Latest Updates
-
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా?
మీ అమ్మాయికి మీరు నేర్పించే ప్రేమ పాఠాలు
మీ అమ్మాయి ఎదుగుతున్నకొద్దీ పేరెంటింగ్ క్లిష్టతరమవుతుంటుంది.ఆమె ఎదిగే కొద్దీ కొత్త విషయాలు నేర్చుకుంటూ, సరికొత్త విషయాలని అన్వేషిస్తూ తాను నేర్చుకున్న పాఠాలతో ముందుకు సాగుతూ ఎదగాలి. సరిగ్గా ఇప్పుడే ఆమె తన భావాలాతో సంఘర్షణలో పడుతూ కొత్త వ్యక్తులతో ప్రేమలో పడే అవకాశం ఉంది.
ఒక తల్లిగా మీరు ఆమె తన భాగస్వామిని వెతుక్కునేటప్పుడు సహాయ పడచ్చు.మీరు ఆమె జీవితాన్ని జీవించకపోయినా ఆమెకి దారి మాత్రం చూపవచ్చు.తనకి తగని వ్యక్తి ని ఆమె ప్రేమించకూడదని అనిపిస్తుంది కదా.మీ అమ్మాయిని ని ఒక గొప్ప మనిషి గా పెంచి ఆమెకి తనని తాను గౌరవించుకోవడం నేర్పి ఉంటారు.ఆమె ని మరొకరు పూర్తిగా మార్చెయ్యకూడని అనిపిస్తుంది కదా. తల్లిగా ఆమె భావాలతో మీరే కనెక్ట్ అవ్వగలిగి ఆమెని సరైన దారిలో నడిపించగలరు.
ఇక ముఖ్యమైన ప్రేమ పాఠాలు ఏంటో చూద్దామా...

గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం
గౌరవం ఇచ్చి పుచ్చుకోవడమంటే ఎవరినో గౌరవించడమో వారి గురించి కేర్ తీసుకోవడమో కాదు,మిమ్మల్ని మీరు గౌరవించుకోవడమే.తనని తాను గౌరవించుకోవడం మీరు మీ అమ్మాయికి నేర్పాలి.ఆమె తనని తాను ప్రేమించుకున్నప్పుడే ఇతరులతో ప్రేమించబడుతుంది.తన అవసరాలని గౌరవించుకుంటూ తనని తాను ప్రేమించాలని చెప్పండి.

నీవు నీలాగే ఉండు
“నువ్వు నీలో ఏ విషయాన్నీ మార్చుకొనక్కర్లేదు” ఇది ఒక తల్లిగా మీరు మీ అమ్మాయికి నేర్పించాలి.తనని మారమని డిమాండ్ చేసేవాళ్ళు లేదా తను ప్రేమకి అర్హురాలు కాదు అనేవాళ్ళకి ఆమె జీవితం లోకి వచ్చే అర్హత లేదని గుర్తించమని చెప్పండి.

సెక్స్ ఎడ్యుకేషన్
“సెక్స్”గురించి మీరు మీ అమ్మాయితో మాట్లాడటానికి ఇష్టపడకపోవచ్చు. కానీ తన శరీరం లో వస్తున్న మార్పులని వివరిస్తూ ,సెక్స్ గురించి పాజిటివ్ గా పరిచయం చేస్తే తగిన సమయం వచ్చినప్పుడు ఆమె ఆనందాన్ని పొందగలుగుతుంది.

తన మీద నమ్మకం కలిగించడం
ఆమెకి తన మీద తనకి బలమైన నమ్మకం ఉంచుకోవడం నేర్పండి.ఒక్కోసారి తనకి ఇది సరిగ్గా లేదనో లేదా ఏదో మిస్స్ అవుతున్నామనో అనిపించే చిన్న చిన్న విషయాలే బాధ కలిగించచ్చు. కానీ తన మనసు తప్పు అని హెచ్చరిస్తే అంతటితో వదిలెయ్యకుండా అసలు పొరపాటు ఎక్కడ జరిగిందో అర్ధం చేసుకుని, ఆ సమస్య ని పరిష్కరించుకోమని చెప్పండి.ఒక బంధం లో ఇలాంటి చిన్న విషయాలని నిర్లక్ష్యం చేస్తుంటే ఆ బంధాన్ని బలవంతం గా ఈడుస్తున్నట్లే.

వెంటబడద్దు
తగిన సమయం వచ్చినప్పుడు ప్రేమ ఆమె ముంగిట వాలుతుందనీ, దానికోసం అర్రులు చాచి వెతక్కొద్దని చెప్పండి.ఈ పాఠం నేర్పించడం వల్ల ఆమె ని విఫల ప్రేమల నుండి కాపాడినవారవుతారు.

లిట్మస్ టెస్టులొద్దు
నమ్మకం మీదే బంధం ఏర్పడాలి ఒక బంధాన్ని నమ్మకం అనే పున్నాది మీద నిర్మించుకోవాలని ఆమెకి చెప్పండి.ఆమె ఒక బంధం లో కొనసాగాలంటే తనని తాను నమ్మడంతో పాటు అవతలి వ్యక్తిని కూడా పూర్తిగా నమ్మాలి.భాగస్వామి ప్రేమని పరీక్షించడం వల్ల ఏమీ రాదనీ,నమ్మకం అనే సహజమైన పునాది మీదే బంధం మొదలవ్వాలని చెప్పండి.



Click it and Unblock the Notifications