Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
రాధాకృష్ణల నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రేమ పాఠాలు
రాధా కృష్ణులు. ఈ పేర్లు పలికితేనే.. ప్రేమ పుడుతుంది. అంత ప్రేమగా ఉంటాయి.. ఈ రెండు పేర్లు. కానీ.. ఈ రాధాకృష్ణ అనేవి రెండు పేర్లు అన్న విషయం మరిచిపోయేంతగా కలిసిపోతాయి. అందుకేనేమో.. ఈ ఇద్దరినీ.. ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. అందుకే ఈ రెండు పేర్లను ఒకేసారి పలకడం అలవాటుగా మారింది.
రాధా లేకపోయినా, కృష్ణ లేకపోయినా.. అది అసంపూర్ణంగా ఉంటుంది. అందుకే ఈ రెండు పేర్లు స్వచ్ఛమైన ప్రేమకి నిదర్శనంగా చెప్పవచ్చు. కాబట్టి రాధా కృష్ణుల నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రేమపాఠాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అమ్మనాన్నల ప్రేమ
కృష్ణుడు దేవకి, వాసుదేవులకు పుట్టాడు. కానీ.. పెరిగి పెద్దవాడు అయింది మాత్రం యశోద, నంద దగ్గరే. యశోద, నంద అంటే.. శ్రీకృష్ణుడికి ఎనలేని ప్రేమ. వాళ్ల బాధ్యతలను తాను నెరవేర్చాడు. ఇది శ్రీకృష్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన ప్రేమపాఠం ఇది.

భాగస్వామి
కృష్ణుడు ఎప్పుడైతే.. ఫ్లూట్ వాయిస్తాడో.. అప్పుడు రాధా పరవశమై.. కృష్ణుడి చుట్టూ డ్యాన్స్ చేస్తుంది. మీరు మీ పార్ట్ నర్ ని ప్రేమిస్తే.. రాధా మాదిరిగా వాళ్ల పట్ల భక్తి చూపించాలి.

వదిలిపెట్టకూడదు
మనం ఎక్కువగా ప్రేమించే వాటిని ఎప్పటికీ వదిలిపెట్టకూడదని శ్రీకృష్ణుడి ద్వారా నేర్చుకోవాలి. ఎందుకంటే.. కృష్ణుడికి ఫ్లూట్ అంటే చాలా ప్రేమ. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ దాన్ని వదిలిపెట్టలేదు. ఆకరికి యుద్ధంలో కూడా కృష్ణుడితో ఫ్లూట్ ఉంది. మన అలవాట్లు, ఇష్టాలు మన ఎలాంటి సందర్భంలోనైనా ఊపిరిపోస్తాయని నమ్ముతాడు శ్రీకృష్ణుడు.

ప్రేమ, తీర్పు
శ్రీకృష్ణుడు ప్రేమ, తీర్పుల స్వరూపం. ఎప్పుడు న్యాయంవైపే ఉండేవాడు. మహాభారత యుద్ధంలో కూడా.. శ్రీకృష్ణుడు పాండవులకే సపోర్ట్ చేశాడు. ఎందుకంటే.. న్యాయం పాండవులవైపే ఉందనే వాళ్లకు సహాయం చేశాడు.

బేధభావం చూపించడు
శ్రీకృష్ణుడు గోకులలో ఉన్నప్పుడు ఆవులు, గోపికలతో గడుపుతాడు. మధురలో ఉన్నప్పుడు ఉధవ, అంకుర అతని స్నేహితులు. ఇలా ఎక్కడ ఉంటే.. అక్కడి వాతావరణానికి తగ్గట్టు ఉంటాడు. గొప్ప, పేద అన్న బేధభావాలు చూపించడు.

ఎప్పుడూ నవ్వుతూ
శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అప్పుడు పుట్టిన కృష్ణుడిని కంసుడు.. రకరకాలుగా హానిచేశాడు. కానీ.. శ్రీకృష్ణుడు మాత్రం ఎప్పుడూ.. నవ్వుతూ, ఎలాంటి సందర్భంలోనైనా ఆనందంగా కనిపిస్తాడు.

మాతృభూమిపై ప్రేమ
తాను పుట్టిపెరిగిన మాతృభూమిపై ఎనలేని ప్రేమ చూపించేవాడు శ్రీకృష్ణుడు.

గురువు పట్ల ప్రేమ
విష్ణుడు, కృష్ణుడు తమ గురువుల పట్ల చాలా గౌరవప్రదంగా ఉండేవాళ్లు. ఎప్పుడు కలిసినా, ఎక్కడ ఉన్నా.. తమ గురువులను అమితంగా గౌరవించేవాళ్లు.

గౌరవం
శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కరిపట్ల గౌరవంగా ఉండేవాడు. పెద్దవాళ్లంటే చాలా గౌరవం. కృష్ణుడు నమ్మే సూత్రం.. మనం ఇతరులను గౌరవిస్తే.. ఇతరులు మనల్ని గౌరవిస్తారని నమ్ముతాడు.

స్నేహం
శ్రీకృష్ణుడు స్నేహానికి చాలా విలువనిచ్చేవాడు. హోదాతో సంబంధం లేకుండా.. స్నేహానికి విలువనిస్తాడు.

ఔదార్యానికి మారుపేరు
శ్రీకృష్ణుడి స్నేహితుడు సుదమ భోజనం ఇవ్వగా.. కృష్ణుడు ఆనందంగా అంగీకరించాడు. అయితే సూదముని భార్య బిక్షమెత్తి ఈ ఆహారాన్ని తీసుకువచ్చింది. కానీ.. కృష్ణుడు ఆనందంగా ఆస్వాదించాడు. అలాగే.. సూదముని ఇంటికి కృష్ణుడు వెళ్లి.. ఇంటినంతటినీ బంగారంగా మార్చేశాడు.

సోదరునిపై ప్రేమ
తన సోదరుడు బలరాముడిపై శ్రీకృష్ణుడు ఎనలేని ప్రేమ చూపించేవాడు. చిన్నప్పుడు చాలా ప్రేమానురాగాలతో ఈ ఇద్దరు అన్నదమ్ములు పెరిగారు.



Click it and Unblock the Notifications