మాత్రం డబ్బులు సంపాధించకుండా ప్రజాసేవ చేస్తున్నాడని, ఇల్లు గడవడానికి కష్టంగా ఉందని, తన కూతురు చదువు ఆగిపోయే పరిస్థితి ఎదురైయ్యిందని, ఇలాగే ఉంటే మేము రోడ్డు మీదపడుతామని ఆ లాయర్ భార్య కోర్టును ఆశ్రయించింది. తాను భరణం కోరినా నా మొగుడు ఇచ్చే పరిస్థితిలో లేడని, విడాకులు మాత్రమే ఇప్పిస్తే చాలని ఆ లాయర్ భార్య అంటోంది.
హాట్ టాపిక్
విడాకులు తీసుకోవాలని అనుకుంటున్న దంపతులు ఆ లాయర్ ఇంటి వైపు కన్నెత్తికూడా చూడటం లేదని, వేరే కేసులు కూడా ఆలాయర్ ద్గరకు రాకపోవడంతో ఆ లాయర్ ఆర్థికంగా చితకిపోయాడు. ఈ దెబ్బతో ఆయన భార్య విడాకులు ఇవ్వాలని డిసైడ్ కావడం హాట్ టాపిక్ అయ్యింది, ఇంతకాలం విడాకులు తీసుకుంటున్న దంపతులకు పదేపదే అనేక విధాలుగా కౌన్సిలింగ్ ఇచ్చిన లాయర్ కు చివరికి ఆయన భార్య విడాకులు నోటీసులు ఇవ్వడంతో సాటి లాయర్లు ఆయన మీద జాలి చూపిస్తున్నారు. తన జీవితంలో నుంచి భార్య ఊడిపోవడంతో లాయర్ అయోమయంలో పడిపోయాడు.



Click it and Unblock the Notifications