Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఇంటర్నెట్ లో క్రేజ్ క్రియేట్ చేస్తున్న లవ్ ట్రెండ్స్,
ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ మయమైంది. యూత్ అంతా సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఎక్కువ అప్ డేట్ అవుతుండటంతో.. వీటికి పాపులారిటీ పెరుగుతోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ ని వేదికగా మార్చుకుంటున్నారు. వాళ్ల జీవితంలో జరిగిన ఏ చిన్న సందర్బాన్నైనా, విషయాన్నైనా.. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఎక్స్ ప్రెస్ చేయడం అలవాటుగా మారింది.

ఇక రిలేషన్ షిప్ స్టేటస్ విషయంలో.. చాలా ఆశ్చర్యకరంగా వ్యవహరిస్తోంది యూత్. వాళ్ల పర్సనల్ లైఫ్ ని పబ్లిక్ గా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇంటర్నెట్ లో క్రేజీగా మారిన లవ్ ట్రెండ్స్ గురించి.. ఇప్పుడు తెలుసుకుందాం. అవి ఎలా ఉంటాయంటే.. మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

కిస్సింగ్ సెల్ఫీ
చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదూ. గాల్ ఫ్రెండ్ ని కిస్ చేస్తూ.. సెల్ఫీలు తీసుకోవడం, వాటిని మళ్లీ ఫేస్ బుక్ వంటి నెట్ వర్క్స్ లో స్టేటస్ అప్ డేట్ చేయడం వింత ట్రెండే కదా.

హ్యాష్ ట్యాగ్
ప్రస్తుతం ఎక్కువ ట్రెండ్ క్రియేట్ చేసిన వాటిలో హ్యాష్ ట్యాగ్ ఒకటి. కపుల్స్ వాళ్ల పేర్లు, లేదా ఫీలింగ్స్ ని హ్యాష్ ట్యాగ్స్ కి జతచేసి.. డైరెక్ట్ గా పోస్ట్ చేస్తున్నారు. ఎలాంటి ఫోటో పెట్టినా.. హ్యాష్ ట్యాగ్స్ కంపల్సరీ ఉంటున్నాయి.

ఫస్ట్ డేట్ సెల్ఫీ
ఫస్ట్ డేట్ సెల్ఫీ చాలా అందంగా, క్యూట్ గా ఉంటుంది. అలాగే.. ఇద్దరి మధ్య ప్రేమను ఎప్పటికైనా చూసుకుని సంతోషించవచ్చు. కానీ.. ప్రపంచానికంతటికీ.. ఈ విషయాన్ని చెప్పడం అవసరమా ?

సెక్స్ తర్వాత
బెడ్ లైఫ్ గురించి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో పోస్ట్ చేసే అలవాటు ఎంత ఆశ్చర్యంగా ఉందో కదూ. నిజమే.. కొంతమంది క్రేజీ కపుల్స్ ఇలానే సెక్స్ తర్వాత వాళ్ల సెల్ఫీలు తీసుకుని పబ్లిక్ గా పోస్ట్ చేస్తున్నారు.

టాటూస్
మీరు అమితంగా ప్రేమించే మీ ప్రేయసి లేదా ప్రేమికుడి ట్యాటూ శరీరంపై పొడిపించుకోవడం చాలా క్రేజీ విషయమే. కానీ.. శరీరంలోని రకరకాల భాగాల్లో ఇలా ట్యాటూలు పొడిపించుకుంటున్నారు. అంతేనా.. వాటిని ధైర్యంగా పబ్లిక్ గా ప్రమోట్ కూడా చేసేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని ఎవరు తెలుసుకోవాలనుకుంటారు. ఇదో క్రేజీ ట్రెండ్ కాకపోతే.

బేబీ పుట్టగానే ఫోటో
బేబీ పుట్టీ పుట్టగానే.. ఫోటో తీసేస్తున్న ఈ జనరేషన్ పేరెంట్స్. ఇంకా చర్మమంతా చాలా స్మూత్ గా ఉంటుంది. స్కిన్ ట్యాగ్స్ అలానే ఉంటాయి. కానీ.. వెంటనే ఫోటో తీసి.. పబ్లిక్ గా అనౌన్స్ చేసేస్తారు. కనీసం ఆ బిడ్డ ఊపిరి పీల్చుకోవడానికైనా ఛాన్స్ ఇవ్వండి.

కొటేషన్స్
కొటేషన్ తో ఫోటోలు పోస్ట్ చేయడమనేది ఇప్పుడు ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. అది కూడా.. తన బాయ్ ఫ్రెండ్ ని హాట్ గా ఉన్నాడని.. ఇలా రకరకాల కామెంట్స్, కొటేషన్స్ తో పబ్లిక్ గా ఫోటో అప్ లోడ్ చేయడం ఒక ట్రెండ్ లా మారింది. కానీ ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ ఎలా తీసుకుంటారనే విషయాన్నే ఒక్కసారి ఆలోచించాలి.



Click it and Unblock the Notifications