Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
ముత్యం లాంటి పురుషుడు మీకు దొరకడం మీ అదృష్టము
ప్రేమలో ఉన్నవారికెవరికైనా ఆనందంగానే ఉంటుంది. ఈ ఆనందం చిరకాలం ఉంటుందనుకుంటారు. ఒక్కోసారి మనం అసలు ఈ బంధాన్ని కొనసాగించడం అవసరమా అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంటుంది. మీరు కనుక మీ బాయ్‌ఫ్రెండ్ విషయంలో కన్‌ఫ్యూజ్ అయ్యి ఆ బంధాన్ని తెంచుకుందాం అనుకుంటోంటే కనుక ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.
ఈ రోజు మేము ఈ ఆర్టికిల్ ద్వారా ఎటువంటి పురుషులతో మీరు బంధాన్నికొనసాగించవచ్చో వారిలో కనపడే కొన్ని లక్షణాల ద్వారా ఎలా కనుక్కోవచ్చో వివరించాము. ఈ లక్షణాలు కనుక కనిపిస్తే ఖచ్చితంగా అతను వదులుకోవాల్సినవాడు మాత్రం కాదు. ఈ టిప్స్ చదివితే కనుక మీ బాయ్‌ఫ్రెండ్ విషయంలో మీకున్న సందేహాలు కూడా క్లియర్ అయిపోతాయి. స్త్రీలకి అవసరమైనప్పుడు నేనున్నానని నిలిచి ఆదుకున్న పురుషులని సాధారణంగా స్త్రీలు నిర్లక్ష్యం చేస్తారు.
వారికి మీపై ఉన్న దయనీ, శ్రద్ధని పట్టించుకోకుండా వారిని కూడా కేవలం స్నేహితుల జాబితాలో చేర్చడం వల్ల మీరు జీవితంలో మంచి పురుషులని కోల్పోయే ప్రమాదం ఉంది. అందువల్ల అసలు ఎటువంటి పురుషులు మీకు తారసపడితే వదులుకోకూడదో రత్నాల్లంటి పురుషుల లక్షణాలేమిటో చూద్దాము.

మిమ్మల్ని ఇంటిదాక జాగ్రత్తగా ఇంటి దగ్గర నిలబెట్టేవాడు:
ఇలాంటి మగవారు ఎప్పుడైనా సరే మిమ్మల్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర వదిలెపెడతారు. అతను మీ క్షేమాన్ని, భద్రతనీ ఆకాంక్షించి ఇలా చేస్తుండచ్చు లేదా మీతో కాసేపు సమయం గడపడానికి కూడా ఇలా చేస్తుండవచ్చు.

స్త్రీల నాన్ స్టాప్ మాటలని జాగ్రత్తగా వినేవాడు:
ఆడవాళ్ళకి అలా మాట్లాడుతూ ఉండటమే ఇష్టం. వారి మాటల్లో గాసిప్స్, నాటకీయ సంభాషణలూ అలా దొర్లుతూనే ఉంటాయి.తాము మాట్లాడేటప్పుడు తమ భాగస్వామి జాగ్రత్తగా వినాలని కూడా వారు ఆశిస్తారు.వారి మాటలని వినాలే గానీ ఆ మాటలని బట్టి వారిని అంచనా వేసేవాళ్ళంటే స్త్రీలకి నచ్చదు.

ప్రతీరోజూ మిమ్మల్ని ఫోనులో పలకరించేవాడు:
రోజంతా మీరు అతనితో గడిపినా సరే మీరు ఇంట్లోకి అడుగుపెట్టగానే మీకు కాల్ చేసి మాట్లాడేవాళ్ళుంటే ఎంత బాగుంటుంది??

కమిట్మెంట్ అంటే భయపడని వాళ్ళు:
చాలా మంది మగవారు తమ కి తగ్గ అమ్మాయి దొరకగానే ఒక బంధానికి కమిట్ అవ్వడానికి మానసికంగా తయారయ్యే ఉంటారు. అంత వరకూ మాత్రమే వారికి కమిట్మెంట్ అంటే కొద్దిగా సందేహం.మీతో తన భవిష్యత్తుని పంచుకోవడానికి ఇష్టపడేవాడు, బంధానికి విలివనిచ్చేవాడుంటే కనుక అతన్ని అస్సలు వదులుకోవద్దు.

స్త్రీ శక్తిని గౌరవించేవాడు:
స్త్రీ సాధికారికతని గౌరవించే మగవారికి స్త్రీలంటే ఎనలేని గౌరవం.ఇలాంటి వారిని ఎంచుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి కనురెప్ప వేసిననంత సమయం కూడా తీసుకోవద్దు.

నమ్మకస్తుడు:
అత్యంత నమ్మకస్తులు సాధారణంగా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు. కానీ అలాంటివాడు భర్తగా లభిస్తే అదొక పెద్ద వరం.ఎందుకంటే మీ కష్టసుఖాల్లో ఇలాంటివారెప్పుడూ మీకు తోడుగా ఉంటారు.

మీ మీద మీకు నమ్మకం కలిగించేవాడు:
ఇలాంటి వ్యక్తులు మీ మీద మీకు నమ్మకం కలిగించి తద్వారా అధ్భుతాలు సృష్టించగలరు.మీ మీద మీకు నమ్మకం కలగడానికి వీరు చాలా సహాయపడతారు. అటువంటి వ్యక్తిని కనుక మీరు వదులుకుంటే మీరు జీవితంలో గొప్ప వ్యక్తిని కోల్పోయినట్లే.



Click it and Unblock the Notifications