Latest Updates
-
బరువు త్వరగా తగ్గాలంటే ఎక్సర్ సైజ్ ఏ టైమ్ లో చేయాలి? -
భర్త/భార్య పక్కనే ఉన్నా 'నాకు అర్థమయ్యే వాళ్లెవరూ లేరు' అనిపిస్తోందా? కారణం ఇదే -
నెలాఖరులో డబ్బు తక్కువైనప్పుడు భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడతారో తెలుసా? -
సమ్మర్లో చల్లచల్లగా మిల్క్‌షేక్, మాక్‌టెయిల్.. ఈ ఫ్రూట్స్‌తో స్పెషల్ డ్రింక్స్ -
కొవిడ్ తెచ్చిన కష్టాలు.. యువతలో పెరుగుతున్న తుంటి మార్పిడి సర్జరీలు.! -
కళ్లలో నీళ్లు తిరుగుతున్నా ఆపకుండా తినేంత టేస్టీ..మహారాష్ట్ర స్పెషల్ తేచ్చా చికెన్..ఈజీగా ఎలా చేయాలంటే.. -
బీట్రూట్, అటుకులతో హాట్ అండ్ స్వీట్ హెల్తీ స్నాక్స్ -
మధురై స్పెషల్ బంగాళాదుంప ఫ్రై..జన్మలో మర్చిపోలేని టేస్ట్..ఇంట్లోనే ఎలా చేయాలంటే.. -
అధిక మాసంలో ఈ 4 వస్తువులు ఇంట్లో ఉంటే చాలా డేంజర్.. వెంటనే తీసేయండి.! -
World cycle day 2026: ప్రపంచ సైకిల్ దినోత్సవం.. ఈ ఏడాది ప్రత్యేక థీమ్ ఇదే.!
2024లో పెళ్లి చేసుకున్న సెలెబ్రిటీలు వీరే.. ఎంతమంది చేసుకున్నారంటే?
2024 చివరి దశకు చేరుకుంది. ఇంకో 8 రోజుల్లో 2025వ సంవత్సరం వచ్చేస్తుంది. అయితే 2024లో చాలా ఘటనలు జరిగాయి. వరల్డ్ కప్ నుంచి సెలెబ్రిటీలపై కేసుల వరకు ఎన్నో సంఘటనలు జరిగాయి. అందులో పెళ్లిళ్లు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం చాలా మంది సినిమా స్టార్లు, బిజినెస్ మ్యాన్‌లు పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే ఈ సంవత్సరం పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు ఎవరు? ఏ ఏ సెలెబ్రిటీలు పెళ్లి చేసుకున్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నాగ చైతన్య, శోభిత
ఈ సంవత్సరం పెళ్లి చేసుకున్న స్టార్ సెలెబ్రెటీల్లో అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ కూడా ఒకరు. స్టార్ హీరోయిన్ సమంతతో విడాకుల తరువాత నాగ చైతన్య శోభిత ధూళిపాళతో రిలేషన్ మెయిన్‌టైన్ చేశాడు.రెండేళ్లు డేటింగ్ అనంతరం శోభితను వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి డిసెంబర్ 4వ తేదీన అత్యంత వైభవంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. అత్యంత దగ్గరి బంధు మిత్రుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది.

కీర్తి సురేష్, ఆంటోనీ
అటు మహానటి కీర్తి సురేష్ కూడా ఈ ఏడాది పెళ్లి చేసుకున్నారు. తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ మ్యాన్ ఆంటోనీ తట్టిల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు 15 ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు. తాజాగా డిసెంబర్ 12వ తేదీన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 15 ఏళ్ల తమ ప్రేమను వైవాహిక జీవితంగా మార్చుకున్నారు.
సుబ్బరాజు, స్రవంతి
తెలుగు సినీ ప్రపంచంలో విలన్ పాత్రలతో మెప్పించి, హీరో స్నేహితులుగా రాణించి ఎన్నో గొప్ప గొప్ప విజయాలు కలిగిన సినిమాల్లో భాగమైన సుబ్బరాజు కూడా ఈ సంవత్సరం పెళ్లి చేసుకున్నారు. స్రవంతి అనే అమ్మాయితో నవంబర్ 28వ తేదీన వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.
సిద్ధార్థ్, అదితి రావు హైదరీ
అటు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో మంచి మంచి సినిమాల్లో నటించి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరో సిద్ధార్థ్ కూడా పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్ అదితి రావు హైదరీతో సెప్టెంబర్ 16వ తేదీన పెళ్లి హెసుకున్నారు. తన వివాహ జీవితాన్ని మొదలు పెట్టారు.
కిరణ్ అబ్బవరం, రహస్య
అటు తెలుగు సినిమాలో ఇప్పుడిప్పుడే మంచి సినిమాలు తీస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. తన తోటి నటి, హీరోయిన్ రహస్య గోరఖ్‌ను పరిణయమాడాడు. ఆగష్టు 22వ తేదీన వీరి పెళ్లి జరిగింది. అటు ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ శ్రీకాంత్ కిదాంబి శ్రావ్య వర్మతో నవంబర్ 9న ఏడడుగులు వేశారు. జూన్ 2వ తేదీన టీమిండియా బ్యాట్స్‌మెన్ వెంకటేష్ అయ్యర్ శ్రుతి రఘునాథన్‌కు మూడుముళ్లు వేశాడు.
సోనాక్షి సిన్హా
వీరితో పాటు బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బల్‌ను జూన్ 23వ తేదీన పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి కూడా అత్యంత వైభవంగా కొద్దీ మంది సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అటు ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తన చిన్ననాటి రాధికా మర్చంట్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి గురించి యావత్ దేశం మాట్లాడుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్ళిలో ఒకటిగా వీరి పెళ్లి జరిగింది.
అటు మార్చి 15వ తేదీన నటి కృతి కర్బంద పులకిత్ సామ్రాట్‌ను మనువాడింది. ఫిబ్రవరి 21వ తేదీన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ బిజినెస్ మ్యాన్ జాకీ భగ్నానీని పెళ్లాడింది. అటు పీవీ సింధు కూడా ఈనెల 22వ తేదీన పెళ్లి చేసుకోనున్నారు. ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సెలెబ్రిటీలు వీరే. వీరితో పాటు ఇంకెవరైనా ఉంటే మీరు కామెంట్ చేయండి.



Click it and Unblock the Notifications