Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ప్రేమలో కొత్త ట్రెండ్స్..నానోషిప్ తో కొత్త అనుభవాలు
ఒకప్పుడు మన సమాజంలో సంబంధాలు అంటే గుర్తుకొచ్చేది రెండే రెండు.. పెళ్లి లేదా ఒంటరితనం. ఇప్పుడు కాలం మారింది, యువతరం ఆలోచనలు మారాయి. వివాహితులు లేదా సింగిల్ అనే పాతకాలపు లేబుల్స్ కు నేటి తరం గుడ్ బై చెబుతోంది. వారి సౌకర్యానికి, ఆలోచనలకు తగ్గట్టుగా సరికొత్త సంబంధాలను సృష్టిస్తూ వాటికి వినూత్నమైన పేర్లు కూడా పెడుతున్నారు. Gen-Z యువతలో(1997-2012 మధ్య జన్మించినవారు) బాగా ప్రాచుర్యం పొందిన ఈ ట్రెండ్స్ ను ఇప్పుడు మిలీనియల్స్(1980-1996 మధ్య జన్మించినవారు) కూడా అందిపుచ్చుకుంటున్నారు. మన దేశంలో చాలా వేగంగా మారుతున్న ఈ డేటింగ్ సంస్కృతిలోని కొన్ని కొత్త బంధాల గురించి ఇక్కడ చూడండి.
సిట్యుయేషన్ షిప్..కమిట్ మెంట్ లేని సాన్నిహిత్యం
ఈ కొత్తతరం బంధాలలో ఎక్కువగా వినిపిస్తున్న పదం సిట్యుయేషన్ షిప్. ఇది సంప్రదాయ బాయ్ ఫ్రెండ్-గర్ల్‌ఫ్రెండ్ బంధానికి పూర్తి భిన్నమైనది. ఇందులో ఇద్దరు వ్యక్తులు స్నేహానికి మించి, ప్రేమకు కాస్త తక్కువగా ఒకరితో ఒకరు సమయం గడుపుతారు. వారి మధ్య బలమైన భావోద్వేగ బంధం ఉంటుంది కానీ దానికి ప్రేమ అనే పేరు పెట్టరు. ఒకరినొకరు బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ అని పిలుచుకోరు.

ఇక్కడ ఎలాంటి కమిట్ మెంట్స్, వాగ్దానాలు ఉండవు. ఒకరిపై ఒకరు ఎలాంటి అంచనాలు, ఒత్తిళ్లు పెట్టుకోకుండా స్వేచ్ఛగా ఉంటారు. ఒకప్పుడు దీన్ని ఒక అసంబద్ధమైన బంధంగా చూసేవారు..కానీ నేటి యువత దీన్ని ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ఒక చక్కటి అవకాశంగా భావిస్తోంది. భవిష్యత్తులో కలిసి ఉండగలమా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇది ఒక ప్రయోగం లాంటిది. ఒకవేళ ఇద్దరికీ పొసగకపోతే, ఎలాంటి గొడవలు, బాధలు లేకుండా సులభంగా విడిపోవచ్చు.
నానో షిప్.. మెరుపులా వచ్చిపోయే బంధం
నానో అంటే చాలా చిన్నది. ఈ బంధం కూడా అంతే, చాలా తక్కువ కాలం ఉంటుంది. కేవలం కొన్ని వారాలు లేదా మూడు, నాలుగు డేట్ లకే పరిమితమైన ఈ బంధం, ఎంత వేగంగా మొదలవుతుందో అంతే వేగంగా ముగిసిపోతుంది. దీన్ని Gen-Z ఫాస్ట్-ఫ్యాషన్ డేటింగ్ స్టైల్ అని చెప్పొచ్చు. ఎక్కువ నిబద్ధత లేకుండా, కొత్త అనుభవాలను అన్వేషించడానికి, ఎక్కువ లోతుగా వెళ్లకుండానే ఒకరి గురించి తెలుసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది.
ఫ్యాన్ షిప్..మాటల్లేని డిజిటల్ ఆకర్షణ
ఫ్యాన్ అనే పదం మనకు తెలిసిందే. మనకు ఇష్టమైన నటీనటులను సోషల్ మీడియాలో ఫాలో అవుతారు కదా? వారి ప్రతి పోస్ట్ ను లైక్ చేస్తారు, కానీ వారితో ఎప్పుడూ నేరుగా మాట్లాడరు. ఫ్యాన్ షిప్ కూడా దాదాపు అలాంటిదే. సోషల్ మీడియాలో ఒక వ్యక్తిని చూసి ఇష్టపడటం, వారిని ఫాలో అవ్వడం, వారి ఫోటోలకు ఆకర్షితులవ్వడం జరుగుతుంది. కానీ వారితో మాట్లాడటానికి లేదా పరిచయం పెంచుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయరు. ఇది కేవలం మాటలు లేని ఒక డిజిటల్ ఆకర్షణ. ఈ కొత్త రకం బంధాలు సంప్రదాయ సంబంధాల కంటే ఎక్కువ స్వేచ్ఛను, తక్కువ ఒత్తిడిని అందిస్తున్నాయి.



Click it and Unblock the Notifications