Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
విడాకులు పొందిన వ్యక్తితో డేటింగ్ చేయడం వల్ల పొందే లాభాలు
విడాకులు పొందిన వ్యక్తితో డేటింగ్ చేయడం అనేది మహాపాపం కాదు. బంధం విలువ తెలియని ఆకతీయులతో పోలిస్తే డైవర్స్ పొందిన వ్యక్తితో డేటింగ్ చేయడం చాలా బెటర్. వైన్ కి ఎజయ్యే కొద్ది కిక్ పెంచే శక్తి ఎలా పెరుగుతుందో డైవర్స్ పొందిన వ్యక్తితో డేటింగ్ అలాంటి కిక్కే ఇస్తుంది. అవును, ఇది అక్షరాలా నిజం. వయసు పెరిగే కొద్దీ పురుషులలో అందం అలాగే అనుభవం కూడా పెరుగుతుంది. వాళ్ళ ఆలోచనలలో మెచ్యూరిటీ ఉంటుంది. తెలివిగా, పవర్ ఫుల్ గా, స్థిరంగా ఉంటారు. వాళ్ళని మంచి శ్రోతగా కూడా అభివర్ణించవచ్చు.
మీరు డైవర్స్ పొందిన వ్యక్తితో డేటింగ్ చేయాలనుకుంటున్నారా? చక్కగా ప్రొసీడ్ అవ్వండి. ఇటీవలే డైవర్స్ పొందిన వ్యక్తితో డేటింగ్ అనేది గొప్ప విషయం. ఆ వ్యక్తి మీకు ఎంతో ఇంటరెస్టింగ్ గా కనిపిస్తారు. టీనేజ్ డేస్ లో మీ వెంట పడిన అబ్బాయిల కంటే డైవర్స్ తీసుకున్న వ్యక్తి మీకు స్పెషల్ గా కనిపిస్తాడు. డేటింగ్ చేయడానికి డైవర్స్ పొందిన వ్యక్తి వల్ల ఎంత లాభమో ఇప్పుడు తెలుసుకుందాం.

అనుభవశాలి
అనుభవంతోనే ప్రావిణ్యతను సాధిస్తారు. ఇదివరకే అనుభవం ఉండడం వల్ల పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలనే వాటిపై అతనికి అనుభవం ఉంటుంది. ఆ అనుభవంతో మీ అంచనాలను అందుకునేందుకు అతను ప్రయత్నిస్తాడు. ఎటువంటి లక్ష్యంలేని ఆకతాయిలతో పోలిస్తే ఇతను ఎన్నో రెట్లు గొప్పవాడు. గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా ఇతను ప్రాధాన్యతనిస్తాడు.

కొఆపరేట్ చేస్తాడు
మహిళతో ఎలా ప్రవర్తించాలో ఈ పాటికి అతను తెలుసుకునే ఉంటాడు. ఎటువంటి రిలేషన్ షిప్ లేని యువకులకు అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో తెలియదు. గతంలో నున్న అనుభవాల దృష్ట్యా విడాకులు తీసుకున్న వ్యక్తి అమ్మాయిల మనసును అర్థం చేసుకుంటాడు.

వాస్తవిక అంచనాలు
బంధాల నుంచి అవివాహిత కుర్రాళ్ళు ఎన్నో ఆశిస్తారు. అదే విడాకులు తీసుకున్న వ్యక్తికి బంధాలను ఎలా నిలుపుకోవాలో అర్థం అయి ఉంటుంది. అతని అంచనాలు నిజాయితీగా ఉంటాయి. దాంతో, ప్రతి సారి అతనిని ఇంప్రెస్ చేయాలనే ఒత్తిడి మీకు దూరం అవుతుంది.

నిబద్దత కలిగిన వ్యక్తి
సాధారణంగా బంధానికి కట్టుబడి ఉండడాన్ని పురుషులు వ్యతిరేకిస్తారు. అయితే ఇందుకు విడాకులు తీసుకున్న వ్యక్తి మినహాయింపు. గతంలో అతను పెల్లిచేసుకున్నాడన్న అంశం ఇందుకు ఉదాహరణ. భవిష్యత్తులో కూడా పెళ్లి అనే బంధానికి కట్టుబడి ఉంటాడని భావించవచ్చు. అందువల డైవర్స్ తీసుకున్న వ్యక్తితో డేటింగ్ మంచిదే.

శారీరక ఆనందం కోసమే కాదు
మాములుగా అబ్బాయిలు శారీరక సంతోషానికి ఆసక్తి కనబరుస్తారు. కాని డైవర్స్ పొందిన వ్యక్తి అంతకు మించి ఇంకా గొప్పగా ఉంటాడు. కేవలం శారీరక ఆనందం పొందడంతో పాటు బంధాన్ని పటిష్టపరచుకోవాలని అతను ఆరాటపడతాడు. డైవర్స్ వ్యక్తితో డేటింగ్ కు ఇది కూడా ముఖ్యమైన అంశం.

జాగ్రత్తగా ఉంటాడు
యువకులు కొంచెం అల్లరి చిల్లరగా, బాధ్యతారాహిత్యంగా ఉంటారు. వారితో పోలిస్తే విడాకులు తీసుకున్న వ్యక్తి జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. ఇంకొకసారి బంధం విఫలం కాకూడదని ప్రయత్నిస్తాడు. మరొక బ్రేక్ అప్ రాకుండా ఉండేందుకు శయశక్తులా కృషి చేస్తాడు. ఈ కారణం కూడా విడాకులు తీసుకున్న వ్యక్తితో డేటింగ్ కు ప్రాధాన్యతనిస్తుంది.

ద్రోహం చేయడు
విడాకులు తీసుకున్న వ్యక్తి ఇప్పటికే బ్రేక్ అప్ లోనున్న బాధను అనుభవించినవాడే కాబట్టి బ్రేక్ అప్ లో ఉన్న బాధను మళ్ళీ పొందడానికి ఇష్టపడదు. కాబట్టి, కొత్త బంధాన్ని పటిష్టపరచుకోవాలనే ఆలోచిస్తాడు. బంధానికి అమితంగా విలువనిస్తాడు. మోసం చేయడు.

స్థిరంగా
విడాకులు తీసుకున్న వ్యక్తి అర్థికంగా, ఎమోషనల్ గా స్థిరంగా ఉండడం నేర్చుకుంటాడు. స్థిరత్వమనే అంశాన్ని డేటింగ్ కు ముందు అమ్మాయిలు ఆలోచిస్తారు. డైవర్స్ చెందిన వ్యక్తితో డేటింగ్ చేయబోతున్నప్పుడు అతని స్థిరత్వాన్ని అలాగే ప్రొఫెషనల్ గా అతని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవడంతో పాటు బ్యాంక్ బ్యాలన్స్ లను కూడా అమ్మాయిలు గమనిస్తారు. ఆల్రెడీ మిడిల్ ఏజ్ లో ఉండడం వల్ల ఆ వ్యక్తి అన్ని విషయాలలోను స్థిరంగానుంటాడని భావించవచ్చు.



Click it and Unblock the Notifications