Latest Updates
-
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా?
మీ రిలేషన్ షిప్ లో స్త్రీ ని అర్ధం చేసుకోవడం ఎలా...
పురుషులారా, మీ జీవితంలో స్త్రీలను అర్ధం చేసుకోలేక పోతున్నారా? అయితే, బాధపడకండి, ఎందుకంటే నూటికి తొంభై మంది పురుషులు స్త్రీలను అర్ధం చేసుకోలేరు. పరిశోధనల్లో తేలిందేమంటే, స్త్రీలకు పురుషులకన్నా మెరుగైన ఆఘ్రాణ, దృశ్య నైపుణ్యాలు వుంటాయి, అందువల్లే వారికి వివరాల మీద దృష్టి వుంటుంది. భావోద్వేగాల విషయంలో కూడా వారికి చాలా నైపుణ్యాలు వుంటాయి. భావోద్వేగాలతో ముడిపడిన స్మృతులను వారు తేలిగ్గా గుర్తుకు తెచ్చుకోగలుగుతారు. అందువల్ల, ఆవిడతో ఏదైనా గొడవ జరిగినప్పుడు మీరు ఏమంటున్నారో అన్నదాని గురించి జాగ్రత్త పదండి, ఎందుకంటే ఆవిడ దానిని ఎప్పటికీ మరచిపోదు.
ఒక స్త్రీని అర్ధం చేసుకోవాలంటే, అందరు స్త్రీలు ఒకేలా ఉండరని, వేర్వేరుగా ఉంటారని ముందుగా మీరు తెలుసుకోవాలి. స్త్రీ కి సమాజంలో వున్న స్థానాన్ని, ఆవిడ సమాజంలో ఎదుర్కొనే ఒత్తిడులను గుర్తించండి. ఆమెను బాగా అర్ధం చేసుకోవాలంటే ఆవిడను మీరు బాగా గమనిస్తూ ఉండండం చాలా ముఖ్యమైన పని. మరీ చాటుగా కాకుండా, ఆవిడ చేసే ప్రతి పనినీ గమనిన్చాలన్న ఆసక్తి వుంటే, మీ జీవిత భాగస్వామిని మీరు బాగా అర్ధం చేసుకోవచ్చు. కాబట్టి, ఈరోజు, ఒక స్త్రీని మరింత బాగా అర్ధం చేసుకోవడానికి అవసరమయ్యే కొన్ని కీలక విషయాలు మీకు బోధపరుస్తాము.

శారీరిక పరిభాష :
స్త్రీలు సాధారణంగా వారి ఆలోచనలు, అభిప్రాయాలు శారీరిక పరిభాష ద్వారానే తెలియచేస్తారు కనుక స్త్రీలోని శారీరిక హావభావాలను గమనించడం తప్పనిసరి.

మూడ్ లో మార్పులు :
ఒక స్త్రీ బాగా చికాకుగా, విసుగ్గా వుంటే ఆవిడ PMS మీద వుందని అనుకోవాల్సిన పని లేదు. కోపం, విసుగు, చికాకు లాంటివి హార్మోన్లలోని అసమతౌల్యం వల్లనే వస్తుందని పురుషులు భావిస్తుంటారు. ఇంత వివరంగా ఆలోచి0చనక్కర్లేదు, ఎందుకంటే మూడ్ లలో మార్పులకు కారణం మీరు కూడా కావచ్చు.

ఆవిడ స్నేహితుల సాహచర్యం :
"మీ స్నేహితుల వల్ల మీరు ఏమిటో తెలుసుకోవచ్చు" అనే నానుడి ఎప్పటికీ పాత బడదు. ఆవిడ మంచి స్నేహితుల సాహచర్యంలో వుంటే, ఆమే వ్యక్తిత్వం కూడా సహజంగా మంచిదే.

ఆవిడ చెప్పేది నిజంగా వినడం ద్వారా :
ఆవిడ ఏదైనా చెప్తున్నప్పుడు కేవలం వినడం కాకుండా, చెప్పే విషయం మీద ధ్యాస వుంచి, ఎలాంటి పదాలు ఆవిడ నోటి నుంచి వస్తున్నాయో గమనిస్తూ వినండి. ఇది ఒక స్త్రీని బాగా అర్ధం చేసుకోవడానికి ఉత్తమమైన మార్గం.

చిన్న చిన్న సైగలను గమనించడం ద్వారా :
సైగల లాంటి చిన్న చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే అవి స్త్రీలకు చాలా ముఖ్యం. మీరు స్త్రీని నిజంగా అర్ధం చేసుకోవాలంటే కొంచెం పొగిడి ఎలా స్పందిస్తుందో చూడండి. అదే సమయంలో ఒక తేలిక పాటి విమర్శ కూడా వదిలి ఆవిడ ప్రవర్తన ఎలా మారుతుందో గమనించండి. చాలా మంది స్త్రీలు విమర్శలను స్వాగతించరు.

ఆవిడతో సంభాషణ ఎలా వుంటుంది :
ఒక స్త్రీని బాగా అర్ధం చేసుకోవడానికి ఆమెతో సంభాషించండి. ఒక ఆసక్తికరమైన అంశాన్ని తీసుకుని చర్చించండి. ఆవిడ మనసులో ఏముందో వినండి, త్వరలోనే ఆవిడ గురించి మొత్తం తెలుస్తు0ది.

ఇతరులతో ఆమె ఎలా వ్యవహరిస్తారో గమన్చించండి.
ఇతర స్త్రీలతో వున్నప్పుడు ఆమె మీద ఒక కన్నేసి వుంచండి, కానీ అది ఆమెకు తెలియనివ్వకండి. ఇలా చేస్తే, మీరు ఆమెను, ఆమె ఇతరులతో ఎలా మెలుగుతారన్న విషయాన్ని తెలుసుకోగలుగుతారు.



Click it and Unblock the Notifications