Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
ఆషాఢమాసంలో పెళ్లాలకు దూరంగా ఉంటున్నారా.. అయితే ఇలా విరహ వేదనను తగ్గించుకోండి!
ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు.. కొత్త జంటలు తెగ ఫీలై పోతుంటాయి. నెల రోజుల పాటు ఒకరికొకరు దూరంగా ఉండాలా అని గాబరా పడిపోతుంటారు. అన్ని రోజులు ఒకరికొకరు దూరంగా ఉండేందుకు చాలా కష్టపడుతుంటారు. కానీ ఈ విరహ వేదనను కూడా హాయిగా భరిస్తే..
ముందు ముందు అద్భుతమైన జీవితం ఉంటుంది. ఈ ఆషాఢ మాసం ద్వారా వచ్చే గ్యాప్ యే మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. అయితే ముఖ్యంగా భార్యలకు దూరంగా ఉన్న భర్తలు.. ఈ పనులు చేయడం ద్వారా చాలా హాయిగా ఉండొచ్చు.

భార్య లేని లోటును కాస్త తగ్గించుకోవచ్చు. అలాగే మీ భార్యలపై మీకున్న ప్రేమను తెలియపరచడంతో పాటు మీ విరహాన్ని, వారు లేకపోతే మీరు రోజూ ఎలా ఉండగల్గుతున్నారనే విషయాన్ని కనుక వాళ్లకు తెలిసేలా చేస్తే.. వారు జీవితంలో మిమ్మల్ని ఎక్కువ రోజులు వదిలి వెళ్లరు. కాబట్టి మీరు ఎలాంటి పనులు చేస్తే మీ భార్యలకు మీపై ప్రేమ పెరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. మీరు ఎంత బిజీగా ఉన్నా మీ భార్యతో చాటింగ్ చేయడం, ఫోన్ చేయడం వంటివి రెగ్యులర్ గా చేస్తుండాలి. చేయమన్నారు కదా అని పొద్దస్తమానం అదే పని మీద ఉండకూడదు.
2. ముఖ్యంగా చాటింగ్ లో కాస్త రొమాన్స్ ను జోడించడం వల్ల మీకు వారిపై ఎంత ఆసక్తి ఉందో అర్థం అవుతుంది.
3. భార్యలకు సర్ ప్రైజ్ లు అంటే చాలా ఇష్టం. సో మీరు దూరంగా ఉన్నప్పుడు ఏదైనా ప్లాన్ చేసి ఓ బహుమతి ఇస్తే చాలా హ్యాపీగా ఫీలవుతారు.
4. అలాగే ప్రతిరోజూ వీడియో కాల్స్ చేస్తూ.. ఒకరినొకరు చూసుకోవాలి. మీలోని ప్రేమానుభూతుల్ని నెమరు వేసుకోవాలి.
5. అలాగే రోజూ తినే సమయంలో ఫోన్ చేసి నువ్వు తిన్నవా లేదా అని అడిగితే వాళ్లు చాలా సంతోషంగా ఫీలవుతారు. ఇంట్లో ఉన్నప్పుడు కలిసి తినే మీరు.. దూరంగా ఉన్నప్పుడు కూడా మాట్లాడుకుంటూ కలిసే తింటే మరింత బాగుంటుంది.
6. మీరు ఎక్కువ రోజులు కలిసి ఉండాలంటే ఈ ఆషాఢ మాసం గ్యాప్ ను బాగా ఎంజాయ్ చేయాలి. అలాగే ఈ విరహ వేదనను కూడా అనుభవించి తీరాల్సిందే.
7. ఒకరితో ఒకరు మనసులో ఉన్న అన్ని విషయాల గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా లైంగికంగా ఒకరినొకరు ఉత్తేజపరుచుకోవాలి. ఈ విరహ వేదనను భరించలేని స్థితిలో మీ మాటలు ఉండాలి.
8. భార్య ఇంట్లో లేదు కాబట్టి స్నేహితులతో తిరగడం, మందు కొట్టడం వంటివి చేయకూడదు. ఒకవేళ వెళ్లాలనుకుంటే ముందుగానే మీ భార్యకి చెప్పాలి.
9. సోషల్ మీడియాను వాడుకుంటూ రీల్స్ పంపించుకోవడం, కలిసి ఒకేసారి ఇద్దరూ సినిమాలు, డాక్యుమెంటరీలు చూడడం వంటివి చేయాలి. అలాగే ఆన్ లైన్ షాపింగ్ చేయాలి.
10. మీకు నచ్చిన పుస్తకాలు, టీవీ కార్యక్రమాలు, సినిమాలు, సంగీతం, వార్తలు వంటి వాటిని ఒకరితో ఒకరు పంచుకుంటూ ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేయండి.
11. ఎక్కడైనా బయట ఒకరినొకరు కలిస్తే మాత్రం ముద్దులు పెట్టుకోవడం, హగ్గులు ఇచ్చుకోవడం, చేతులు పట్టుకోవడం వంటివి చేస్తుండాలి.
12. ప్రతీక్షణం భార్య గురించే ఆలోచించకుండా.. మీ కుటుంబం, స్నేహితులతో కూడా గడపాలి. రోజంతా ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు.
13. భార్యాభర్తలిద్దరూ ఒకరితో ఒకరు నిజాయితీగా ఉండాలి. అబద్ధాలు అస్సలే చెప్పుకోవద్దు. అలాగే ఎలాంటి నిజాలను దాచకుండా అన్నీ పంచుకోవాలి.
14. అలాగే మీ భార్యకు సంబంధించిన వస్తువులను చూస్తూ మీ జ్ఞాపకాలను నెమరువేసుకోండి. అలాగే మీ పెళ్లి, రెగ్యులర్ గా దిగిన ఫొటోలను చూసుకోండి. ఒకరికొకరు ఆ ఫొటోలను పంపించుకోండి.
15. మీకు మీ భార్యపై ఉన్న ప్రేమను పోస్ట్ కార్డుల్లో, ప్రేమ లేఖల్లో రాస్తూ మెయిల్ ద్వారా పంపించుకోండి. అలాగే పుట్టిన రోజులు, వార్షికోత్సవాలు, ప్రేమికుల రోజును గుర్తు పెట్టుకొని మరీ విష్ చేయడం, బహుమతులు ఇచ్చుకోవడం ద్వారా బంధం మరింత బలపడుతుంది.



Click it and Unblock the Notifications
