Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఒక మంచి బాయ్ ఫ్రెండ్ గా ఉండాలంటే ఏమి చేయాలి
పురుషులు తమ ప్రియురాలితో ఉన్న సమయం చిరస్మనీయంగా మార్చుటలో కొంత మంది విజయం సాధిస్తారు మరికొంత మంది విఫలం అవుతుంటారు. విజయం పొందిన వారు చీకటి తెర వెనుక దాగిపోతే, పరాజితులు మాత్రం ఎలాంటి ధ్యేయం లేకుండా చుట్టూ ఉన్న ప్రపంచంలో సంచరిస్తున్నారు. పరాజయం పొందిన వారు విజయం పొందుటకు మరియు మంచి ప్రేమికుడు అనిపించుకొనుటకు ఇక్కడ కొన్ని సూచనలు తెలుపబడ్డాయి.

నిజాయితిగా ఉండండి
పురణకాలంలో ఒక సామెత ఉండేది ''నిజాయితీ ఉత్తమమైన విధానం'', కానీ నిజానికి పురుషులు ఈ నియమాన్ని పాటించరు కారణం చాలా మంది పురుషులు బహుభార్యత్వం పైపు మొగ్గు చూపటం. కానీ మీరు మంచి ప్రేమికుడు అనిపించుకోవాలి అనుకుంటే మాత్రం నిజాయితిగా ఉంటూ మరియు అన్ని విషయాలను మీ ప్రియురాలితో చర్చిస్తూ ఉండాలి. మీరు నిజంగా ఆమెను ప్రేమిస్తే అబద్దాలు చెప్పకుండా, తనతో తోడుగా ఉండండి. మిమ్మల్ని ప్రేమించే అమ్మాయి పట్ల నిజాయితిగా వ్యవహరించటం వలన చాలా ఆనందానికి గురవుతుంటారు, అంతేకాకుండా తను కూడా మీ పట్ల అనుకువగా మేదులుకుంటుంది.

ఆమెను గౌరవించండి
గొప్ప వ్యక్తి (పెద్దమనిషి, మర్యాదస్తుడు) మాత్రమె తను ప్రేమించే అమ్మాయిని స్త్రీగా పూజిస్తాడు, మీరు అలా గౌరవిస్తున్నారా? మీ ప్రేమించే అమ్మాయిని స్త్రీగా గౌరవించటం చాలా ముఖ్యం. ఈ విధంగా తనకంటూ ఒక ప్రత్యేకతను ఇవ్వటం వలన ఆమె మిమ్మల్ని పూర్తిగా నమ్మటమే కాకుండా, ఆమెను మీ సొంతంగా భావిస్తుంది. కానీ మీరు సాధారణంగా ప్రవర్తించే విధానం, ఆమెకు మీరు కల్పించే గౌరవాలను బట్టి మీపై తన ప్రేమ ఉంటుంది. చాలా మంది అమ్మాయిని ఆకర్షించెంత వరకు మాత్రమె నటిస్తారు, కానీ ఒక్కసారి ఆమె అతడిని ఇష్టపడిన తరువాత ఆమె పట్ల ఉన్న శ్రద్ద, జాగ్రత్తల గురించి మరచిపోతారు. ఇలా చేయటం వలన అమ్మాయిలు మానసికంగా చాలా భాధకు గురవుతుంది.

