Latest Updates
-
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే! -
నేడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఊహించని ధనలాభం మీ సొంతం! -
భీమవరం స్పెషల్ చిట్టి రొయ్యల బిర్యానీ..ఘుమఘుమలాడే గోదావరి రుచి మీ ఇంట్లోనే.. -
2026 జూన్ 7: రవి యోగంతో అదృష్టం మీ సొంతం.. ఉదయం 8 గంటల లోపే ఈ పని చేయండి! -
భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే భార్యలు చేయకూడని పనులు!..తలస్నానం చేస్తే..
సెక్స్‌కు దూరంగా ఉంటున్నారా.. అయితే ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది, జాగ్రత్త సుమీ!
శృంగారం అనేది ప్రతీ ఒక్కరికీ ఓ మధురానుభూతిని ఇస్తుంది. మనిషి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యం ఉండడంలో సెక్స్ కీలక పాత్ర పోషిస్తుంది. ఒత్తిడిని తగ్గించి మనిషిలో ఉల్లాసాన్ని నింపుతుంది. తరచూ శృంగారంలో పాల్గంటే దీర్ఘకాలిక సమస్యలను దూరం చేసుకోవచ్చు. కానీ ప్రతీ ఐదుగురి మహిళల్లో నలుగు శృంగారం పట్ల పెద్దగా ఆసక్తి చూపించడం లేదని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గర్భం ధరించడం, పిల్లలు పుట్టడం తర్వాత ఎదురయ్యే ఒత్తిడి, మెనోపాజ్ వంటి సమస్యలు కారణంగానే మహిళలు సెక్స్ పై ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.

అయితే ఈ కారణాల వల్ల రోజులు, నెలలు కాదండోయ్.. ఏకంగా సంవత్సరాల పాటు సెక్స్ కు దూరంగా ఉంటున్నారట. వారిలో అసలు లైంగిక కోరికలు కల్గడం లేదని మహిళలు చెబుతున్నారట. నిజానికి శృంగారమే కదా అని చాలా మంది తేలికగా తీసుకుంటారు. కానీ దీన్ని వాయిదా వేస్తూ పోతే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు వివరిస్తున్నారు. ఇది నిజమా అనే అనుమానం వస్తోందా.. నిజమేనండోయ్. శృంగారాన్ని నిర్లక్ష్యం చేస్తే పలు రకాలు ఇబ్బందులు వస్తాయని వివరిస్తున్నారు. అయితే ఆ సమస్యలు ఏంటి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నెలసరి సమయంలో అనేక మంది మహిళలు పొత్తి కడుపులో నొప్పితో తెగ ఇబ్బంది పడుతుంటారు. తరచూ శృంగారంలో పాల్గొనే మహిళలతో పోలిస్తే లైంగిక కోరికలు తగ్గిన వారిలో ఈ నొప్పి అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ నొప్పి ఎలా తగ్గుతుందంటే... లైంగిక కోరికలు కల్గినప్పుడు గర్భాశయం సంకోచించి రక్తాన్ని బయటకు పంపిస్తుంది. ఫలితంగా నెలసరి సమయంలో నొప్పి తగ్గుతుంది. సాధారణ సమయంలో దీనికి విరుద్ధంగా ఉంటుంది. అందుకే బ్లీడింగ్ సమయంలో నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.

మరోవైపు సెక్స్ లో పాల్గొన్నప్పుడు శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. వీటిని నొప్పి నివారిణులు అని నిపుణులు చెబుతున్నారు. శృంగారంలో పాల్గొంటే నెలసరి నొప్పులతో పాటు ఇతర శారీరక నొప్పులు కూడా తగ్గుతాయని నిపుణులు వివరిస్తున్నారు. మహిళల్లో వెజైనా పొడి బారితే లైంగిక కోరికలు తగ్గుతుంటాయి. ఇది సహజమే. అయితే కొన్ని కేసుల్లో శృంగారాన్ని వాయిదా వేయడం వల్ల కూడా యోని పొడిబారే సమస్య ఉంటుందని చెబుతున్నారు.

దీనివల్ల జననేంద్రియాల్లో కండరాలు బిగుసుకుపోతాయి. వయసు పెరుగుతున్నా కొద్దీ అక్కడి కణజాలాలు సైతం పలుచగా మారుతాయి. ఇలాంటి సమయంలోనే బవంతంగా కలయికలో పాల్గొంటే రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితి ఉన్నావారు లూబ్రికెంట్లు, మాయిశ్చరైజర్లు ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. తరచూ సెక్స్ లో పాల్గొంటే జననేంద్రియాలకు రక్త సరఫరా పరుగుతుంది. దీనివల్ల యోని సమస్యలకు చెక్ పెట్టొచ్చని అంటున్నారు.

శరీరాలు స్పృశించుకోవడం వల్ల సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయని తద్వార ఒత్తిడి ఆందోళనలు తగ్గి, ఆత్మ విశ్వాసం పెరుగుతుందని నిపుణులు వివరిస్తున్నారు. శృంగారం వాయిదా వేస్తూ వస్తే శరీరం స్పందించే విధానంలోనూ మార్పులు వస్తుంటాయని అంటున్నారు. దీన్నే స్కిన్ హాంగర్ గా పేర్కొంటున్నారు. స్కిన్ హాంగర్ వస్తే.. మానసిక సమస్యలతో పాటు యాంగ్జైటీ, దంపతులు ఒకరిపై ఒకరు నమ్మకం కోల్పోవడం.. ఇలా బంధానికే ముప్పు వాటిల్లే సమస్యలు ఎక్కువవుతాయని అంటున్నారు.

సెక్స్ కి దూరంగా ఉండడం వల్ల నిద్రలేమి సమస్య కూడా ఆవహిస్తుందని చెబుతున్నారు. కలయికలో పాల్గొంటే విడుదలయ్యే ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు శరీరంలోని ఒత్తిడిని తగ్గించి సుఖ నిద్రలోకి జారుకునేలా చేస్తాయి. శృంగారానికి ఉంటే ఆ హార్మోన్లు విడుదల కాక.. నిద్రలేమి సమస్యలు వస్తుంటాయి. ఇవే కాకుండా బీపీ, రోగనిరోధక శక్తి క్షీణించడం, గుండె ఆరోగ్యం పాడైపోవడం వంటి దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు, వయసు పెరుగుతుందని సెక్స్ కు దూరంగా ఉండకండి. హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేయండి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications