Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ!
డేటింగ్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు వింతలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న విషయం వింటే మాత్రం మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాఫీ షాప్ లోనో, పబ్ లోనో కలుసుకోవడానికి బదులు నేటి యువత డేటింగ్ కోసం ఏకంగా శ్మశానవాటికల వైపు అడుగులేస్తున్నారు. దీన్నే ఇప్పుడు గ్రేవ్ యార్డ్ డేటింగ్ అని పిలుస్తున్నారు.

ఇప్పటిదాకా డేటింగ్ లో ఎదుటివారిని భయపెట్టే ఫ్లడ్ లైటింగ్, పాతవాళ్లని వదిలేసి కొత్తవాళ్ల కోసం వెతికే మంకీ బారింగ్, బ్రెడ్ క్రంబింగ్ లాంటి ఎన్నో వింత పదాలు విన్నాం. కానీ వాటన్నింటినీ మించిపోయేలా, చనిపోయిన వారి సమాధుల మధ్య ప్రేమను వెతుక్కునే ఈ వింత ట్రెండ్ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. యువత సమాధుల మధ్య కూర్చుని డేటింగ్ చేస్తున్న వీడియోలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.
ఈ ట్రెండ్ అందరికీ నచ్చకపోవచ్చు, కొందరికి పూర్తిగా అర్థరహితంగా అనిపించవచ్చు. కానీ కొందరికి మాత్రం ఇది ఎలాంటి అభ్యంతరాలు లేకుండా వర్కవుట్ అవుతోంది.
అసలు శ్మశానానికే ఎందుకు వెళ్తున్నారు?
దీనికి కారణం ప్రశాంతత, ఏకాంతం,లోతైన అనుబంధంగా చెబుతున్నారు. పబ్ లలో చెవులు పగిలిపోయే మ్యూజిక్ శ్మశానంలో ఉండదు, చుట్టూ వందలాది మంది జనం లేరు, పదే పదే ఫోన్ చూసుకునే తొందర ఉండదు. ఇరుకు ప్రదేశాలు, ఉరుకులు పరుగుల జీవితం నుంచి ఇదొక విరామం.
పాత శిథిలాలు, పచ్చని చెట్ల మధ్య ఉండే ఆ నిశ్శబ్దం ఇద్దరి మధ్య అద్భుతమైన సంభాషణలకు దారితీస్తుందని వారు నమ్ముతున్నారు. పైపైన మాటలు కాకుండా జీవితం, భయాలు, కలల గురించి మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఈ వాతావరణం అనుకూలిస్తుందట.
భయం ఉండదా?
చీకటి పడ్డాక శ్మశానంలో దెయ్యాలు తిరుగుతాయనే భయం మనలో బలంగా నాటుకుపోయింది. అయినా సరే, ఒకరినొకరు అర్థం చేసుకోవాలనే తపన ఆ భయాన్ని జయిస్తోందని కొందరు అంటుంటే.. మరికొందరికి మాత్రం ఇదొక అత్యంత భయానకమైన, కలవరపెట్టే ఆలోచనగా అనిపిస్తోంది. సమాధుల మధ్య కూర్చుని దొంగచాటుగా ముద్దులు పెట్టుకోవడం ఏ రకమైన శృంగారమో వారికే తెలియాలి.



Click it and Unblock the Notifications