ఆధిపత్యం ప్రదర్శించకండి
అవును నిజమే, మనము ఉంటున్నది 'పితృస్వామ్య సామ్రాజ్యమే' కానీ వాటిలో మనం ఒక పాత్ర అవకూడదు. దీనికి బదులుగా మిమ్మల్ని నమ్మి వచ్చిన స్త్రీ పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి మరియు ఆమె పట్ల ఆధిపత్యాన్ని ప్రదర్శించకండి. మీ ప్రియురాలు కూడా మీలా మనిషే అన్న సత్యాన్ని గ్రహించండి, మీలానే తనకు కూడా స్వతహాగా ఆలోచించే హక్కు, నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది అని మరచిపోకండి. తనపై మీకు ఎలాంటి హక్కు ఉందో, తన పై మీరు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారో, అధేవిధంగా తను కూడా అవే హక్కులను కలిగి ఉందన్న వాస్తవాన్ని గ్రహించండి. చాలా మంది పురుషులు వారి ప్రియురాలి పట్ల చాలా తప్పులను చేస్తూ, వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ప్రవర్తనల వలన ఇద్దరి మధ్యలో అభిప్రేయ భేదాలు కలిగి, ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. కావున మీ ప్రియిరాలిని గౌరవిస్తూ ఆమె నిర్ణయాలను గౌరవిస్తూ, ఆమె పై ఆధిపత్యానికి పూనుకోకండి.

సమర్దించండి
మీ ప్రియురాలు మీలో సగభాగం, కావున మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని గౌరవిస్తూ, ఆమెకు తగిన మద్దతునివ్వండి. ఇలా ఆమెకు తగిన గౌరవాన్ని ఇస్తూ, తను చేసే పనులలో సహాయాన్ని అందిస్తూ, మంచి వ్యక్తిగా మెదులుకోండి. మీ ప్రేమను ఇద్దరి మధ్య సాగే చిలిపి పనుల మేరకు మాత్రమె కాకుండా, తను చేసే ప్రతి పనిలో ఆమెకు కావలసిన స్వేచ్చతో పాటూ, మీ సహాయాన్ని అందించండి, దీని వలన ఆమె మీపై అమీతమైన ప్రేమను పెంచుకొని మీతో చనువుగా, అనువుగా మసులుకుంటుంది. ఆమె చేసే ప్రయత్నంలో ప్రతికూల అంశాలను గమనించి, వాటి నుండి తను భయట పడుటకు తగిన సహాయం చేసి ఉన్నత స్థాయిలో నిలబెట్టండి. అంతేకాకుండా ఈ అంశాలను ప్రతిసారి ఆమె ముందు ప్రస్తావించి భాధకు గురి చేయకుండా తగిన విధానంలో ఆప్యాయంగా తనతో మాట్లాడండి. ఈ విధంగా తన పట్ల జాగ్రత్తలను తీసుకుంటూ తనకు తగిన సహాయం అందించటం వలన తను మిమ్మల్ని అమితంగా ప్రేస్తుంది, ఇద్దరి మధ్య సంబంధాలు కూడా మెరుగుపడతాయి.

ఆమె చెప్పేది వినండి
సాధారణంగా పురుషులు వారికి అంతా తెలుసు అని ఆలోచిస్తూ, వారి కోణంలో మాత్రమె ఆలోచించి ప్రియురాలు ఇచ్చే సలహాలను లెక్కచేయరు. కానీ ఎక్కువ శాతం ఇవి తప్పుదోవ పట్టే అవకాశం ఉంది, మీ మధ్య సంబంధం మెరుగుపడాలి అనుకుంటే తను చెప్పేది కూడా విని ఆ కోణంలో ఆలోచించండి. వారి ఆలోచనలను విని, వారికి తగిన గౌరవం ఇవ్వటం వలన మీ మధ్య ఉన్న ప్రేమ ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. ఆమె చెప్పేది కూడా విని, మీ నిర్ణయాన్ని కూడా ఆమెతో చర్చించి చివరకి తగిన నిర్ణయాన్ని ఎంచుకోవటం వలన మీ సమస్యలు మాత్రమె కాకుండా మీ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు కూడా తోలగిపోతాయి.
చివరగా మేము మీకిచ్చే మంచి ఆలోచనల వలన మీ మధ్య అనుబంధం మెరుగుపరుస్తాయి అంతే కానీ మీ మధ్య ఇబ్బందులను కలిగించేవిగా ఉండవు. కానీ మీ ప్రియురాలి నిర్ణయాలను సంతోషంగా 'ఓకే' చెపుతూ తప్పులు ఉన్న వాటికి సమాధానంగా సర్ది చెప్పండి.



Click it and Unblock the Notifications