Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
డేటింగ్ చేసే వ్యక్తికి, పెళ్లి చేసుకునే వ్యక్తికి ఉండే వ్యత్యాసం !
సంబంధాలు అనేవి అవతలవారి మీద మనం చూపించే ప్రేమ, జాగ్రతల మీద ఆధారపడి ఉంటాయి. మీరు కలలుకన్న మనిషితో ప్రేమలో ఉన్నప్పుడు, మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఒక విషయంపై అవగాహన ఉండాలి. మీరు అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పెళ్లి తర్వాత కూడా అన్నీ ఒకేలా ఉండవని గుర్తుంచుకోవాలి.
సంబంధాలు అనేవి ఒక చిన్న కేకు ముక్క వంటివి కాని పెళ్లి విషయానికి వస్తే అది చాల భిన్నమైనది. చాలా మంది దంపతులు పెళ్ళైన తర్వాత తమ జీవిత భాగస్వామిలో వచ్చే మార్పులను గమనించారు. ఈ మార్పులు తమ సమైఖ్యతను పెంపొందించవచ్చు లేదా తరిగించవచ్చు.

అనుభవజ్ఞుల ప్రకారం,పెళ్లి అనేది ఆడ, మగవారిలో చాలా మార్పులను తీసుకొస్తుంది. వారు జీవితం పట్ల మరింత పరిణితిగా, సముచితంగా ఉండడానికి ఇష్టపడతారు. అదే విధంగా త్యాగాలు, తప్పులు కూడా చేస్తుంటారు. కాబట్టి మహిళలూ.. మీరు మీ పెళ్లి తర్వాత మీ భాగస్వామిలో కొత్తగా వచ్చిన మార్పులు గమనించినట్లైతే, మీకోసం ఒక వార్త.
మీరు పెళ్లాడిన వ్యక్తి మీరు డేట్ చేసే వ్యక్తికి తేడా ఎలా ఉంటాయో తెలుసుకోండి. ఇవి మీకు చాలా సరదాగా అనిపించవచ్చు. కానిీ రోజు చివర, ఇవి దంపతుల జీవితంలో చాలా మార్పును తెస్తాయి. కాబట్టి ఒకసారి చదవండి:

మీరు డేట్ చేసే అబ్బాయి జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తాడు కాని మీరు పెళ్లాడిన వ్యక్తి మాత్రం భవిష్యత్తు ప్రణాళికలు వేస్తాడు. మహిళలు మీకు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఎదురుకాలేదా?
అలాగే,మీరు డేటింగ్ చేస్తున్న వ్యక్తి మీ గురించి మీతో జీవితాన్ని పంచుకోవడం గురించి గట్టిగా ఉన్నట్లయితే, ఖచ్చితంగా అతను మీ భాగస్వామి అవుతాడు. మీరు డేట్ చేసే అబ్బాయి పిల్లతనంగా ఉంటాడు కాని మీరు పెళ్లాడిన వ్యక్తి పరిణితి చెంది ఉంటాడు.

పెళ్లి విషయానికి వచిన్నప్పుడు ఆడవాళ్లు పిల్లతనంగా అదే సమయంలో తనంతట తానుగా ఆలోచించగలదు. మిమ్మల్ని చూసుకోగల పరిణితి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. పిల్లతనంగా ఉండే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అది మిమ్మల్ని కేవలం ఇంతటి పెద్ద ప్రపంచంలో ఎలా బతకాలి అనే విషయంలో అవగాహన లేకుండా చేస్తుంది.

మీరు డేట్ చేసే వ్యక్తి తనకి అన్నీతెలుసు అని అనుకుంటాడు. కాని మీరు పెళ్లాడే వ్యక్తి మాత్రం రోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలనుకుంటాడు. పెళ్లి చేసుకున్న వ్యక్తిలో డేట్ చేసే వ్యక్తిలో ఇది మీరు గమనించదగిన వ్యత్యాసం.

మీరు డేట్ చేసే వ్యక్తి కేవలం మాట్లాడతాడు కాని మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి ఒక మంచి శ్రోత. పెళ్లి కాకముందు మంచి శ్రోతలుగా ఉండే వ్యక్తులు ఈ ప్రపంచంలో చాలా తక్కువ. మీరు కనక అలాంటి శ్రోతతో డేట్ చేస్తున్నట్లయితే, అది పెళ్లి దాక వస్తే మీరు నిజంగా చాలా అదృష్టవంతులు.

మీరు డేట్ చేసే వ్యక్తి మీరు అతనికోసం అన్ని చేయాలని కోరుకుంటాడు. కానీ మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి మీకోసం అన్నీ చేయాలనుకుంటాడు. మీరు డేట్ చేసే వ్యక్తికి మీరు పెళ్లాడిన వ్యక్తికి మధ్య ఇది ఒక తేడా.పెళ్లికి ముందు మగవాళ్లు వెన్నుమూక లేని వారిలా కనిపిస్తారు కాని ఉంగరం వేలుకి తొడిగిన మరుక్షణం తమంట తాముగా భాధ్యతలు స్వీకరిస్తారు.



Click it and Unblock the Notifications
